Trends

ప్రేయసితో, పెద్దలు చూసిన అమ్మాయితో ఒకే సమయంలో పెళ్లి

ఓ అమ్మాయిని ప్రేమించడం.. తనతో పెళ్లి కుదరక పెద్దలు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడం.. తర్వాత ప్రేయసితో బంధాన్ని కొనసాగిచంచడం.. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని వ్యవహారం నడిపించడం.. ఇవన్నీ ఎప్పుడూ వినే కథలే. కానీ తాను ప్రేమించిన అమ్మాయిని.. అలాగే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని ఒకే సమయంలో పెళ్లాడటం.. ఇందుకు ఇద్దరమ్మాయిలూ అంగీకరించడం.. అలాగే ఆ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా దీనికి అంగీకారం తెలపడం.. …

Read More »

మాస్కుతో పాటు ఈ నెంబరు కూడా యూజ్ ఫుల్ – 18005994455

కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతలా విలవిలలాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఏపీలో పాత పద్దతుల్ని కొనసాగిస్తుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని తెర మీదకు తెస్తున్నారు. ఏపీలో పాజిటివ్ అయిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా రోగ లక్షణాలు తక్కువగానూ.. స్వల్పంగా ఉన్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. హోం ఐసోలేషన్ …

Read More »

టిక్‌టాక్‌కి యాంటీ డోస్.. ఇన్‌స్టాగ్రామ్‌లో

ఇండియాలో అత్యధిక మంది ఉపయోగించే ‘టిక్ టాక్’ యాప్‌పై నిషేధం పడింది. దీంతో టిక్ టాక్ లవర్స్ అందరూ కిందా మీదా అయిపోతున్నారు. వాళ్లంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీని తాలూకు బాధ నుంచి కోలుకుని ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు చూస్తున్నారు. రొపోసో, చింగారి, గోసోషల్ సహా కొన్ని యాప్‌లు టిక్ టాక్ తరహా వినోదాన్ని, ఆప్షన్లను అందిస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను కూడా ‘టిక్ టాక్’ స్టయిల్లోకి …

Read More »

రూ.2500 ఇస్తే కరోనా నెగెటివ్ రిపోర్ట్

కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ రావాలని ప్రార్థిస్తారు అందరూ. ఐతే మీకా భయం లేకుండా నెగెటివ్ తెప్పిస్తాం.. మీకు నెగెటివ్ అని పేర్కొంటూ రిపోర్ట్ ఇస్తాం.. ఇందుకోసం కేవలం రూ.2500 ఇస్తే చాలు అని ఆఫర్ చేస్తోందట ఓ ప్రైవేటు ఆసుపత్రి. కరోనా ఉన్నా కూడా నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా మీరు సోషల్ బాయ్‌కాట్‌కు గురి కాకుండా చేస్తామంటూ ఆ ఆసుపత్రి వాళ్లు చెప్పి గుట్టుగా కరోనా నెగెటివ్ …

Read More »

చైనాకు భారత్ కంటే పెద్ద షాకిచ్చిన యాపిల్

Apple

59 చైనీస్ మొబైల్ యాప్స్ ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న సంచలన నిర్ణయంతో తగిలిన్ షాక్ నుంచే ఇంకా తేరుకోని చైనాను అమెరికా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన యాపిల్ భారీగా దెబ్బకొట్టింది. అయితే, ఇది తమ నిబంధనల సవరణలో భాగంగా మాత్రమే అని పేర్కొంది. తాజాగా యాపిల్ సంస్థ యాప్ స్టోర్ లోని 4500 చైనీస్ గేమ్ యాప్స్ ను తొలగించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో …

Read More »

లాక్ డౌన్‌ అన్నారు.. మందుబాబులు రెచ్చిపోయారు

మార్చి నెలలో ఏ సంకేతాలు లేకుండా ఉన్నట్లుండి లాక్ డౌన్ పెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్క రోజు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ అంటే.. ఆ ఒక్క రోజుకు తగ్గట్లుగా అందరూ అన్ని ఏర్పాట్లూ చేసుకుని ఇళ్లకు పరిమితం అయ్యారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ తర్వాతి రోజు నుంచి లాక్‌డౌన్ అమలు చేసింది. ఆపై కేంద్ర ప్రభుత్వం వచ్చి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టింది. అక్కడి నుంచి లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ …

Read More »

తిరుమలకు వెళ్తారా.. ఈ వార్త చూడండి

Tirumala

లాక్ డౌన్ వేళ అన్ని కార్యకలాపాలూ ఆగిపోెయాయి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూతపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే దేవాలయం అయిన తిరుమల కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలలల పాటు మూతపడింది. చివరికి గత నెలలో ఆ ఆలయాన్ని తెరిచారు. అనేక జాగ్రత్తల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కనిపిస్తున్నారు. కొందరు భక్తులు ధైర్యం చేసి తిరుమలకు వెళ్తుంటే.. చాలామంది భయంతో ఆలయ దర్శనానికి …

Read More »

కరోనాను లైట్ తీసుకున్నారా.. ఐతే ఈ స్టోరీ చదవాల్సిందే

ఈ మధ్య దర్శకుడు తేజ.. కరోనా ఉద్ధృతి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మన భారతీయుల యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చాలా చక్కగా చెప్పారు. ‘‘కరోనా నాకు రాదు.. నేను కలిసే వాళ్లకు కూడా కరోనా ఉండదు’’ అనేది మనోళ్ల ఆలోచన అని.. ఆ ధైర్యంతోనే ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా తిరిగేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇది నూటికి …

Read More »

‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఇక పై ‘గ్లో అండ్ లవ్లీ’

ఇండియాలో ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనల గురించి తరచుగా వివాదాలు, చర్చలు నడుస్తుంటాయి. తెల్లగా ఉంటేనే అందంగా ఉన్న భావన కలిగించే ఈ ప్రకటనల్ని, ఈ ఉత్పత్తుల్ని నిషేధించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. కంగనా రనౌత్ లాంటి కొందరు ఫిలిం స్టార్స్ ఇలాంటి యాడ్స్‌లో నటించకూడదని నియమం కూడా పెట్టుకున్నారు. ఇలాంటి యాడ్స్ కూడా వర్ణ వివక్షలో భాగమే అన్నది చాలామంది అభిప్రాయం. ఐతే ఎవరేమన్నా ఇండియాలో ఫెయిర్‌నెస్ క్రీమ్ బిజినెస్ …

Read More »

ఖైరతాబాద్ విగ్రహం ఒక అడుగు కాదు

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును కేవలం ఒక అడుగుకు పరిమితం చేయబోతున్నట్లు ఆ మధ్య ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం లేకపోయినా.. కనీసం టీవీల్లో అయినా బడా గణేష్‌ను చూసే అవకాశం లేదే అనుకున్నారు. మరీ విగ్రహం ఎత్తును ఒక్క …

Read More »

మేకలకు కరోనా పరీక్షలు.. క్వారంటైన్‌కు తరలింపు

కరోనాకు మనుషుల్లో చిన్నా, పెద్దా.. రాజూ పేదా అనే తేడాి లేదని అనుకున్నాం. మనుషులు, జంతువులనే తేడా కూడా లేదని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. కర్ణాటకలో తాజాగా గొర్రెలు, మేకలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం. మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా కరోనా సో్కే అవకాశం ఉందని.. వాటి నుంచి కూడా మనుషులకు కరోనా సోకవచ్చని అధ్యయనాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో …

Read More »

ఆ 59 యాప్స్‌పై నిషేధం.. 45 వేల కోట్ల నష్టం?

ఇండియాలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లను ఆపితే ఆ దేశానికి నష్టం కానీ.. చైనా యాప్‌లను నిషేధిస్తే వచ్చే నష్టమేంటి అన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. కానీ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయం గురించి తక్కువ అంచనా వేస్తే తప్పే అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ యాప్‌గా ఉన్న టిక్ టాక్‌తో పాటు మరో పాపులర్ యాప్ ‘హలో’.. ఇంకొన్ని చైనా యాప్‌ల యాజమాన్య సంస్థ ‘బైట్ డ్యాన్స్’.. …

Read More »