మనిషికి మరణం ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా రావచ్చు. కానీ జన్మ మాత్రం ఒక్క అమ్మ ద్వారానే సంభవిస్తుంది. అందుకే ఎంతటి వారికైనా అమ్మతో అనుబంధం ప్రత్యేకం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న నానుడి వచ్చింది. దానికి ప్రధానమంత్రి మోడీ కూడా అతీతుడు కాదు. తల్లితో ఆయనది ప్రత్యేక అనుబంధం. అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు కూడా. 2022 డిసెంబర్ 30న మోడీ మాతృమూర్తి హీరాబెన్ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని దమోహ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువకుడు తీసుకొచ్చిన ఫొటోను చూసి మోదీ భావోద్వేగానికి గురై కొద్ది సేపు నోట మాటలు రాకుండా ఆగిపోయారు. ఆ యువకుడు ప్రదర్శించిన ఫోటో మోదీనా తల్లి హీరాబెన్ ఆశీర్వదిస్తున్న ఫోటో. పెన్సిల్ తో గీసిన ఆ చిత్రాన్ని చూసి మోడీ బావోద్వేగానికి గురయ్యాడు.
ఆ చిత్రాన్ని తెచ్చిన యువకుడికి అభినందనలు తెలిపిన మోడీ .. ఆ ఫొటో వెనుక అతని పేరు, చిరునామాను రాసివ్వాలని సూచించాలని… అతనికి తాను లేఖ రాస్తానని చెప్పారు. అమ్మతో అనుబంధం ఎంతటి వారికైనా ఒక కమ్మని జ్ఞాపకమేనని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.