కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. సెకండ్ వేవ్ లక్షల మందిని వైరస్ బాధితులుగా మారుస్తోంది. రోజూ వేలమంది చనిపోతున్నారు. ఈ సమయంలో బాధితులను ఆదుకోవడానికి, అలాగే నిర్విరామంగా సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లకు సాయం చేయడానికి సెలబ్రెటీలెందరో ముందుకు వస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు. జనాల నుంచి కూడా విరాళాలు స్వీకరిస్తున్నారు. దేశంలో పరిస్థితులు చూసి చలించిపోయిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అయిన అతడి …
Read More »కొంత కాలంపాటు వ్యాక్సిన్ల కొరత తప్పదా ?
తాజాగా భారత్ బయోటెక్, సీరమ్ ఫార్మా కంపెనీల యాజమాన్యాలు కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ప్రకారం ఇదే అనుమానం వస్తోంది. జూన్-సెప్టెంబర్ మాసాలకు రెండు కంపెనీల్లో ఏది ఎన్ని డోసులను ఉత్పత్తి చేస్తుందో చెప్పాలని పై రెండు కంపెనీలను కేంద్రం కోరింది. కేంద్రం ప్రశ్నకు ఫార్మా కంపెనీల యాజామాన్యాలు ఉత్పత్తి అంచనాలను వివరించాయి. ఆగస్టుకి నెలకు 7.82 కోట్ల డోసులకు ఉత్పత్తిని పెంచుతామంటు భారత్ బయోటెక్ (కోవ్యాగ్జిన్) చెప్పింది. అలాగే ఆగస్టునాటికి …
Read More »కరోనా సెకండ్ వేవ్.. రోజుల తరబడి ఆసుపత్రుల్లోనే!
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. గత ఏడాది ఫస్ట్ వేవ్ వచ్చినా.. ఇంట్లోనే ఉంటూ.. హోం క్వారంటైన్ విధానాన్ని అవలంభిస్తే.. కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అవకాశం ఉండేది. పైగా ఆక్సిజన్ సమస్య ఎవరికీ పెద్ద రాలేదు. కానీ, సెకండ్ వేవ్‌లో అనే సమస్యలు తెరమీదికి వచ్చాయి. కరోనా రోగులు పెరుగుతుండడం.. వారికి కూడా ఆక్సిజన్ భారీ స్థాయిలో అవసరం రావడం.. గమనార్హం. అంతేకాదు.. పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో …
Read More »‘ఐఐఎస్’ అంచనా నిజమైతే.. బెంగళూరు శవాల దిబ్బే!
కరోనా విషయంలో ముందుగా హెచ్చరించలేదని బాధపడుతుంటాం. కానీ, కొన్ని కొన్ని హెచ్చరికలు మన దాకా వస్తే.. మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది! అంత భీతా వహ పరిస్థితి ఎదురవుతుందా? అని చెమటలు కూడా పడతాయి. ఇప్పుడు ఇలాంటి అంచనానే ఒకటి దేశాన్ని సైతం కలవరపరుస్తోంది. దేశంలోనే ప్రఖ్యాతి గడించిన సంస్థ.. ఐఐఎస్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్) తాజాగా కర్ణాటక రాజధాని, దేశానికే ఐటీ కేపిటల్‌గా ఉన్న బెంగళూరులో కరోనా పరిస్థితిపై అధ్యయనం …
Read More »ఐపీఎల్ కుర్రాడు.. అయ్యో పాపం
చేతన్ సకారియా.. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలో ఆగిపోవడానికి ముందు, లీగ్ ఆరంభంలో మార్మోగిన యువ ఆటగాళ్ల పేర్లలో ఇదొకటి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఐపీఎల్లో ఈ కుర్రాడు మెరుపు ప్రదర్శనలు చేశాడు. రెండు మ్యాచుల్లో మూడేసి వికెట్లు పడగొట్టాడు. ప్రతిభావంతులైన లెఫార్ట్ పేసర్లు కరవైన భారత క్రికెట్లో ఈ కుర్రాడు ఆశాకిరణంలా కనిపించాడు. సౌరాష్ట్రాకు చెందిన చేతన్ వయసు 23 ఏళ్లే. ఐతే ఈ ఐపీఎల్లో మెరుపులు …
Read More »కరోనా తగ్గిన రోగులపై ‘బ్లాక్ ఫంగస్’ దాడి
కరోనా వైరస్ వచ్చి తగ్గిన రోగులపై మరో రకమైన దాడి మొదలైంది. కరోనా వైరస్ వచ్చి కోలుకున్న వారిలో మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) సమస్య పెరిగిపోతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా వచ్చి కోలుకున్నా బ్లాక్ ఫంగస్ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స అందిచకపోతే చనిపోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్యునిటి కెపాసిటి తక్కువున్న వారిలోనే ఈ ఫంగస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని కూడా డాక్టర్లు గుర్తించారు. …
Read More »బీసీసీఐ వినూత్న ప్రయోగం
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును ఎంపిక చేయడం.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరుగా కెప్టెన్లను ఎంపిక చేయడం విదేశీ జట్ల విషయంలో చూస్తుంటాం. కానీ ఇండియన్ క్రికెట్ టీం విషయంలో సాధారణంగా ఇలా జరగదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను చూస్తుంటాం. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత సీనియర్లంతా తప్పుకుని.. ధోని నేతృత్వంలో ఓ యువ జట్టు టీ20 ప్రపంచకప్‌కు వెళ్లి …
Read More »ఐపీఎల్ ఆగింది.. కానీ కరోనా ఆగలేదు
కరోనా ధాటికి నాలుగు రోజుల కిందట ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో అరడజను దాకా కేసులు వెలుగు చూడటంతో టోర్నీని కొనసాగించే పరిస్థితి లేకపోయింది. ఎంతో సురక్షితం అనుకున్న బయో బబుల్ లోపల కరోనా కేసులు బయటపడటంతో వైరస్ ప్రభావం అంతటితో ఆగదని అర్థం చేసుకుని మరో మార్గం లేక లీగ్‌ను ఆపేసింది బీసీసీఐ. ఐతే లీగ్ ఆగినా.. …
Read More »ఆ లెజెండ్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు
సుశీల్ కుమార్.. దేశం గర్వించదగ్గ రెజ్లింగ్ క్రీడాకారుడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. 2008 ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన అతను తర్వాతి ఒలింపిక్స్‌లో రజతం అందుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగానూ అతను ఘనత వహించాడు. ఇంకా ఎన్నో గొప్ప విజయాలు, ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇలాంటి దిగ్గజ క్రీడాకారుడు ఇప్పుడు …
Read More »ఆసుపత్రి బెడ్‌పై.. మృతదేహం పక్కనే..
ఇది కొవిడ్ టైం. కరోనాతో ఎవరైనా చనిపోతే దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడిపోతాం. ఇక మనకు కూడా కరోనా లక్షణాలు ఉన్నపుడు.. వైరస్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చూస్తే కంపించిపోతాం. అలాంటిది కరోనా చనిపోయిన ఓ వృద్ధుడి పక్కనే పడుకుని రెండు గంటల పాటు అత్యవసర స్థితిలో ఆక్సిజన్ ఎక్కించుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. ఈ భయానక అనుభవాన్ని అనంతపురం జిల్లాలో ఒక యువకుడు …
Read More »ఆ క్రికెటర్ పరిస్థితి దయనీయం
వేద కృష్ణమూర్తి.. భారత మహిళల క్రికెట్‌ను అనుసరించే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ ఆల్‌రౌండ్ క్రికెటర్ భారత్ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న వేద.. తన కుటుంబంలో వరుస విషాదాలతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఆమె కుటుంబంలో జరిగిన ఘోరాలు తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. కర్ణాటకలోని కాడూర్‌లో నివసించే …
Read More »ఐసీఎంఆర్ అలా చెప్పనే లేదు
గత ఏడాది ఇండియాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అంతకుముందు ఈ పేరుతో ఓ సంస్థ ఉందని తెలియని వాళ్లు కూడా.. కరోనా ధాటికి ఆ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలను పాటించడం మొదలుపెట్టారు. దేశంలో కొవిడ్‌పై పోరులో ఈ సంస్థ ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలు ఎంతో కీలకంగా మారాయి. వాట్సాప్ యూనివర్శిటీ మేధావుల పుణ్యమా అని కోవిడ్ …
Read More »