Trends

నిహారిక విడాకులపై మొదటిసారి స్పందించిన నాగబాబు

టాలీవుడ్లో ఎంతో వేడుకగా జరిగిన సెలబ్రెటీ పెళ్ళిళ్ళలో కొణిదెల నిహారిక-చైతన్యలది ఒకటి. నాగబాబు తనయురాలైన నిహారికకు, చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడికి 2020లో ఆడంబరంగా పెళ్లి చేశాయి ఇరు కుటుంబాలు. కానీ మూడేళ్లకే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇక అప్పట్నుంచి నిహారిక సింగిల్‌గానే ఉంటోంది. నిహారికది చిన్న వయసే కావడంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని శ్రేయోభిలాషులు కోరుకుంటూ ఉంటారనడంలో సందేహం లేదు.  కూతురు విడాకులు …

Read More »

హైదరాబాద్‌లోని ఆలయానికి అంబానీ భారీ విరాళం

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నుండి భారీ విరాళం అందింది. కోటి రూపాయల మొత్తాన్ని ఆమె ఆలయ అభివృద్ధి కోసం అందజేశారు. ఈ విరాళం బుధవారం ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ అయిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ 23న నీతా …

Read More »

ఇరాన్ పై దాడి: ట్రంప్ నిర్ణయం అప్పుడే…

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. రాబోయే రెండు వారాల్లోగా ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టాలా వద్దా అన్న అంశంపై తుది నిర్ణయం వెల్లడించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నా, అవసరమైతే బలాన్ని ఉపయోగించడానికీ వెనుకాడబోనని కూడా స్పష్టం చేశారు. …

Read More »

నిత్యానంద ఏ ‘దేశంలో’ ఉన్నారో చెప్పేసిన శిష్యురాలు

వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు నిత్యానంద ఎక్కడున్నారనే సందేహాలకు తాజాగా ఒక సమాధానం లభించింది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం విచారిస్తున్న కేసులో, నిత్యానంద శిష్యురాలు అర్చన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, నిత్యానంద ప్రస్తుతం ఆస్ట్రేలియా సమీపంలోని “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారట. ఈ సమాచారం ధర్మాసనంలో చర్చకు దారి తీసింది. మదురై ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకుండా 2022లో …

Read More »

అమెరికాకు ఎయిరిండియా బ్లాక్‌బాక్స్‌.. ఎందుకంటే?

గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కొద్ది నిమిషాల వ్యవధిలోనే కూలిపోవడం వల్ల 270 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోరం అందరినీ కుదిపేసింది. ఈ విషాద ఘటనకు కారణాలను వెలికితీయాలంటే బ్లాక్‌బాక్స్ కీలక ఆధారంగా మారుతుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిందని అధికారులు గుర్తించారు. దాంతో, …

Read More »

ఫోన్ ట్యాపింగ్.. షర్మిళకు సుబ్బారెడ్డి జవాబు

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎంతోమంది ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో సోషల్ మీడియాలో కనిపిస్తున్న జాబితా చూసి అందరూ షాకవుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిళ సైతం తన ఫోన్ ట్యాప్ …

Read More »

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే… ఏఐ కెమెరాకి చిక్కినట్టే!

వాహనం నడిపేటప్పుడు ఒక క్షణం అజాగ్రత్తగా ఉన్నా భారీ జరిమానా తప్పదు. ఎందుకంటే, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కళ్లలా వ్యవహరిస్తున్న కొత్త టెక్నాలజీ రంగంలోకి దిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో మొదటిసారిగా ‘ఏఐ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్’ అమలులోకి వచ్చింది. దీనివల్ల సిగ్నల్ దాటినా, హెల్మెట్ లేకుండా వెళ్లినా, బెల్ట్ వేసుకోకుండా డ్రైవ్ చేసినా మీ ఫోన్‌కు చలాన్ రసీదు వచ్చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రద్దీ ఎక్కువగా ఉన్న కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ …

Read More »

ఇంకా నయం.. హనీమూన్‌కు తీసుకెళ్లి చంపలేదు!

ఉత్తర్ ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కొత్తలోనే భార్య ప్రియుడితో పారిపోయింది. అయితే దీనిపై భర్త స్పందించిన తీరు సంచలనంగా మారింది. “హనీమూన్‌కు తీసుకెళ్లి రాజా రఘువంశీలా హత్య చేయలేదని బతికి బయటపడ్డాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఇటీవల మెఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసును మరోసారి గుర్తు చేస్తోంది. మే 17న సునీల్ …

Read More »

ఇరాన్ – ఇజ్రాయిల్.. వాట్సాప్ తో హత్యలా?

ఇరాన్‌లో కీలక వ్యక్తులపై జరుగుతున్న సుతిమెత్తని హత్యల వెనక డిజిటల్ సమాచారమే కారణమా? ఇదే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజా వివాదంలో ఫోకస్ గా మారింది వాట్సాప్ యాప్. ఈ యాప్ ద్వారా వినియోగదారుల డేటా ఇజ్రాయిల్ ఆర్మీకి లీకవుతోందన్న అనుమానాల నేపథ్యంలో.. ఇరాన్ ప్రభుత్వం ప్రజలను వాట్సాప్ తొలగించమంటూ పిలుపునిచ్చింది. ఇరానియన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసిన ఓ ప్రకటనలో, వాట్సాప్ యాప్ వినియోగదారుల …

Read More »

ఫ్లైఓవర్‌లో ‘ఫ్రీ కార్ వాష్’ – వీడియో వైరల్

కర్ణాటకలో కొత్తగా ప్రారంభమైన ఓ ఫ్లైఓవర్‌.. కేవలం 15 రోజులకే దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్కా వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నుంచి భారీగా వర్షపు నీరు కిందకి కార్లపై పడుతుండటం, దాని వీడియోలు వైరల్ కావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ కల్లడ్కా ఫ్లైఓవర్‌ను జూన్ 2న ఆర్ట్ఎస్సెస్ నేత కళ్లడ్కా ప్రభాకర్ భట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. దాదాపు 8 ఏళ్ల …

Read More »

ఐటీఆర్ ఫైల్ చెయ్యాల్సింది వీరు మాత్రమే…

పన్ను చెల్లింపుదారులలో టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్) కట్ అయిందంటే పన్ను బాధ్యత పూర్తయ్యిందని అనుకునే వారు చాలామంది. కానీ నిపుణులు చెబుతున్న విషయం మాత్రం భిన్నంగా ఉంది. మీరు ఎంత టీడీఎస్ కట్ అయినా సరే, కొన్ని పరిస్థితుల్లో ఐటీఆర్ (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దాఖలు చేయకపోతే ముమ్మాటికీ సమస్యలు ఎదురవుతాయి. టీడీఎస్ అంటే ముందే మీ ఆదాయం నుండి పన్నును మినహాయించడం. ఉదాహరణకు జీతం, ఫిక్సెడ్ …

Read More »

కెప్టెన్సీ అవకాశాన్ని వదులుకోవడంపై స్పందించిన బుమ్రా

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందుగా బుమ్రా కెప్టెన్ అవుతాడనే ఊహాగానాలు గట్టిగానే పుట్టుకొచ్చాయి. కానీ ఆకస్మికంగా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే బుమ్రాకు పగ్గాలు ఎందుకు ఇవ్వలేదనే విషయంలో చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక ఫైనల్ గా ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా తన వివరణ అయితే ఇచ్చాడు. ఈ మధ్యే దినేష్ కార్తీక్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బుమ్రా స్పందించాడు. “బీసీసీఐ నాకు కెప్టెన్సీ బాధ్యతలు …

Read More »