మేడిగడ్డ బ్యారేజి ఇక నీటి నిల్వకు ఏమాత్రం పనికిరాదా ? బ్యారేజి నిర్మాణానికి పెట్టిన వేలాది కోట్ల ప్రజాధనమంతా వృధాయేనా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ బృందం పరిశీలన మొదలుపెట్టింది. మొదటగా మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించింది. పిల్లర్ల కింద సాయిల్ తో పాటు బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతను కూడా గమనించింది. పిల్లర్లు ఎందుకు కుంగిపోయిందనే …
Read More »కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. తెలంగాణలో ‘బెంజ్’ పాలిటిక్స్
తెలంగాణ రాజకీయాల్లో అసలే ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీల మధ్య మరో కొత్త వివాదం తెరమీదికి వచ్చింది. అది కూడా.. ‘బెంజ్’ వ్యవహారం కావడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. బెంజ్ కారు కానుకగా అందుకున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్ సంచలన ఆరోపణ చేశారు. అంతేకాదు.. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఏ డేట్‌లో ఆమెకి కారు అందజేశారో, కారు …
Read More »పవన్ ప్రకటనలు వ్యూహాత్మకమేనా ?
జిల్లాల పర్యటనల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. డైరెక్టుగా అభ్యర్ధులని కాకుండా నియోజకవర్గాల ఇన్చార్జిల పేరుతో ప్రకటనలు చేస్తున్నారు. రాజమండ్రి పర్యటనలో పవన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ ను ఇన్చార్జిగా ప్రకటించారు. నిజానికి ఇపుడు దుర్గేష్ ను ఇన్చార్జిగా ప్రకటించటమే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చాలాకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయటానికి దుర్గేష్ ఏర్పాటు చేసుకుంటున్నారు. టికెట్ తనకే వస్తుందన్న భరోసాతో చాలాకాలంగా …
Read More »బాలినేని పంతం నెగ్గించుకున్నారా
ఒంగోలు ఎంఎల్ఏ, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లే ఉన్నారు. తన నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 25 వేల ఇళ్ళపట్టాలను పంపిణీ చేస్తేకాని రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది లేదని బాలినేని చాలాకాలంగా చెబుతున్నారు. ఇదే విషయమై పట్టుబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై బాలినేని చాలాసార్లు అలిగారు కూడా. సరే మార్గం ఏదైనా, ప్రయత్నాలు ఎలాచేసినా 25 వేల ఇళ్ళపట్టాలు పంపిణీ …
Read More »కాంగ్రెస్ లో చేరికల జోష్..
కాంగ్రెస్ లో చేరికల జోష్ పెరిగిపోతోంది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నేతలు హస్తంపార్టీలో చేరుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరారు. అధికారపార్టీ నేత కంచర్ల …
Read More »టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల పంపకాలు కొలిక్కి?!
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ను ఎట్టి పరిస్థితిలోనూ గద్దె దించాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆమేరకు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొంత అననుకూల పరిస్థితులు ఎదురవుతున్నా.. ఆయన పొత్తుల దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలూ కలిసి వెళ్తాయని.. టీడీపీ, జనసేన అధినేతలు ప్రకటించారు. ఈ …
Read More »టీఆర్ఎస్ లో ఆ నలుగురి మధ్య గ్యాప్ !!
మొదటి నుండి కూడా బీఆర్ఎస్ లో కేసీయార్ తర్వాత నలుగురు నేతలదే మొత్తం పెత్తనంగా ఉండేది. ఉద్యమ పార్టీగా ఉన్నపుడు, అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా ఇదే పద్దతి నడిచింది. కాని ఒకే ఒక ఓటమి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు నలుగురు నాలుగు వైపుల పార్టీని లాగుతున్నారనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీయార్ కొడుకు కేటీయార్, కూతురు కవిత, …
Read More »ఏజెంట్ ఆళ్ల రిపోర్టింగ్ సార్
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తనయుడు, అప్పటికే మంత్రిగా కూడా పని చేసిన నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించి సంచలనం రేపిన నేత.. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటన చేసి, ఆ తర్వాత పార్టీ …
Read More »తలసానికి ఉచ్చు బిగుసుకుంటోందా ?
అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే తర్వాత అందుకు మూల్యం చెల్లించక తప్పదంటారు పెద్దలు. ఇపుడీ విషయం ఎందుకంటే మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గురించే. మంత్రిగా ఉన్నపుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు తొందరలోనే మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. బీసీ బంధు విషయంలో కేసీయార్ హయాంలో అమలైన పథకాల్లో బీసీలకు గొర్రెల పంపిణీ పథకం కూడా ఒకటి. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, బిల్లులు చెల్లించకుండానే చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి కోట్ల రూపాయల …
Read More »యూటర్న్ పాలిటిక్స్.. ఆళ్లదా.. జగన్‌దా?
రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అవసరం.. అవకాశం అనే రెండు పట్టాలపైనేరాజకీయ రైలు పరగులు పెడుతుంది. అది పార్టీ అయినా.. నాయకులైనా ఫార్ములా అయితే ఒక్కటే. ఇప్పుడు ఇదే ఫార్ములా వైసీపీలోనూ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే, కొన్నాళ్ల కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆళ్లతో హైదరాబాద్‌లో …
Read More »పవన్ కీలక సమావేశం
ఉభయగోదావరి జిల్లాలోని నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రాజమండ్రికి చేరుకున్న పవన్ తన అజెండా ప్రకారమే మంగళవారం సమావేశాలు నిర్వహించబోతున్నారు. రెండురోజుల క్రితమే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నేతలతో విశాఖపట్నంలో సమావేశమైన విషయం తెలిసిందే. అదేపద్దతిలో ఇపుడు ఉభయగోదావరి జిల్లాల్లోని నేతలందరినీ రాజమండ్రికి చేరుకోవాలని కబురుచేయటంతో అందరు చేరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులో జనసేన ఎన్ని సీట్లకు పోటీచేయబోతోంది, పోటీచేయబోయే నియోజకర్గాలు ఏవన్న విషయాలనే నేతలతో …
Read More »ఢిల్లీకి కేసీఆర్.. బీజేపీతో పొత్తుకేనా? పొలిటికల్ టాక్!
తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా బయటకు రాకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నల్గొండ సభకు వచ్చారు. నీళ్ల వివాదంపై ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు గుప్పించారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని వార్తలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates