అధ్యాత్మ పర్యటన కోసం బయలుదేరిన భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్‌లోని బఫెలో నగరం నుంచి వెస్ట్ వర్జీనియాలోని ప్రముఖ ఆధ్యాత్మిక స్థలం “ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్” దర్శనానికి వెళ్తున్న వీరు, మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మరణించారు. బఫెలో దివాన్ కుటుంబానికి చెందిన ఈ ఘటన విషాదం నింపింది. మృతులను కిషోర్ దివాన్ (89), ఆశా …
Read More »బాపట్ల క్వారీలో ఆరుగురి మృతి… విచారణకు బాబు ఆదేశం
ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆదివారం ఓ ఘోర ప్రమాదం సంభవించింది. బాపట్ల జిల్లా బల్లికురువ మండల పరిధిలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్ల కూలిన ఘటనలో ఆరుగురు కూలీలు ఆ బండల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం …
Read More »ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఇంత బలుపా?
ఇండియన్ క్రికెట్లో ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలి. ఘోర పరాజయం తప్పదనుకున్న మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో డ్రాతో గట్టెక్కింది టీమ్ ఇండియా. ప్రత్యర్థి జట్టుకు 300కు పైగా ఆధిక్యం సమర్పించుుకని.. ఐదు సెషన్లకు పైగా ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి, ఒక్క పరుగూ చేయకముందే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తుందని ఎవ్వరూ ఊహించరు. కానీ కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, …
Read More »పాకిస్థాన్‌తో క్రికెట్.. అశ్విన్ కౌంటర్
గత కొన్ని నెలల్లో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఎంతగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక ఉన్నది పాకిస్థానే అని స్పష్టమైన సమాచారం ఉండడంతో ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటూ పోతోంది భారత్. ఈ క్రమంలోనే భారత్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే సింధు జలాల విషయంలోనూ ఆంక్షలు విధించింది. క్రీడల పరంగా కూడా పాకిస్థాన్‌తో ఏ రకమైన సంబంధమూ పెట్టుకోకూడదన్న డిమాండ్లు వినిపిస్తున్న …
Read More »‘ఐ లవ్యూ’ చెప్పడం తప్పుకాదు: హైకోర్టు
ఐ లవ్యూ.. తన ప్రేమను వ్యక్తీకరించేందుకు సహజంగా యువతీ యువకులు చెప్పే మాట ఇది. అయితే.. ‘ఐలవ్ యూ అనే పదాన్ని చాలా పెద్దదిగా భావిస్తాం. ఒక రకంగా.. ఇది ఎంతో ధైర్యం ఉంటే తప్ప.. చెప్పే మాటగా కూడా పరిగణించం. పైగా.. ఒక యువతి లేదా.. బాలికకు.. యువకులు ‘ఐలవ్ యూ’ చెప్ప డాన్ని తప్పుగా కూడా భావించే రోజులు ఉన్నాయి. పెద్దలు దీనిని అసలు ఒప్పుకోరు. ఐలవ్ …
Read More »అమెరికా మార్కెట్: చైనాకు భారత్ దెబ్బ
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్ల హవా నడుస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ ఫోన్లు వినియోగించే దేశాల్లో ఒకటైన అమెరికాలో భారతీయ ఫోన్లు బలంగా అడుగుపెడుతున్నాయి. 2024 మొదటి ఐదు నెలల్లో భారత్ అమెరికాకు 21.3 మిలియన్ యూనిట్ల స్మార్ట్ఫోన్లు ఎగుమతి చేసింది. అంతేకాదు, మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా ఏకంగా 36 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయానికి ఇది కేవలం 11 శాతమే. ఇదే …
Read More »చాట్ జీపీటీతో జర భద్రం
చాట్ జీపీటీపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ చేసిన తాజా వ్యాఖ్యలుకు ప్రపంచవ్యాప్తంగా యూజర్లు షాక్‌కు గురవుతున్నారు. ఇప్పటివరకు ‘రహస్యంగా ఉండే’ టెక్నాలజీగా భావించబడిన చాట్ జీపీటీ వేదికపై షేర్ చేస్తున్న సమాచారాన్ని అవసరమైతే బయటపెడతామని ఆయనే స్వయంగా ప్రకటించారు. ముఖ్యంగా న్యాయపరమైన అంశాల్లో కోర్టు ఆదేశాలు వస్తే, యూజర్ల డేటాను బయటపెడతామని ఆయన స్పష్టంగా చెప్పారు. చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తిగత చర్చలు, ఐడియాలు, ఫొటోలు …
Read More »దర్శన్ బెయిల్ రద్దు కాబోతోందా?
కన్నడ కథానాయకుడు దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించినట్లు అభియోగాలు ఎదుర్కోవడం గత ఏడాది ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కారణాలు ఏవైనా కానీ.. రేణుకస్వామిని దర్శన్ అండ్ కో హింసించిన తీరు ఘోరాతి ఘోరం. తన గాయాలు, అనుభవించిన చిత్రహింస గురించి మీడియాలో వచ్చిన వార్తలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు …
Read More »జీఎస్టీ ఎఫెక్ట్: కర్ణాటకలో కాఫీ, టీలు బంద్!
దేశంలో అత్యధికంగా కాఫీ, టీలు విక్రయించే, వినియోగించే వారి జాబితాలో కర్ణాటక తొలిస్థానంలో ఉంది. ఇది జాతీయ గణాంకాలు చెబుతున్న లెక్క. రెండోస్థానంలో రాజస్థాన్ ఉండగా.. మూడో స్థానంలో పంజాబ్, నాలుగులో ఏపీ ఉన్నాయి. అయితే.. తాజాగా కర్ణాటకలోని అన్ని ప్రముఖ టీ, కాఫీ విక్రయాలు జరిపే.. హోటళ్లు, క్యాంటీన్లు.. వాటి విక్రయాలను నిలిపివేశాయి. ఈ మేరకు బోర్డులు కూడా పెట్టాయి. ఇక, ఆయా హోటళ్లు, కేఫ్‌లలో బ్లాక్ టీ …
Read More »ఇంగ్లాండ్ పర్యటన నుంచి నితీష్ ఔట్
గత ఏడాది ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. చాలా వేగంగా స్టార్ ఆటగాడైపోయాడు. ఐపీఎల్లో మెరిసిన కొన్ని నెలలకే భారత జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటిన అతను.. గత ఏడాది చివర్లో ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కావడం.. అక్కడ ఓ టెస్టులో సూపర్ సెంచరీ సాధించి సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలతో ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కూ …
Read More »భార్యకు భరణం చెల్లించలేక దొంగతనం
నెలకు రూ.6,000 భార్యకు భరణం చెల్లించలేక, ఓ వ్యక్తి చివరకు గొలుసు దొంగగా మారిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. నాగ్‌పూర్ నగరానికి చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే నిరుద్యోగి, కోర్టు ఆదేశాల మేరకు మాజీ భార్యకు ప్రతినెలా భరణం చెల్లించాల్సి ఉండగా, ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు …
Read More »పాముని పట్టిన సోనూ సూద్
ముంబైలో ప్రముఖ నటుడు సోనూ సూద్ తాజాగా చేసిన ఒక ధైర్యసాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల, తన సొసైటీలోకి ప్రవేశించిన పామును ఒంటి చేత్తో పట్టుకుని, ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేయడానికి చర్యలు తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లు సోనూ సూద్‌ని నిజమైన హీరోగా ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే, ముంబైలోని తన నివాసం వద్ద పాము ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయంతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates