చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి లేని గాడిద కొడుకు” అని తీవ్ర‌స్థాయిలో స్పందించారు. తాజాగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రేవంత్ రెడ్డిని ఎన్డీ టీవీ సంస్థ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ స‌మయంలో చంద్ర‌బాబు గురించి ప్ర‌స్తావిస్తూ..ఏపీలో మీ గురువు చంద్ర‌బాబు పోటీ చేస్తున్నారు. శిష్యుడిగా మీ స‌హ‌కారం ఏమైనా ఉంటుందా? అన్న ప్ర‌శ్న‌కు రేవంత్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చంద్ర‌బాబు త‌న‌కు గురువు కాద‌న్నారు. కేవ‌లం స‌హ‌చ‌రుడిని మాత్ర‌మేన‌ని చెప్పారు.

టీడీపీలోకి రాక‌ముందే తాను రాజ‌కీయాలు నేర్చుకున్న‌ట్టు చెప్పారు. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచిన త‌ర్వాత‌.. టీడీపీలోకి పిలిస్తే వెళ్లిన‌ట్టు చెప్పారు. త‌న‌కు ఎవ‌రూ గురువులు లేర‌ని.. త‌న‌కు ఎవ‌రికీ శిష్యుడిని కాద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ మాట ఎవ‌రైనా అంటే.. వాడి ము.. మీద త‌న్ని బుద్ధి చెబుతాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎవ‌రివ‌ల్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఓన‌మాలు నేర్చుకోలేద‌ని చెప్పారు. త‌న‌కు త‌నే నేర్చుకున్నాన‌ని, త‌న‌ను అంద‌రూ వాడుకుంటున్నార‌ని.. చెప్పారు. చంద్ర‌బాబు ఒక పార్టీకి అధ్య‌క్షుడు మాత్ర‌మేన‌ని ఆయ‌న‌కు తాను శిష్యుడిన‌ని చెప్పుకోవ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానిం చారు.

ఇక‌, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొన్నామ‌ని తెలిపారు. తాము ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ్డామ‌ని చెప్పారు. అందుకే ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో 12 నుంచి 15 స్థానాల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని చెప్పారు. కేంద్రంలోనూ పార్టీ బ‌లంగా ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని.. బీజేపీ ఎన్ని కుయుక్తులు ప‌న్నినా.. ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలుసున‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విపై మాట్లాడుతూ.. ఎన్నిక‌ల ఫ‌లితం వచ్చిన త‌ర్వాత‌.. పార్టీ కూర్చుని నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. ప్ర‌స్తుతం కేంద్రంలో అధికార మార్పిడి జ‌ర‌గాల‌ని ప్ర‌జ‌లే కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.