Political News

క‌విత‌కు మ‌ళ్లీ నోటీసులు.. వ‌ద‌లని మ‌ద్యం కేసు

kavitha

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ కవిత నివాసం వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసుల్లో ఆదేశించింది. అయితే.. ఈ నోటీసులు బుధ‌వారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత‌.. ఆమెకు జారీ చేయ‌డం …

Read More »

టార్గెట్ బీసీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan kalyan

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీసీల‌ను టార్గెట్ చేశారా? ఇప్ప‌టి వ‌ర‌కు కాపు నేత‌లే ఆయ‌న‌ను స‌మ‌ర్థిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న అంద‌రినీ క‌లుపుకొని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారా? ఈ క్ర‌మంలో బీసీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.బీసీల్లో ఐక్య‌త లోపించింద‌ని.. ప‌వ‌న్ అన్నారు. దీనినే వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. బీసీల‌ను ఒక ఆట ఆడిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. సీఎం జ‌గ‌న్ త‌న‌కు మాత్ర‌మే …

Read More »

పవన్ తో పొత్తు..జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబుపై మరో చేయి!

రీజనల్ పార్టీలను అడ్డం పెట్టుకుని ఏపీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. పవన్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ… జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబు పై మరో చేయి వేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంతో బీజేపీ మూడు ముక్కులాట ఆడుతోందని విమర్శించారు. బాబు, జగన్, పవన్ లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని అన్నారు. ఈ నెల 26న ఖర్గే, మాణిక్ ఠాకూర్, …

Read More »

పవన్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చేసినట్లే

2014 ఎన్నికల్లో పార్టీని పోటీలో నిలపకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు మాత్రమే ఇచ్చి ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. తర్వాతి ఎన్నికల్లో టీడీపీకి దూరమై సొంతంగా పార్టీని బరిలో నిలిపారు. కానీ దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయారు పవన్. పవన్‌ను ఓడించడానికి వైసీపీ ఏం చేయాలో అన్నీ చేసింది. భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లోనూ …

Read More »

వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

ఏపీలో మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మార్పుతో చాలామంది నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు పార్టీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. ఈ క్రమంలోని తాజాగా వైసీపీకి రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి వేమిరెడ్డి …

Read More »

‘రేపు నీ సాక్షికి కూడా అదే గ‌తి!’

“రేపు నీ సాక్షికి కూడా అదే గ‌తి ప‌డుతుంది.. జ‌గ‌న్ రెడ్డీ! గుర్తు పెట్టుకో!! ” అని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండు మీడియా సంస్థ‌ల‌కు చెందిన విలేక‌రుల‌ను కొట్ట‌డం, ఒక మీడియా సంస్థ ఆఫీసుపై దాడి చేసిన నేప‌థ్యంలో బండారు పై విధంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “అధికారం శాస్వతం అనుకుంటున్నావు. కానీ, రేపు మారుతుంది. అప్పుడు …

Read More »

ఆశీస్సులు-ఆశీస్సులు.. శార‌దా పీఠంలో సీఎం జ‌గ‌న్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ విశాఖ‌లోని చిన‌ముషిడివాడ‌లో ఉన్న శార‌దా పీఠాన్ని ద‌ర్శించుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఇక్క‌డ శారదాపీఠం వార్షికోత్సవాలు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ఉత్స‌వాల‌ ముగింపు ను పుర‌స్క‌రించుకున్ని సీఎం జ‌గ‌న్ వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారిగా అమ్మ‌వారికి సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. అదేవిధంగా అరగంటకు పైగా.. శార‌దా పీఠం స్వామీజీతో సీఎం జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రిపారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న …

Read More »

నిన్న జ‌ర్న‌లిస్టు.. నేడు కార్యాల‌యం.. సంకటంలో మీడియా ..!

  1950లో పార్ల‌మెంటులో మీడియాపై చ‌ర్చ జ‌రిగింది. “మీడియాను మీరు నియంత్రిస్తున్నారు“ అంటూ.. అప్ప‌ట్లో జ‌నతాపార్టీ ఎంపీ ఒక‌రు వ్యాఖ్యానించారు. దీనికి స‌మాధానంగా ప్ర‌ధాని హోదాలో ఉన్న నెహ్రూ.. కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. “మీడియా నియంత్ర‌ణ ఈ దేశంలో సాధ్యం కాదు. అదే జ‌రిగితే.. ఇది ప్ర‌జాస్వామ్య దేశం కానేకాదు“ అని అన్నారు. ఆయ‌న ఉన్నన్నాళ్లూ అదే పంథాను పాటించారు. సొంత ప‌త్రిక‌ను న‌డుపుకొన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఏనాడూ.. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో జోక్యం …

Read More »

జగన్ పై నాగబాబు పిట్ట కథ..వైరల్

టీడీపీ, జనసేనల పై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ టీడీపీ గుర్తు సైకిల్ ను, జనసేన గ్లాస్ గుర్తును జగన్ అవమానించిన వైనంపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో జగన్ కు జనసేన నేత, పవన్ కళ్యాణ్ …

Read More »

టీడీపీ కురువృద్ధుడిని ఇంత టెన్ష‌న్ పెట్టేస్తున్నారే!

టీడీపీ కురువృద్ధ నాయ‌కుడు.. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర టెన్ష‌న్‌లో ప‌డిపోతున్నారు. ఒక నిముషం.. ఉన్న వార్త‌లు.. మ‌రో నిముషానికి మాయ‌మైపోతున్నాయి. దీంతో ఆయ‌న గ‌త వారం రోజులుగా సోష‌ల్ మీడియాకు క‌డు దూరంలో ఉన్నార‌ని తెలిసింది. అంతేకాదు..ఆయ‌న ఎవరిని కూడా ప‌ల‌క‌రించ‌డం లేద‌ని అంటున్నారు. తాజాగా ఆయ‌న సెల్పీ వీడియో తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నేనే పోటీ చేస్తున్నా.. దీనిపై …

Read More »

మేడిగడ్డ ఇక పనికిరాదా ? వేస్టేనా ?

మేడిగడ్డ బ్యారేజి ఇక నీటి నిల్వకు ఏమాత్రం పనికిరాదా ? బ్యారేజి నిర్మాణానికి పెట్టిన వేలాది కోట్ల ప్రజాధనమంతా వృధాయేనా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ బృందం పరిశీలన మొదలుపెట్టింది. మొదటగా మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించింది. పిల్లర్ల కింద సాయిల్ తో పాటు బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతను కూడా గమనించింది. పిల్లర్లు ఎందుకు కుంగిపోయిందనే …

Read More »

కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ.. తెలంగాణ‌లో ‘బెంజ్’ పాలిటిక్స్

తెలంగాణ రాజ‌కీయాల్లో అస‌లే ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అది కూడా.. ‘బెంజ్‌’ వ్య‌వ‌హారం కావ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. బెంజ్ కారు కానుకగా అందుకున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అంతేకాదు.. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఏ డేట్‌లో ఆమెకి కారు అందజేశారో, కారు …

Read More »