టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. కోహ్లీకి లండన్ ప్రత్యేకంగా ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. క్రికెట్ పర్యటనలలో భాగంగా కాకుండా, కుటుంబంతో కలిసి కూడా లండన్ వెళ్లడం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుందట. తాజాగా కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి కోహ్లీ లండన్‌లోని సొంత ఇల్లు కట్టుకొని అక్కడ జీవితాన్ని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ క్రికెట్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నప్పటికీ, రిటైర్మెంట్ తర్వాత లండన్ అతని మిత్ర ప్రాంతంగా మారుతుందట. కోహ్లీ ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్, ప్రదర్శనలను చూస్తే 2027 వరల్డ్ కప్ వరకు ఆడగలడని శర్మ అభిప్రాయపడ్డారు.
అస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ కాస్త తడబడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ, మిగతా మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేదు. ఇక తదుపరి రెండు మ్యాచ్ లో తప్పకుండా ఫామ్ లోకి వస్తాడాని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఇప్పట్లో ఆలోచించాల్సిన అవసరం లేదని కోచ్ తెలిపారు.
ఇక కోహ్లీ క్రికెట్ కెరీర్‌లో అత్యున్నత ప్రదర్శనలతోనే కాకుండా, వ్యక్తిగత ప్రణాళికలతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రపంచంలో అత్యంత సంపన్న ఆటగాళ్లలో ఒకడిగా కోహ్లీ ఉన్నాడు. ఇక లండన్‌లో స్థిరపడటంపై వస్తున్న వార్తలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఆ విషయంలో కోహ్లీ ఏదైనా వివరణ ఇస్తాడో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates