బైడెన్‌ మ‌న‌వ‌రాలి పెళ్లి.. ఎంత సింపుల్‌గా చేశారంటే!

అమెరికా అన‌గానే ఆడంబ‌రం, దానికి కొంత డాంబికం క‌లిసి క‌నిపిస్తాయి. ఏం జ‌రిగినా అట్ట‌హాసంగా ఉంటుంది ఇక్క‌డ య‌వ్వారం. ఇక‌, అధికారంలో ఉంటే అందునా, అధ్య‌క్ష స్థానంలో ఉంటే ఇక చెప్పేది ఏముంటుంది. ఆ హ‌డావుడికి, జోరుకు అంతా ఇంతా సంద‌డి కాదు. అయితే, వీట‌న్నింటికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప్ర‌స్తుత అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌. అంతా సింప్లిసిటీ!

ఆయ‌న ఏం చేసినా పెద్ద అట్ట‌హాసం ఉండ‌దు. ఆ సొమ్మును ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. స‌రే.. ఇదిలావుంటే, ఇప్పుడు ఆయ‌న మ‌న‌వ‌రాలి వివాహం జ‌రిపించారు బైడెన్‌. ఈమెతో కేవ‌లం కుటుంబ బంధ‌మే కాదు, బైడెన్‌కు రాజకీయంగా కూడా మునిమ‌న‌వ‌రాలు న‌వోమి బైడెన్ కీల‌క స‌ల‌హాదారు కూడా! ఇప్పుడు తాజాగా నవోమీ బైడెన్ వివాహం శ్వేత సౌధంలో శనివారం జరిగింది.

అయితే, అంద‌రూ అనుకోవ‌చ్చు.. ఆయ‌న అధ్య‌క్షుడు క‌దా అట్ట‌హాసంగా చేసి ఉంటార‌ని. కానేకాదు, చాలా చాలా సింపుల్‌గా తేల్చేశారు. పోనీ ఇది ప్రేమ వివాహం కూడా కాదు. ఏర్చికూర్చి పెద్ద‌లు చేసిన పెళ్లి. 28 ఏళ్ళ నవోమీ, పాతికేళ్ళ పీటర్ నీల్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరు వైట్ హౌస్‌ మైదానంలో పెళ్లి చేసుకున్న 19వ జంట. జో బైడెన్ అంతర్గత కూటమిలో నవోమీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేవిధంగా ఆయనను ప్రోత్సహించినవారిలో ఆమె ముఖ్య వ్యక్తి.

నవోమీ బైడెన్, పీటర్ నీల్ వివాహం వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లో జరిగింది. దేశాధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సహా దాదాపు 250 మంది అతిథులు మాత్ర‌మే హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. మీడియాను సైతం అనుమతించలేదు. అంతేకాదు.. ఈ పెళ్లికి అయిన ఖ‌ర్చును బైడెన్ త‌న జేబు నుంచి ఖ‌ర్చు చేయ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చిన అతిథుల‌కు ప‌సందైన విందును అందించారు. మ‌రి మ‌న న‌నేత‌లు అధికారంలో ఉంటే ఏ రేంజ్‌లో పార్టీలు ఇస్తున్నారో పెళ్లిళ్లు చేస్తున్నారో తెలిసిందే. మ‌రి వారంద‌రికీ బైడెన్ ఒక లెస్స‌న్ అవుతారా? చూడాలి.