Trends

కరోనా రోగులకు సాయం కోసం యువరాణి సేవకురాలైంది

కరోనా ప్రపంచాన్ని ఎంతలా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటమే కాదు.. రాజు..పేద.. అన్న తేడా లేకుండా భయపడేలా చేసింది. ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసింది. మొత్తంగా ప్రపంచం మొత్తం మారిపోయేలా చేయటమేకాదు.. కంటికి కనిపించకుండానే హడలిపోయేలా చేసింది. ఈ మహమ్మారి పుణ్యమా అని.. దేశాలకు దేశాలు కిందామీడా పడిపోతున్నాయి.ఇదిలా ఉంటే.. కరోనా బాధితులకు సాయం చేసేందుకు.. రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మరే …

Read More »

2022 వరకు సోషల్ డిస్టాన్సింగ్ తప్పదా?

ముట్టుకుంటే అంటుకునే రోగాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. కానీ ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడేలా చేసిన ఘనత మాత్రం కరోనా వైరస్‌కే దక్కుతుంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ‘సోషల్ డిస్టెన్స్’ మంత్రం జపిస్తోంది. అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం మళ్లీ మామూలు పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లే పాటు సామాజిక దూరం పాటించాల్సిందేనట. ప్రపంచ ఆర్థిక …

Read More »

ఇండియా కొత్త కేసులు 591, ఏపీ, తెలంగాణలోను తగ్గాయి !

ఇండియాలో కరోనా కేసులు 6000 మార్కు దాటింది. కాకపోతే గత 24 గంటల్లో కొత్త కేసుల పురోగతిలో కొంచెం మందగమనం కనిపించడం ఆశావహం. కరోనా లక్షణాలు బయటపడే 14 రోజుల సమయం కూడా లాక్ డౌన్ పెట్టాక దాటేశాం. అయినా కేసుల సంఖ్య తక్కువగానే నమోదు కావడం ఆశను పెంచింది. ఇప్పటివరకు దేశంలో లక్ష 30 వేల టెస్టులు చేయగా 6000 మందికి ఇది సోకినట్లు నిర్దారణ అయ్యింది. నిన్నటికి …

Read More »

ఈ డాక్టర్ త్యాగాన్ని చూస్తే.. దండం పెట్టాల్సిందే

కరోనా వేళ.. ఎంచక్కా ఇంట్లో కూర్చొని దేశాన్ని రక్షించాలని కోరితే.. చాలామంది ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు.. తమకు ఏదో పని ఉన్నట్లుగా చెప్పి రోడ్ల మీదకు వచ్చే వారే తప్పించి.. మూడు వారాలు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవటానికి మించిన పెద్ద శిక్ష మరొకటి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నోళ్లు ఎంతోమంది. ఇలాంటివేళ.. ఇంటిని వదిలేసి.. ప్రమాదకర వైరస్ తో నిత్యం యుద్ధం …

Read More »

కరోనా అక్కడ సోకింది.. ఎన్ని ప్రాణాలు పోతాయో

కరోనా వైరస్ జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వస్తే చాలా ప్రమాదం అని.. దాని వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అప్పటికి ఎంతమందికి ఈ వైరస్ ఉందో కానీ.. ఇప్పుడు వారిలో వేలమంది కరోనా బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ప్రకటించి అందరూ ఇంటిపట్టున ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. ఉన్నత, మధ్యతరగతి జనాల్లో అవగాహన ఉంటుంది. సాధ్యమైనంత వరకు …

Read More »

యాక్సిడెంట్ కేసుకి కరోనా… 40 మంది డాక్టర్లకు షాక్

ఓ కరోనా రోగికి అత్యవసర చికిత్స చేసినందుకు 40 మంది డాక్టర్లు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. పూణెలోని కడ్నీ ఏరియాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ యాక్సిడెంట్‌కు గురై ఆసుపత్రిలో చేరాడు. మార్చి 31న తీవ్ర గాయాలతో ఉన్న ఆ ఆటోడ్రైవర్‌ను ఆసుపత్రిలో తీసుకొచ్చిన అతని కుటుంబ సభ్యులు… ‘అతను ఎక్కడికి వెళ్లి రాలేదని, నగరంలోనే ఉంటున్నాడని’ డాక్టర్లకు అబద్ధం చెప్పారు.దాంతో ఎమర్జెన్సీ కేసు కింద అతన్ని ఆసుపత్రిలో చేర్చుకున్న …

Read More »

శభాష్.. హైదరబాద్ ను బాగా చూసుకుంటున్నారు

హైదరబాద్ మహానగర పురపాలక సంస్థ (GHMC) పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు వేసిన రెండు రోజులకే వాటర్ బోర్డు వాళ్లు గానీ లేదా కేబుల్ కోసమో లేదా ఇంకేదో విషయం కోసమో వెంటనే తవ్వేస్తుంటారు. జీహెచ్ఎంసీలోని శాఖల మధ్య సమన్వయం ఏ మాత్రం లేదని చాలాసార్లు నిరూపించుకున్నారు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అద్భుతంగా స్పందిస్తున్నారు. లాక్ డౌన్ …

Read More »

ఇండియాలోకరోనా వైరస్ కి సీన్ వుందా, లేదా?

కరోనా వైరస్ ఉష్ణ వాతావరణంలో జీవించలేదు, అందుకని ఇండియన్స్ కి ఏం కాదు అంటూ వైరస్ ఇండియాలోకి రాకముందు నుంచీ వాట్సాప్ సైంటిస్టులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైరస్ వచ్చేసింది అన్నా కానీ మనకేమీ కాదనే మొండి ధీమా మనలో చాలామంది చూపించారు. అయితే ఇందులో కొంత నిజం లేకపోలేదు. శీతల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ వ్యాప్తి మందకొడిగా ఉంది.కేవలం ఇండియాలో అనే కాదు, మిగతా …

Read More »

కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ ఆలోచన గ్రేట్ కదా!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్… ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు ఏడు ఫ్యాక్టరీలు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. గత నెలలో జరిగిన మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్‌కు హాజరైన బిల్ గేట్స్… తన సంపాదనలో చాలా భాగం ధాతృత్వ పనుల కోసమే వినియోగించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడమే బిల్ గేట్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.దీని వ్యాక్సిన్ …

Read More »

మీ వల్ల కరోనా వచ్చి పోతే మర్డర్ కేసే..

గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రార్థనలు నిర్వహించకుంటే  ఈపాటికి మన దేశంలో కరోనా వైరస్ చాలా వరకు కట్టడి అయ్యేదేమో. లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా కూడా అడుగులు పడేవేమో. కానీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో వందల మంది కరోనా బారిన పడటం.. వాళ్లు తమ కుటుంబ సభ్యులతో పాటు తమతో సన్నిహితంగా ఉన్న వందల మందికి వైరస్ వ్యాప్తి చేయడంతో గత వారం రోజులుగా దేశంలో …

Read More »

కరోనా కట్టడికి రైల్వే బ్రిలియంట్ ఐడియా

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో స్టేషన్లలో నిరూపయోగంగా పడి ఉన్న  రైల్వే బోగీలను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కావల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య దాదాపు 900 దాకా ఉంది. శని, ఆది వారాల్లో …

Read More »

21 డేస్.. పిచ్చిపిచ్చిగా వాడుకోండి మరి

కరోనా వైరస్ కారణంగా అందరికీ 21 రోజుల హాలీడేస్ వచ్చేశాయి. ఉదయాన్నే లేచి ఆఫీసుకి లేట్ అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్‌లో అవస్థలు, స్కూళ్లు, కాలేజీల్లో పరీక్షల పరేషాన్… ఇలా ఏ కష్టాలు లేవు. ఈ 21 రోజులు బుద్ధిగా ఇంట్లో ఉంటే చాలు. మరి 21 రోజులు ఇంట్లో ఏం చేయాలి? అన్నిరోజులంటే కాలక్షేపం ఎలా అవుతుంది? అనుకునేవారికి ఓ జపనీస్ ఫార్మూలా!ఏదైనా కొత్త అలవాటు …

Read More »