బాబాయ్ మర్డర్ కేసులో పీకల్లోతున కూరుకుపోయిన అవినాశ్ రెడ్డి అందులోంచి బయటపడడం కష్టమేనని సీఎం జగన్ రెడ్డికి అర్థమైపోయింది. ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా ఇలాంటి ఇష్యూస్‌లో సాయం చేసేది లేదన్న సమాధానం రావడంతోపాటు.. తమ్ముడిని కాపాడుకోవడం కంటే కడప లోక్ సభ సీటు కాపాడుకోవడంపై దృష్టిపెట్టమని సెంటర్ నుంచి సజెషన్ రావడంతో ఇప్పుడు జగన్ రెడ్డి ఆ పనిలో పడ్డారు. దీంతో పీకల్లోతున కూరుకుపోయిన బ్రదర్ అవినాశ్ రెడ్డిని ఆ ఊబిలోంచి బయటకు తెచ్చే ప్రయత్నంలో ఒళ్లంతా బురద అంటించుకోవడం కంటే ఆయన మానాన ఆయన్ను వదిలి కొత్త తమ్ముడిని కడపకు తేవాలని జగన్ డిసైడయ్యారన్నది ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ద తాడేపల్లి’.
అవినాశ్ రెడ్డికి అన్ని దారులూ మూసుకుపోవడంతో కాస్త ఆలస్యమైనా కానీ అరెస్ట్ తప్పని పరిస్థితి. ఒకవేళ శిక్ష ఖరారై జైలుకు వెళ్తే ఎంపీ పదవి వదులుకోవాలి. ఇదందా చకచకా జరిగిపోతే బై ఎలక్షన్లు గ్యారంటీ.. ఒకవేళ ఆలస్యమైనా వచ్చే ఎన్నికల నాటికి ఇదింత మరింత పెద్ద ఇష్యూగా మారే ప్రమాదం ఉంది. ఎలాగైనా కడప లోక్‌సభ సీటుకు కొత్త క్యాండిడేట్ కావాలి. ఆ కొత్త క్యాండిడేటే దుష్యంత్ రెడ్డి అని కడపలోను, తాడేపల్లిలోనూ వినిపిస్తోంది.
కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం తాటిమాకులపల్లె దుష్యంత్ రెడ్డి స్వగ్రామం. కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో బాగా తెలుసు. 2019లో జమ్మలమడుగు వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేశారు. 20019లోనే దుష్యంత్ రెడ్డి కమలాపురం టికెట్ ఆశించారు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తారని.. కడపలో అవినాశ్ రెడ్డికి టికెట్ ఇస్తే నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన ప్లేసులో దుష్యంత్ ను తీసుకురానున్నారని టాక్. అన్నట్లు.. దుష్యంత్ కూడా జగన్‌కు సమీప బంధువే. వరుసకు తమ్ముడు అవుతారట.