ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎవరంటే మరో మాట లేకుండా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పేస్తారు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతడికి భారీగా అభిమానులున్నారు. సోషల్ మీడియాలో ఈ తరం ఉత్తమ క్రికెటర్ ఎవరు అనే పోల్ పెడితే.. కోహ్లీకే ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. ఐతే క్రికెట్ అభిమానుల ఫేవరెట్ వెబ్ సైట్ ‘క్రిక్ ఇన్ఫో’ పెట్టిన ఓ పోల్‌లో …
Read More »దూరం ఎంతైనా ట్రైన్ టికెట్ 50 రూపాయలే
లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో నానా అవస్థలు పడుతున్నారు వలస కార్మికులు. ఉండటానికి గూడు లేక.. తినడానికి తిండి లేక వాళ్లు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. పెట్టే బేడా సర్దుకుని.. సామానంతా నెత్తిన పెట్టుకుని.. చిన్న పిల్లల్ని ఎండలో రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఒక చిన్న పాప ఇలా మూడు రోజులు ఎండలో నడిచి స్వస్థలానికి …
Read More »లాక్ డౌన్ … కరోనా కంటే పెద్ద వైరస్ – నిపుణులు
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నది… మన వద్ద పాపులర్ సామెత. కరోనా, లాక్ డౌన్ లకి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. మొదటి లాక్ డౌన్ మన దేశం చాలా తెలివిగా విధించింది. సరైన సమయంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఉద్యోగాలు పోయాయి. కోట్ల మందికి కూలీ పోయింది. అయినా పర్లేదు. ఎందుకంటే… ఆ లాక్ డౌన్ వల్ల కరోనా ఎంత పెద్ద ప్రమాదమో ప్రజలకు …
Read More »ఆదివారం చికెన్.. మటన్.. బ్యాన్
కరోనా కావొచ్చు.. దాని బాబాయ్ కావొచ్చు. వేళ ఏదైనా.. సందర్భం మరేదైనా సరే. ఆదివారం వస్తే చాలు.. కాసింత చికనో.. మటనో తింటే అదో లెక్క. ఎంత లాక్ డౌన్ అయితే మాత్రం పస్తులుంటామా? కరోనా పుణ్యమా అని బయటకు వెళ్లలేని వేళ.. ఇళ్లల్లోనే బంధీలుగా మారిపోయిన దుస్థితి. కలలో కూడా ఊహించని రీతిలో వారాలకు తరబడి ఇళ్లలోనే ఉంటున్న వారికి.. వారాంతం వస్తే చాలు.. కూసింత చికనో.. కాసింత …
Read More »చరిత్రలో తొలిసారి ఈనాడులో అలా జరిగిందట
ఊహించని పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటంలో ఈ మాయదారి వైరస్ తీరు వేరుగా చెప్పక తప్పదు. ఒక్క బుల్లెట్ పేలకుండా.. ఒక్క బాంబు విసరకుండా ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లిపోయేలా చేసిన ఘనత కరోనాకే దక్కుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. …
Read More »2.5 లక్షల మంది మెడపై హెచ్1బీ కత్తి
అగ్రరాజ్యం అమెరికా కలలు కల్లలు అవుతున్నాయి. ఓ వైపు కరోనా కలకలకం కొనసాగుతుండగానే మరోవైపు ఆ దేశంలో నివసిస్తున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సమస్యాత్మకంగా మారడమే కాకుండా నివసించడమే ఇబ్బందిగా మారుతోంది. ఔను. అమెరికాలో పని చేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్ చివరినాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును …
Read More »ఏపీలో 1400 దాటిన పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్క కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 386కు చేరుకుంది. అయితే,కేసుల సంఖ్యలో కర్నూలుతో పోటీపడుతోన్న గుంటూరు జిల్లాలో కేవలం 4 కేసులే నమోదు కావడం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో …
Read More »పొట్టి దుస్తుల వల్లే కరోనా… మతపెద్ద
మహిళల్లో పెరుగుతున్న అశ్లీలత, వస్త్రధారణ వల్లే కరోనా వంటి విపత్తులు వస్తున్నాయని పాకిస్థాన్ లోని ప్రముఖ మత పెద్ద, మౌలానా తారిఖ్ జమీల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. దాంతోపాటు, మీడియా అబద్దాలు చెబుతోందని, నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా సంస్థలు లేవని, అక్కడి న్యాయస్థానాలు దుర్మార్గమై పోయాయని తారిఖ్ జమీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘ఎహ్సాస్ టెలిథాన్’ అనే నిధుల సేకరణకు సంబంధించిన టెలివిజన్ లైవ్ …
Read More »ద గ్రేట్ మూర్తి నోట… కరోనాతో సహజీవనం తప్పదట
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర కామెంట్లు లెక్కలేనన్ని వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్లలో కొన్ని కామెంట్లు ఆయా రంగాలకు చెందిన కీలక వ్యక్తులు చేస్తున్నవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అమితాసక్తి రేకెత్తించేవే. ఇలాంటి కామెంట్లలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన కామెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. …
Read More »మే నెలలో 10 రోజుల పాటు బ్యాంక్ హాలిడేస్
కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నందున అత్యవసర సేవలు మినహా దాదాపుగా అన్ని రంగాలు షట్ డౌన్ అయ్యాయి. ఆసుపత్రులు, నిత్యావసరాలతో పాటు బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవ్వగా….మరోవైపు బ్యాంకుల్లో ఉన్న కొద్దిపాటి సొమ్ముతో కాలం వెళ్లదీయాలని చాలామంది బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. జన్ ధన్ ఖాతాల్లో వేసిన రూ.500 తీసుకోవడం కోసం మొదలు…రకరకాల లావాదేవీల కోసం జనాలు …
Read More »కరోనా పేషంట్ల కోసం రోబో.. ఎక్కడో కాదు ఇక్కడే
రోడ్ల మీద జనాలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో చూడటానికి సింగపూర్లో రోడ్ల మీద పోలీస్ రోబో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఈ ఉదయం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విట్టర్లో షేర్ చేశాడు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రోబోల సాయం తీసుకుంటున్నాయి. ఈ సమయంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో కరోనా పేషెంట్ల సేవల …
Read More »జూలై 31 వరకు వర్క్ ఫ్రం హోం
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు గుడ్ న్యూస్. కరోనా కష్టాల సమయంలో అందుబాటులోకి వచ్చని వెసులుబాటు విషయంలో మరింత తీపికబురు. లాక్ డౌన్ ఇబ్బందులకు దూరమయ్యేలా వర్క్ ఫ్రం హోం సౌలభ్యం సౌలభ్యం కొనసాగుతోంది. వర్క్ ఫ్రం హోం జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఢిల్లీ నుంచి అన్ని రాష్ర్టాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర …
Read More »