కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై శుక్రవారం అద్భుతమే జరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో కుప్పకూలిపోగా… అది గమనించిన ఓ కానిస్టేబుల్ ఆయనకు సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ చేసి బతికించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా వెంకన్నే కానిస్టేబుల్ రూపంలో వచ్చి… తన దర్శనం కోసం వచ్చిన భక్తుడి ప్రాణాలను కాపాడారని స్వామి వారికి గోవింద నామ స్మరణలు చేశారు. ఈ ఆసక్తికర ఘటన కాస్తంత ఆలస్యంగా …
Read More »ధోనీ నిర్ణయంతోనే జట్టులో చోటు కోల్పోయా
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, తన కెరీర్లో కీలక సమయంలో జట్టులోంచి పక్కన పడటానికి అప్పటి కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ నిర్ణయమే కారణమని బహిరంగంగా చెప్పాడు. ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఇర్ఫాన్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. శ్రీలంకతో మ్యాచ్‌లో తాను, అన్న యూసఫ్ పఠాన్ కలిసి క్లిష్ట పరిస్థితుల్లో విజయాన్ని అందించినప్పటికీ, ఆ తరువాతి సిరీస్‌కే తనను పక్కన …
Read More »రొనాల్డో ఇండియాకు వస్తాడా?
ఫుట్‌బాల్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ దక్కే అవకాశం ఉంది. పోర్చుగీస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో భారత్‌లో ఆడే అవకాశం వచ్చేసింది. AFC చాంపియన్స్ లీగ్ టూ 2025 -26 డ్రాలో సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్ర్, భారత సూపర్ లీగ్ జట్టు FC గోవా ఒకే గ్రూప్‌లోకి వచ్చాయి. ఈ గ్రూప్ Dలో ఇరాక్‌కి చెందిన అల్ జావ్రా FC, తజికిస్తాన్ క్లబ్ FC ఇస్తిక్లోల్ కూడా ఉన్నాయి. …
Read More »సుదర్శన చక్రం: భారత ఆకాశానికి కొత్త కవచం
భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలపరచడానికి “సుదర్శన చక్రం” పేరుతో ఒక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రణాళికను ప్రకటించారు. ఇది కేవలం క్షిపణి రక్షణ కవచమే కాకుండా, సైబర్ దాడుల నుండి భౌతిక దాడుల వరకు విస్తృత భద్రతను కల్పించే వ్యవస్థగా ఉండనుంది. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’, అమెరికా ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ …
Read More »జీఎస్టీ సింప్లిఫికేషన్: ఇక రెండు శ్లాబు రేట్లు మాత్రమే
దేశ పన్ను విధానంలో పెద్ద మార్పు రాబోతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% జీఎస్టీ రేట్లను తగ్గించి, కేవలం రెండు శ్లాబులకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి నాటికి ఈ మార్పులు అమల్లోకి రావచ్చని సూచనలు ఉన్నాయి. దీని ద్వారా సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, పరిశ్రమలపై ఉన్న పన్ను భారం తగ్గి, వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రధాని మోదీ స్వాతంత్ర్య …
Read More »ఎక్కడివారక్కడే!…తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం!
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో గడచిన కొన్ని రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రోజుల తరబడి వర్షం కురుస్తుండగా… తాజాగా బుధవారం నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధవారం రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. …
Read More »హైదరాబాద్‌కు ఏమైంది పట్టపగలు దోపిడీ కాల్పులు
హైదరాబాద్ మహానగరం అంటే ప్రస్తుతం పెట్టుబడులకు గమ్యస్థానం. రియల్ ఎస్టేట్ రంగానికి పసిడి నగరం. అదేసమయంలో స్టార్టప్‌లు, మెట్రోలు ఇలా అనేక సంస్థలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ నగరాన్ని ప్రపంచ స్థాయికి చేర్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే అలాంటి నగరంలో పట్టపగలు దోపిడీలు పెరిగిపోతున్నాయి. 24 గంటల కిందట శంషాబాద్‌లోని ఓ అపార్ట్మెంటులో భారీ దోపిడీ జరిగింది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఈ …
Read More »కిరాణా కొట్టు యజమానికి.. కోహ్లీ, పాటిదార్, ABD వరుస కాల్స్!
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న గ్రామంలో కిరాణా వ్యాపారి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. వరుసగా వచ్చే ఫోన్ కాల్స్‌లో ఒక్కొక్కరు నేను విరాట్ కోహ్లీ, నేను ఏబీ డివిలియర్స్ అని చెప్పడం మొదలుపెట్టారు. మొదట ఇది ఫ్రాంక్ కాల్ అనుకున్న వ్యాపారి, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాజత్ పాటిదార్ స్వయంగా ఫోన్ చేయడంతో కథ మలుపు తిప్పుకుంది. నిజం తెలియని ఆ వ్యక్తి “నేను సీఎస్కే …
Read More »2027 వరల్డ్‌కప్: విరాట్ – రోహిత్ ఉండాలంటే..
టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం వన్డే క్రికెట్లోనే ఉన్నారు. కానీ 2027 వన్డే ప్రపంచకప్‌లో వీరి ప్రస్థానం కొనసాగాలంటే బీసీసీఐ ఒక కీలక షరతు పెట్టినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ఈ కండీషన్ కు ఒప్పుకోకపోతే, వన్డే ఫార్మాట్లో కూడా వీరి ప్రయాణం త్వరగా ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభమయ్యే …
Read More »లైంగిక సమ్మతికి 18ఏళ్లు తప్పనిసరి: కేంద్రం క్లారిటీ
భారతదేశంలో లైంగిక సంబంధాలకు కనీస వయోపరిమితి 18ఏళ్లే తప్పనిసరి అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో, ఈ వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. పిల్లలను రక్షించేందుకు, మైనారిటీలపై లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 18ఏళ్ల వయోపరిమితిని ఉద్దేశపూర్వకంగా, పూర్తిగా ఆలోచించి అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని పిల్లల భద్రత …
Read More »ఆ దేశ అధ్యక్షుడి పై 430 కోట్ల బౌంటీ
వెనుజులా.. ప్రపంచంలో మాదక ద్రవ్యాల రవాణాలో ముందున్న దేశంగా ప్రాచుర్యం ఉంది. ఈ దేశ అధ్య క్షుడు.. నికోలస మదురోని అరెస్టు చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే.. ఆయన అంతుచిక్కని నాయకుడిగా మారారు. అమెరికాను, ఆదేశ ఆధిపత్యాన్ని కూడా తృణప్రాయంగా భావిస్తున్నారు. పైగా.. అమెరికాను టార్గెట్ చేసు కుని మాదక ద్రవ్యాలను(డ్రగ్స్)ను రవాణా చేస్తున్నారు. ఇటీవల 30 టన్నుల కొకైన్‌ను పట్టుకున్న ఎఫ్ బీఐ అధికారులు దీనికి మూలాలు.. వెనుజులా …
Read More »మగాడి వీక్నెస్ తో డేటింగ్ దందా
ఈ రోజుల్లో ‘డేటింగ్ యాప్స్’ పేరుతో యువకులు కొత్త మోసాలకు బలి అవుతున్నారు. సింగిల్స్‌కు, పెళ్లి కాని ప్రసాదులకు నెట్లో పరిచయాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి డేటింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయమయ్యాడు. కొన్నాళ్లే కాకుండా ఆ యువతి తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పి రూ.70,000 దక్కించుకుంది. తర్వాత మళ్లీ డబ్బు అడిగినప్పుడు మోసపోయానని గ్రహించాడు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates