Trends

అత్తారింటి నుంచి పారిపోయింద‌ని..

ఇది దారుణం. దారుణాతి దారుణం. తన కూతురికి బలవంతపు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ తండ్రి.. అక్కడ ఉండలేక తన కూతురు పారిపోయిందని తెలిసి ఆమె పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెపై తన కొడుకులు, ఇతర బంధువులతో కలిసి పాశవిక దాడికి పాల్పడ్డాడు. కన్న బిడ్డ అని కనికరం లేకుండా ఆ అమ్మాయిని ఆ తండ్రి హింసించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన …

Read More »

మన మిథాలీ ఖాతాలో అద్భుత రికార్డు

mithali raj

ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ అయిన షెఫాలి వర్మ వయసు 17 ఏళ్లు. జట్టులో మరో కీలక సభ్యురాలైన జెమీమా రోడ్రిగ్స్ వయసేమో 20 ఏళ్లు. వీళ్లిద్దరే కాదు.. మరికొందరు భారత యువ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించే సమయానికి ఇంకా పుట్టనే లేదు. ఎప్పుడో 1999లో ఆమె తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పట్నుంచి 22 ఏళ్లుగా అలుపూ సొలుపూ లేకుండా …

Read More »

నిమ్మరసంతో కరోనా పాజిటివ్.. ఇదో పెద్ద హ్యాక్..!

కరోనా మహమ్మారి మన దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అతలాకుతలం చేసేసింది. ఈ వైరస్ పేరు చెబితేనే చాలా మంది భయపడిపోయారు. అయితే.. ఇప్పుడు అదే కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని కొందరు టీనేజర్లు.. ఎంజాయ్ చేస్తున్నారట. ఏంటి అర్థం కాలేదా..? వారికి కరోనా రాకున్నా.. వచ్చినట్లు ఫేక్ రిజల్ట్ చూపించి.. అది కూడా నిమ్మరసం ఉపయోగించి హ్యాక్ చేసి.. స్కూళ్లు, కాలేజీలు ఎగ్గొడుతున్నారు. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా.. దీనికి …

Read More »

కోవాగ్జిన్ సామర్థ్యం 77శాతం…వారికి కరోనా భయం తగ్గినట్లే..!

కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. దీనిని తరిమికొట్టేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా..కోవాగ్జిన్ థ‌ర్డ్ ఫేజ్ ట్ర‌య‌ల్స్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ను కంపెనీ ప్ర‌క‌టించింది. తీవ్రమైన, మ‌ధ్య‌స్థ కేసుల్లో వ్యాక్సిన్ 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ ప్ర‌క‌టించింది. తీవ్రమైన కేసుల్లో 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించామంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్‌లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని భార‌త్ …

Read More »

డాక్టరు దంపతులు ఎంత పని చేశారంటే…

చూడ చక్కని ఈ జంట చేసిన పని తెలిస్తే జీర్ణించుకోవటం కష్టం. వైవాహిక జీవితంలో ఆటుపోట్లు సహజం. అంతమాత్రానికే ప్రాణాలు తీసుకోవాటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. అందులోనూ ఈ భార్యభర్తలు ఇద్దరు డాక్టర్లు. ప్రాణం విలువ వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. అలాంటిది.. కోపతాపాలు.. గొడవలతో విలువైన ప్రాణాల్ని తీసుకున్న ఈ యువ డాక్టర్ల జంట తీరు షాకింగ్ గా మారింది. మహారాష్ట్రలోని ఫూణెకు చెందిన వైద్యుల …

Read More »

ఇన్ స్టా లో సింగిల్ పోస్టు.. కోట్లలో ఆదాయం..!

ఇన్ స్టాగ్రామ్.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెలబ్రటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు దీనిని ఇప్పుడు తెగ వాడేస్తున్నారు. అయితే.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొందరు సెలబ్రెటీలు కోట్లు సంపాదిస్తున్నారనే విషయం మీకు తెలుసా..? ఇన్ స్టా ద్వారా సంపాదిస్తున్న సెలెబ్రిటీల జాబితాను ప్రతీ ఏడాది హెచ్‌ పర్‌ క్యూ సంస్థ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి జాబితానే విడుదల చేసింది. …

Read More »

రూ.కోటి కారు క్షణాల్లో బూడిడైంది.. ఎలన్ మస్క్ కు బ్యాడ్ టైం

ప్రపంచ కుబేరుల జాబితాలో చాలా వేగంగా చోటు సంపాదించుకున్న వారిలో టెస్లా కార్ల అధినేత ఎలాన్ మాస్క్ ఒకరు. తక్కువ వ్యవధిలో సంపన్నుడిగా అవతారమెత్తిన ఆయన టైం ఈ మధ్యన అస్సలేం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న అంతరిక్ష ప్రయాణం గురించి పోస్టు పెడితే.. మళ్లీ రాకు.. అక్కడే ఉండిపో.. ఇంకా పైకిపో అంటూ నెటిజన్లు ఏసుకున్నారు. ఆ మధ్యన అతగాడు పెట్టిన ఒక ట్వీట్ కు ఏకంగా …

Read More »

ఇద్దరు కొడుకులతో కలిసి పోర్న్ చూస్తుందట

లోకో భిన్నరుచి అన్న సామెత వినేందుకు బాగానే ఉంటుంది కానీ.. కొందరి అభిరుచులు.. వారు చేసే పనులు.. తీసుకునే నిర్ణయాల గురించి తెలిసినంతనే.. ఉలిక్కిపడటమే కాదు.. పక్కనే బాంబు పడినంతగా అదిరిపడతారు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. పిల్లల విషయంలో తల్లిదండ్రులు పలు రకాలుగా ఆలోచిస్తుంటారు. వారి క్షేమం కోసం తపిస్తుంటారు. తాము చేసిన తప్పులు వారు చేయకూడదనుకుంటారు. ఇందుకోసం చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. పిల్లల …

Read More »

అత్యాచారానికి శిక్ష.. చెప్పు దెబ్బా..?!

అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు న్యాయంకోసం పంచాయతీని ఆశ్రయిస్తే.. వారు ఇచ్చిన తీర్పు అందరినీ విస్మయానికి గురిచేసింది. అత్యాచార నిందితుడుని చెప్పుతో కొట్టమని సలహా ఇచ్చారు. అంతటితో ఇక ఈ విషయం మర్చిపోవాలని తీర్పు ఇచ్చారు. ఈ ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ జిల్లాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి …

Read More »

పెళ్లి ఆపడానికి.. పురుషాంగం కోసేసుకున్నాడు..!

ఈ మధ్య యువత చాలా సెన్సిటివ్ గా తయారౌతున్నారు. ప్రతి చిన్న విషయానికీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ మందలించారని సూసైడ్ లు చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. తాజాగా.. ఓ యువకుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. తన పురుషాంగం కోసేసుకున్నాడు. ఆ యువకుడికి అప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ.. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం వయసు అయిపోతోందని.. పెళ్లి నిశ్చయించారు. అతను ఎంత చెప్పినా.. తల్లిదండ్రులు …

Read More »

అక్కడ సెల్ఫీ దిగితే.. జైలు శిక్షే..!

ఈ రోజుల్లో మామూలు ఫోటోలు దిగేవారి కంటే.. సెల్ఫీలు దిగేవారే ఎక్కువ. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ సెల్ఫీలు దిగేస్తూనే ఉంటారు. ఈ సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు.. ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా లేకపోలేదు. అయితే.. ఓ ప్రాంతంలో సెల్ఫీ దిగడానికి ఆంక్షలు విధించారు. అది కూడా మనదేశంలోనే.. ఇంతకీ మ్యాటరేంటంటే… గుజరాత్‌లోని దంగ్‌ జిల్లా …

Read More »

థర్డ్ వేవ్ రాదు.. వచ్చినా ఏం కాదట..!

కరోనా మహమ్మారి మన దేశంలో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ అయితే.. మరింత అతలాకుతలం చేసేసింది. యువకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. కాగా.. త్వరలోనే థర్డ్ వేవ్ కూడా రానుందని… అది ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపించనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా.. దీనిపై ఐసీఎంఆర్ నివేదిక విడుదల చేసింది. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేసినా.. ఐసీఎంఆర్ మాత్రం ఛాన్స్ లేదని అంటోంది. ఒకవేళ …

Read More »