Trends

#orangeornothing కాదు.. #orangeisnothing

మొదట్లో డెక్కన్ ఛార్జర్స్.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ రెండు ఫ్రాంఛైజీలు కూడా స్థానిక అభిమానులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. అసలు డెక్కన్ ఛార్జర్స్ తన ఫ్రాంఛైజీ పేరులో ‘హైదరాబాద్’ పదానికే చోటివ్వలేదు. అది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొన్నేళ్లకే అంతర్ధానం అయిపోయింది. ఆ తర్వాత దాని స్థానంలోకి సన్‌రైజర్స్ వచ్చింది. ఈ ఫ్రాంఛైజీకి సైతం కొన్నేళ్ల పాటు లోకల్ సపోర్ట్ అంతంతమాత్రమే. ఆట పరంగా కానీ.. మరో రకంగా …

Read More »

వార్నర్ పట్ల మరీ ఇంత దారుణమా?

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరెత్తగానే గుర్తుకొచ్చేది డేవిడ్ వార్నర్. చెన్నైకి ధోని, బెంగళూరుకు కోహ్లి, ముంబయికి రోహిత్ ఎలాగో.. హైదరాబాద్ జట్టుకు వార్నర్ అలా. చాలా ఏళ్ల నుంచి సన్‌రైజర్స్‌కు ఆడుతూ.. సారథిగా ఆ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడతను. 2016లో సన్‌రైజర్స్ టైటిల్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం వార్నరే. మొదట్లో స్థానికంగా పెద్దగా ఆదరణ లేని సన్‌రైజర్స్‌కు ఫాలోయింగ్ పెంచి.. ఆ జట్టుకు ఒక ఐడెంటిటీ తేవడంలో …

Read More »

కరోనా తీవ్రతకు అసలు కారణం ఏమిటో తెలుసా ?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విపరీతంగా పెరిగిపోవటానికి వైద్యులు, వైద్య నిపుణులు ప్రధాన కారణాన్ని వివరించారు. వాళ్ళు చెప్పినదాని ప్రకారం కరోనా ఉదృతికి ప్రధాన కారణం యువతేనట. అవునే అంగీకరించటానికి కష్టంగా ఉన్నా అసలు వాస్తవం మాత్రం ఇదేనట. ఎందుకంటే యువతలో ఇమ్యునిటి పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్దగా లెక్కచేయరు. చిన్న చిన్న సమస్యలను యువత ఎందుకు …

Read More »

ఆ క్రికెటర్ ఇంట్లో పది మందికి పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లోని వారంతా కరోనా పాజిటివ్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ …

Read More »

పొంచి ఉన్న మూడో వేరియెంట్‌: భార‌త్‌కు మ‌రింత ముప్పు!

ప్ర‌స్తుతం రెండో ద‌శ క‌రోనాతో అల్లాడిపోతున్న భార‌త్‌కు మ‌రో ముప్పు పొంచి ఉంద‌ని అంటున్నారు ప్ర‌పంచ స్థాయి వైద్య‌, ఆరోగ్య నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధ‌త అత్యంత ముఖ్య‌మ‌ని హెచ్చిస్తున్నారు. క‌రోనా మూడో ద‌శ ఇప్ప‌టికే వివిధ దేశాల్లో ప్ర‌భావం చూపిస్తోంద‌ని, దీంతో ఆయా దేశాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నార‌ని, ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలో భార‌త్‌లోనూ వ‌చ్చే రెండు మూడు మాసాల్లో …

Read More »

ఏమిటీ ప్రోనింగ్.. దాన్నెలా చేయాలి? ఎప్పుడు చేయకూడదు?

కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. భారీ కొరతను ఎదుర్కొంటున్న అంశాల్లో ముఖ్యమైనది ఆక్సిజన్. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దీని కొరత కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క.. ప్రాణాలు విడుస్తున్న వారికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇలాంటి వాటిని ఎక్కువగా మనసుకు తీసుకుంటే.. కొత్త సమస్యలు మీద పడటం ఖాయం. కరోనా వైరస్ రోగి శరీరంలోకి చేరి శారీరకంగానే కాదు.. మానసికంగా …

Read More »

బ్రేకింగ్‌: కూక‌ట్‌ప‌ల్లి లో కాల్పులు.. గార్డు మృతి.. 5 ల‌క్ష‌ల దోపిడీ!

హైద‌రాబాద్ న‌డిబొడ్డు ప్రాంతం.. కూక‌ట్‌ప‌ల్లిలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటు చేసుకుంది. కూక‌ట్‌ప‌ల్లి ఆల్విన్‌ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న హెచ్‌డీఎఫ్ సీ ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్‌తోపాటు ఏటీఎం సిబ్బందిపై దాడి చేసి.. తుపాకితో కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు …

Read More »

కరోనా పేషంట్లు మిస్సింగ్ ?

ఇపుడిదే విషయం తిరుపతిలోని ఉన్నతాధికారులను టెన్షన్ పెట్టేస్తోంది. గడచిన రెండు నెలలుగా ఒక్క తిరుపతిలోనే 9600 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో అత్యధికులు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. కొందరు క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. మరికొందరు హోం ఐసొలేషన్లో ఉన్నారు. మరికొందరు చుట్టుపక్కలున్న తమ ఊర్లకు వెళ్ళిపోయారు. ఈ నాలుగు తరగతుల రోగుల లెక్క అధికారుల దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి సమస్యా లేదు. అయితే …

Read More »

సన్‌రైజర్స్ జట్టులో ఇతనెందుకున్నాడు?

హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. వేదిక మారినా ఆ జట్టు రాత మారలేదు. ఢిల్లీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. ఒకట్రెండు ఓటములంటే కామనే కదా అనుకోవచ్చు. కానీ ఆరు మ్యాచుల్లో ఐదు ఓడిపోవడమంటే దారుణం. ఇప్పటిదాకా సన్‌రైజర్స్ చరిత్రలోనే ఇంత పేలవ ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. ప్రతి మ్యాచ్‌కూ పుంజుకుంటుందని ఆశించడం, చివరికి …

Read More »

ఆ వృద్ధుడి త్యాగానికి సలాం

ఆయన పేరు నారాయణ్ రావు దబార్కర్. వయసు 85 సంవత్సరాలు. మహారాష్ట్రాలోని నాగపూర్‌ ఆయన స్వస్థలం. దశాబ్దాల నుంచి ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)లో పని చేస్తున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది నుంచి కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఇటీవల అది పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో నారాయణ్ రావు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బంది కరంగా మారింది. …

Read More »

ఇదేం ఐపీఎల్‌ బాబోయ్

పోయినేడాది కరోనా వైరస్ ధాటికి వేసవి నుంచి అక్టోబరు-నవంబరు నెలలకు వాయిదా పడింది ఐపీఎల్. అంతే కాదు.. ఇండియాలో కాకుండా యూఏఈలో టోర్నీ నిర్వహించారు. ఎన్నో సందేహాల మధ్య అక్కడ మొదలైన ఐపీఎల్.. ఆరంభ దశలోనే తిరుగులేని మజాను అందించి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేసింది. లీగ్ చరిత్రలోనూ ఎన్నడూ లేనంతగా అత్యంత ఆసక్తికరంగా సాగాయి మ్యాచ్‌లు. కరోనా ధాటికి అల్లాడిపోయి ఉన్న భారతీయులకు ఆ లీగ్ గొప్ప ఉపశమనాన్ని అందించింది. …

Read More »

ఈ క్రికెట‌ర్ ప్ర‌శ్న‌కు జ‌వాబుందా?

‘‘కరోనా విలయతాండవం చేస్తూ ఆసుపత్రుల్లో పడకలు దొరకక రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వం ఐపీఎల్‌పై ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’.. ఇదీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై చేసిన వ్యాఖ్య. అతను ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాడు. ఐతే మన దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికుల విషయంలో తమ …

Read More »