ఇటీవలే ఆరు నెలలకుపైగా జైలు జీవితం గడిపి బయటికొచ్చిన వైసీపీ నేత వల్లభనేని వంశీ మళ్లీ అరెస్టు కానున్నాడా? మాజీ ఎమ్మెల్యే మళ్లీ జైలులోకి వెళ్లక తప్పదా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది. వంశీ .. ఓలుపల్లి రంగా వంటి తన అనుచరుల్ని తీసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉన్నా వారు హాజరు కాలేదు. దీంతో పోలీసులు వారి కోసం వెతుకుతున్నట్టు సమాచారం.
ఇటీవల ఆయనపై ఓ హత్యాయత్నం కేసు నమోదు అయింది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యేపై మరో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ తెలిపిన వివరాల ప్రకారం 2024 జులైలో వంశీతో పాటు ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.
కొద్దిరోజుల కిందట మళ్లీ తాము పొలిటికల్ గా యాక్టివ్ అవుతామంటూ కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఫోకస్‌తో గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మండలాల్లో సైలెంట్ గా పర్యటిస్తున్నారు. మరోవైపు వాయిదాలు, సంతకాల కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతున్నారు. సడన్ గా అనుచరులతో సహా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. టిడిపి కార్యకర్తలపై దాడి చేసిన కేసులో ఆయన అరెస్టు తప్పదు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates