బ్లాక్ బస్టర్ మూవీ ధూమ్ గుర్తుందా? అందులో భారీ దొంగతనాలు చేసే ఘరానా దొంగ పోలీసులు ఎంత ప్రయత్నించినా దొరకడు. హీరో పోలీసుకు ఏ మాత్రం తీసిపోని దొంగ హీరోయిజం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రీల్ కు ఏ మాత్రం తీసిపోని ఒక రియల్ సీన్ హైదరాబాద్ పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక దొంగ పోలీసులకు వీడియో కాల్ చేసి.. నా ఫోటోను స్క్రీన్ …
Read More »‘హలో.. మీరు కరోనాతో చనిపోయారు..!’
ఎవరైనా మీకు ఫోన్ చేసి.. మీరే చనిపోయారని చెబితే ఎలా ఉంటుంది..? ఓ యువకుడి విషయంలో అదే జరిగింది. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య.. బతుకు జీవుడా అనుకుంటున్న ఓ యువకుడికి.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో.. తాను చనిపోయానంటూ.. సదరు ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. అంతే.. బతికున్న తనని చనిపోయారంటూ చెప్పడంతో.. సదరు యువకుడికి మండిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు …
Read More »బ్లాక్ ఫంగస్ కేసులు.. వారిలోనే ఎక్కువ..!
కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి. అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో కరోనా బారిన పడి కోలుకున్న వారే అధికమని, …
Read More »సుప్రీం కోర్టు సంచలన ఆదేశం.. ‘కరోనా అనాథల’ దత్తత వద్దు!
దేశవ్యాప్తంగా కరోనా ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్లో వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే.. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోయి.. పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయట పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కరోనాతో తల్లిని, తండ్రిని కోల్పోయి.. అనాథలుగా మిగిలిన చిన్నారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు.. బాసటగా నిలిచి.. ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విషయం …
Read More »ఒక కాన్పులో 10 మంది.. ఆమెదే ప్రపంచ రికార్డు!
ఒక కాన్పులో ఎంతమందిని కనే అవకాశం ఉంది.. మహా అయితే ముగ్గురు.. లేదంటే ఐదుగురు.. కాదంటే ఆరుగురు.. అంతకు మించి మనసు ఆలోచించటానికి కూడా ముందుకు వెళ్లదు. అలాంటిది ఒక కాన్పులో ఒకరికి తక్కువగా క్రికెట్ టీంను కనేయటం అన్న ఊహే వణుకు పుట్టిస్తుంటుంది. తాజాగా అదే నిజమైంది. ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చిందో ‘మహా తల్లి’. ఇప్పుడీ ఉదంతం వైరల్ గా మాత్రమే కాదు.. ఆసక్తికరంగా మారింది. …
Read More »జనాలకు గుడ్ న్యూస్
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గకముందే థర్డ్ వేవ్ గురించి భయపడుతున్న జనాలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందరు ఆందోళనపడుతున్నట్లు థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందని ఆందోళనలో ఉన్న తల్లి, దండ్రులకు గులేరియా ప్రకటన పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. మూడో దశకలో కరోనా వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపైనే …
Read More »వ్యాక్సిన్ వేయించుకున్న వరుడు కావలెను..!
పెళ్లి కావాల్సిన యువతీ యువకులు తమకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ.. ‘ వరుడు కావలెను’, ‘ వధువు కావలెను’ అంటూ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇది చాలా సర్వసాధారణం. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ప్రకటనలు మనం చూసే ఉంటాం. అయితే.. తాజాగా ఓ వధువు తనకు కాబోయే వాడిలో ఉండే క్వాలిటీస్ లో ఓ కండీషన్ పెట్టింది. మూమూలుగా అయితే.. తెల్లగా ఉండాలి.. …
Read More »ఇదేం బాదుడు.. 28 బంతుల్లో 13 సిక్సులు.. 7 ఫోర్లు!
ఇప్పటివకు విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సెహ్వాగ్.. డివిలియర్స్.. పోలార్డ్ లకు మించి పరుగులు సాధించిన ఒక బ్యాట్స్ మెన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. కేవలం 28 బంతుల్లో 13 సిక్సులు.. 7 ఫోర్లు సాధించి సెంచరీని దాటేసిన వైనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అరుదైన ఊచకోతకు వేదికగా నిలిచింది యూరోపియన్ క్రికెట్ సిరీస్ గా …
Read More »ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సమస్య… వెబ్ సైట్లన్నీ క్రాష్..!
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ లో సమస్య తలెత్తింది. ఈ సమస్య కారణంగా అంతర్జాతీయంగా ప్రముఖ వెబ్ సైట్లన్నీ క్రాష్ అయ్యాయి. అమెజాన్, రెడ్డిట్, యూకే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్లు సహా.. ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు కూడా క్రాష్ అవ్వడం గమనార్హం. న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, సీఎన్ఎన్ ఇంటర్నేషనల్, వోక్స్, బీబీసీ, వంటి ఎన్నో ప్రముఖ వార్తాసంస్థల వెబ్సైట్లు యూజర్లకు అందుబాటులోకి లేకపోవడం ఇంటర్నెట్ ప్రపంచంలో ఆందోళనకు …
Read More »జస్టిస్ రమణకు చిన్నారి లేఖ.. వైరల్ అవుతున్న రిప్లయ్ లెటర్
పదేళ్ల చిన్నారి.. దేశ సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు ప్రదాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ మనసు దోచుకుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందిస్తున్న తీరును కొనియాడుతూ.. న్యాయమూర్తుల సేవలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె సీజేఐకి లేఖ రాసింది. అంతేకాదు, న్యాయస్థానం విధి నిర్వహణను వివరించేలా చేతితో గీసిన రంగుల చిత్రాన్ని లేఖతోపాటు జత చేసింది. ఈ లేఖకు ముగ్ధులైన సీజేఐ.. సమాజం పట్ల ఆమె …
Read More »క్షమాపణలు చెప్పిన హర్భజన్ సింగ్
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఒక ఉగ్రవాదికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఎండోర్స్ చేయడమే ఇందుక్కారణం. ఐతే తన పోస్టు తీవ్ర దుమారం రేపడంతో హర్భజన్ వెంటనే తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఖలిస్థాన్ టెర్రరిస్టు బృంద్రాన్వాలే గురించి తనకు ఫార్వర్డ్ అయిన ఒక పోస్టర్ను హర్భజన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో …
Read More »ఫెయిలైన చోక్సీ మాస్టర్ ప్లాన్
ఆంటీగ్వా నుండి మొహుల్ చోక్సీని కిడ్నాప్ చేసి డొమినికాకు ఎత్తుకెళ్ళారనే ప్రచారమంతా ఉత్త డ్రామా అనే విషయం బయపడుతోంది. కిడ్నాప్ జరిగిందని చెబుతున్న సమయానికి, డొమినికాలో చోక్సీ ప్రత్యక్షమైన సమయానికి మధ్యలో చాలా తేడాలున్నట్లు ఇటు ఆంటీగ్వా అటు డొమినికా పోలీసులు గ్రహించారు. ఆంటీగ్వా-డొమినికా మధ్య సముద్రమార్గంలో 120 మైళ్ళ దూరం ఉంది. ఈ సమయాన్ని ఎంత వేగంగా ప్రయాణించినా కవర్ చేయటానికి కనీసం 12 గంటలు పడుతుందట. దీని …
Read More »