కోవిషీల్డ్ అంత డేంజ‌రా?

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఎన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారో తెలిసిందే. ఐతే ఆ మ‌హ‌మ్మారి ప్ర‌భావం బాగా త‌గ్గాక కూడా దాని దుష్ప్ర‌భావాలు కొన‌సాగుతూ ఇబ్బంది ప‌డుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

ఆ సంగ‌త‌లా ఉంచితే కొవిడ్ వ్యాక్సిన్లు మ‌నుషుల మీద దీర్ఘ కాలంలో ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతున్నాయ‌నే చ‌ర్చ కూడా చాన్నాళ్ల నుంచే న‌డుస్తోంది. ఎంతో ఆరోగ్యంగా క‌నిపించే చాలామంది వ‌య‌సుతో సంబంధం లేకుండా హ‌ఠాత్తుగా గుండెపోటు లాంటి కార‌ణాల‌తో చ‌నిపోతున్న తీరు విస్మ‌యం క‌లిగిస్తోంది.

ఇందుకు ఒక ర‌కంగా క‌రోనా వ్యాక్సిన్లు ఒక కార‌ణం అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ఈ విష‌యాన్ని క‌చ్చితంగా మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. ముఖ్యంగా వైద్య నిపుణులు ఈ విష‌యాల‌ను కొట్టిపారేస్తున్నారు.

ఐతే అసీమ్ మ‌ల్హోత్రా అనే భార‌త సంత‌తికి చెందిన బ్రిటిష్ కార్డియాల‌జిస్ట్.. ప్ర‌ఖ్యాత ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా త‌యారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాక్సిన్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న తేల్చేశారు.

ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల క‌న్నా కొవిషీల్డ్ దుష్ప్ర‌భావాలు మ‌నుషుల‌పై ఎక్కువ ఉన్నాయ‌ని అసీమ్ మ‌ల్హోత్రా అభిప్రాయ‌ప‌డ్డారు. కొవిషీల్డ్ వ‌ల్ల గుండెపోటు, ప‌క్ష‌వాతం త‌దిత‌ర దుష్ప్ర‌భావాలు క‌లిగాయ‌న్నారు.

బ్రిట‌న్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప‌ది శాతం మంది దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొన్న‌ట్లుగా మ‌ల్హోత్రా పేర్కొన్నారు. ఇండియాలో భార‌త్ బ‌యోటెక్ వారి కోవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను విస్తృతంగా ఉప‌యోగించారు.

ఇత‌ర వ్యాక్సిన్ల‌తో పోలిస్తే కొవిడ్ తీవ్ర‌త దృష్ట్యా చాలా హ‌డావుడిగా, పూర్తి స్థాయి ట్ర‌య‌ల్స్ లేకుండా కొవిడ్ వ్యాక్సిన్ల‌ను త‌యారు చేయ‌డం వ‌ల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయ‌ని ముందు నుంచి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి.