ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో పోలింగ్ పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లారు. సుమారుగా 15 రోజులపాటు జగన్ విదేశాల్లో పర్యటించారు జగన్. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో జగన్ స్వదేశానికి వస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అయితే లండన్ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని ట్విట్టర్, ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన రెగ్యులర్ లుక్ కు భిన్నంగా జగన్ ఈ ఫోటోలలో భిన్నంగా కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా నిత్యం తెల్ల అంగీ, సాధారణ చెప్పులతో కనిపించే జగన్ దానికి భిన్నంగా జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీకానున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పార్టీ కీలక నేతలతో చర్చించనున్నారు. మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మే 17వ తేదీ వైఎస్ జగన్ విదేశీ పర్యటను వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌పై ఈసీ రూల్స్‌కు సంబంధించి వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates