కంగ‌నా ర‌చ్చ మ‌ళ్లీ షురూ

Kangana
Kangana Ranaut

ఇండియాలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన మ‌హిళా న‌టుల్లో కంగ‌నా ర‌నౌత్ ఒక‌రు. ఆఫ్ ద స్క్రీన్ ఆమె మాట‌లు, చేష్ట‌లు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశం అవుతుంటాయి. త‌న‌కంటూ ఒక ఇమేజ్ వ‌చ్చి, ఫాలోయింగ్ పెరిగాక, లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో కొన్ని హిట్లు కొట్టాక కంగ‌నా ఎలా రెచ్చిపోతోందో చూస్తూనే ఉన్నాం.

రెండు మూడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాల‌ను అదే ప‌నిగా టార్గెట్ చేస్తూ వ‌స్తోందామె. ఈ క్ర‌మంలో ప‌లుమార్లు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఐతే రెండేళ్ల కింద‌ట‌ ఆమె మాట‌లు మ‌రీ శ్రుతి మించాయి. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌శ్చిమ బెంగాల్‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై కంగ‌నా వేసిన ట్వీట్ దుమారం రేపింది. దీంతో ట్విట్ట‌ర్ ఆమె అకౌంటుని శాశ్వ‌తంగా స‌స్పెండ్ చేసింది. కంగ‌నా ఎంత మొత్తుకున్నా ఆమె అకౌంట్‌ను పున‌రుద్ధ‌రించ‌లేదు.

దీంతో చేసేది లేక కంగ‌నా సైలెంటుగా ఉంది. ఐతే ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్‌ను కొన్నాక అన్ని చోట్లా ట్విట్ట‌ర్ ఇన్‌ఛార్జీలు మారిపోయారు. ఇండియాలో కూడా ఈ మార్పు జ‌రిగిన‌ట్లుంది. ఈ క్ర‌మంలోనే కంగ‌నా అకౌంట్ కూడా పున‌ర‌ద్ధ‌ర‌ణ అయింది. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌లాగే కంగ‌నా కూడా ట్విట్ట‌ర్లోకి తిరిగొచ్చింది. దీంతో ట్విట్ట‌ర్లో ఆమె ర‌చ్చ మ‌ళ్లీ షురూ అయిన‌ట్లే అని కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.