నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కం డెబ్యూ సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ని షేర్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. తనకు బాలయ్యకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. దానికి తోడు ఇటీవలే జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ రాకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. …
Read More »బాబు టీంకు ఫుల్ మార్కులు.!
వరద బాధితులకు సాయం చేయడంలో మంత్రులు పడుతున్న కష్టం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉం ది. రాజకీయంగా దూకుడు ఉండే అనేక మంది నాయకులు బాధితుల కష్టాలు చూసి కరిగిపోతున్నారు. విజయవాడ శివారు ప్రాంతం మునిగిపోయిన నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు.. సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులను కూడా రావాలని ఆయన పిలుపు నిచ్చారు. దీంతో ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన …
Read More »టెక్సాస్ స్టేట్ రోడ్డు ప్రమాదంలో మనోళ్లు నలుగురు దుర్మరణం
నాలుగు నిండుప్రాణాల్ని తీసింది రోడ్డు యాక్సిడెంట్. ఉన్నత విద్య కోసం.. డాలర్ డ్రీమ్స్ ను తీర్చుకోవటానికి అమెరికాకు వెళ్లిన నలుగురు భారతీయులు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో …
Read More »ఒక్క వైసీపీ నేత కనిపిస్తే ఒట్టు!
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే.. నాయకులు ముందుకు రావాలి. నాయకులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు రావడం కాదు! ఇదీ.. రాజకీయంగా ఎవరైనా చెప్పేమాట. కానీ.. అదేంటో కానీ.. వైసీపీలో మాత్రం ఈ తరహా రాజకీయం ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఏపీ మొత్తం కాకపోయినా.. దాదాపు 5 జిల్లాలు ప్రస్తుతం నీటి దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు రాత్రులు, మూడు పగళ్లుగా వరదలో చిక్కుకున్నవారు అలమటిస్తున్నారు. తమకు కనీసం ఆహారం అందించినా.. …
Read More »విజయవాడలో.. ప్రాంతాల వారీగా పర్యవేక్షించే అధికారులు వీరే..
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు. అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు… విజయవాడ సెంట్రల్ 1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822 2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153 3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124 4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481 5. …
Read More »విజయవాడకు ఏమైంది? చరిత్రలో తొలిసారి అంత వాన?
ఈ తరం చూడని వానతో విజయవాడ వణికిపోయింది. ఇదే విషయాన్ని రికార్డుల్లో చూస్తే.. షాకింగ్ నిజం వెలుగు చూసింది. 20 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎప్పుడూ లేని విధంగా ఒక రోజు వ్యవధిలో కురిసిన 29 సెంటీమీటర్ల మాయదారి వాదనకు బెజవాడ మొత్తం బెంబేలెత్తింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వన్ టౌన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. ఈ షాకింగ్ ఉదంతంలో …
Read More »గుడ్లవల్లేరు ఘటన రోజా షాకింగ్ కామెంట్స్
వైసీపీ నాయకురాలు, జబర్దస్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై తాజాగా రోజా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా.. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఘటనతో సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటన సభ్యసమాజానికి మాయని మచ్చగా మారిపోయిందన్నారు. ఈ ఘటనపై …
Read More »జగన్ కోసం ఆయన చేసిన త్యాగాలు ఏంటి?
వైసీపీకి రాజీనామా చేయనున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. జగన్.. తనకు ఎన్నో పదవులు ఇచ్చారని.. అయినా.. ఆయనను తాను మోసం చేసి ఇప్పుడు పార్టీ మారుతున్నానన్న వైసీపీ నేతలకు తాను బదులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో జగన్ కోసం తాను ఎన్ని త్యాగాలుచేశానో.. వీరికి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోపిదేవి మాట్లాడుతూ.. …
Read More »మూడో పెళ్లి చేసుకుంటారా.. ఆమిర్ బదులేంటి?
బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన, అలాగే గౌరవనీయ వ్యక్తుల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో ఒక సమయంలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్న్నాడు ఆమిర్. కానీ ఆయన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. తన తర్వాతి చిత్రంతో ఆమిర్ బలంగా పుంజుకుంటాడని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఇక ఆమిర్ వ్యక్తిగత జీవితం కూడా తరచూ చర్చనీయాంశం అవుతుంటుంది. రీనా దత్తాను …
Read More »కేరళ ఫిలిం ఇండస్ట్రీలో కలకలం
సినిమాలతో పాటు వివిధ రంగాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల గురించి కొన్నేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఒక దశలో ‘మీ టూ’ పేరుతో ఉద్యమం పతాక స్థాయిలో సాగింది. అందుకు ప్రధాన కారణం.. ఓ మళయాల స్టార్ హీరోయిన్ మీద ఒక హీరో కక్ష గట్టి తన అనుచరులతో ఆమెను కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులు చేయించడం. అప్పుడు మొదలైన ఈ ఉద్యమం ఒక రెండేళ్ల పాటు …
Read More »సర్కారుకు హైడ్రా నివేదిక.. సంచలన విషయాలు ఇవీ!
గత కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఆక్రమణ దారులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మేనేజ్మెంట్, ప్రొటెక్షన్ ఏజేన్సీ(హైడ్రా) తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించింది. గత జూన్ 27వ తేదీన రంగంలోకి దిగిన హైడ్రా పలు అక్రమ కట్టడాలను కూల్చి వేయడంతో పాటు.. ఆక్రమిత స్థలాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్, ఐపీఎస్ రంగనాథ్ సర్కారుకు అందించారు. నివేదిలో …
Read More »సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి
సౌదీ అల్ హసాలో టవర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న షహబాజ్ ఖాన్ (27) అనే తెలంగాణ కరీంనగర్ కు చెందిన యువకుడు ఎడారిలో జీపీఎస్ పనిచేయక తప్పిపోయి చనిపోయాడు. తనతో పాటు ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా చనిపోయాడు. 5 రోజుల క్రితం తనతోపాటు ఉండే వ్యక్తితో కారులో బయటకు వెళ్లారు. జీపీఎస్ లేక దారి తప్పి రబ్ అల్ ఖలీ అనే ప్రమాదకరమైన ఎడారిలోకి వెళ్లారు. కారులో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates