చట్ట సభలను చాలామంది ప్రజా ప్రతినిధులు ఎంతో పవిత్రంగా..దేవాలయాలుగా భావిస్తుంటారు. తమను ఎన్నుకున్న ప్రజల కోసం చట్టాలు చేసే ఈ సభలకు వన్నెతెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. అయితే, మరికొందరు సభ్యులు మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలవుతుంటారు. ఈ క్రమంలోనే శాసన సభ జరుగుతున్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న సభ్యులపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. రాజుగారు హౌస్ లో కూడా ఫోన్ మాట్లాడితే ఎలా సార్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సభలో వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు వరి సాగు గురించి మాట్లాడుతున్న సందర్భంగా అయ్యన్న ఈ కామెంట్స్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రసంగిస్తుండగా మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫోన్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఇక, సభలో కొందరు సభ్యులు ఫోన్ చూస్తున్నట్లుగా కూడా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి.
ఒకవేళ ఏదైనా అత్యవసరమైన కాల్ అయితే సభ నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని, సభలో ఫోన్ వాడకూడదని స్పీకర్ రఘురామ గతంలోనే సూచించారు. సభలో సభ్యులంతా తమ ఫోన్ లను సైలెంట్ మోడ్ లో పెట్టాలని సూచించారు. ఇక, కొందరు సభ్యులు సభలో సెల్ఫీలు, వీడియోలు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు రావడం విమర్శలకు తావిచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates