ఒక నాయకుడిని ప్రజలు నమ్మితే ఏం చేస్తారు? ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటారు…ఆయన పాలన కావాలని అనుక్షణం పరితపిస్తుంటారు…ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురుచూస్తుంటారు…ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే రోజు కోసం పరితపిస్తుంటారు…వారు కలలుగన్న క్షణం నిజమైన వేళ వారి ఆనందానికి అవధులుండవు..తమ అభిమాన, ఆరాధ్య నాయకుడు కళ్ల ముందు కనిపిస్తే వారి పరుగుకు పట్టపగ్గాలుండవు.. తన అభిమాన నాయకుడు, విజనరీ లీడర్, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించగానే …
Read More »కేంద్రంలో ఏపీ మంత్రులు.. సాధించేందుకు స్కోప్ ఉందా?
కేంద్రంలో మంత్రి పదవి అంటే చాలా కీలకంగా భావిస్తారు. జాతీయ రాజకీయాల్లో ఉన్నవారు.. లేదా ఎంపీలుగా గెలిచిన వారు కేంద్రంలో మంత్రులుగా ఉండాలని కోరుకుంటారు. కనీసం.. సహాయ మంత్రి అయినా ఫర్వాలేదు .. అనుకుంటారు. గతంలో ఓ కీలక పార్టీ జాతీయ పార్టీలో విలీనం అయినప్పుడు కూడా సదరు నాయకుడు మంత్రి పదవినే కోరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న మంత్రి పదవులకు డిమాండ్ కూడా ఉంటుంది. …
Read More »పవన్ పై చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్
ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ కు కూటమి ఎమ్మెల్యేలు లేఖ పంపనున్నారు. ఈ క్రమంలోనే తనను కూటమి తరఫున శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నందుకు కూటమిలోని మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు. తాను జైల్లో …
Read More »ఈ విజయం ఓ కేస్ స్టడీ: చంద్రబాబు
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్ఫూర్తిదాయకమైన తీర్పును ఇచ్చారని కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం చంద్రబాబును.. ఎన్డీయే కూటమి పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనను కోరుకున్నారని, కానీ ఎలాంటి పాలన అందించారో. గత పాలకుడి గురించి తెలిసిందేనని అన్నారు. అలాంటి దుర్మార్గపు పాలన తమకు అవసరం లేదని.. ప్రజలు …
Read More »పూర్తి స్థాయి రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక నుంచి పూర్తిస్థాయి రాజకీయాలే చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా ఆయనను జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ తరఫున ఎన్నికైన 20 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ …
Read More »అక్కడ బాబు .. ఇక్కడ పవన్ !
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం విజయవాడ ఏ కన్వెన్షన్‌లో జరిగింది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును మూడు పార్టీల నేతలు శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం జరింగింది. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం …
Read More »‘రెండు’ సంతకాలకు ఫైళ్లు రెడీ!
టీడీపీ నేతృత్వంలోని బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు హామీ నెరవేరనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలును అధికారులు రెడీ చేశారు. ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ వ్యవహారం రాజకీయంగా కీలక చర్చకు దారి తీసింది. జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడంతో విసుగెత్తిన నిరుద్యోగు లు కూటమి పార్టీలపై ఆశలు పెట్టుకున్నారు. …
Read More »బాబు – పవన్ మధ్య ఇంత ఎమోషనల్ బాండ్ ఉందా?
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకునే కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మధ్య ఎంతటి భావోద్వేగ అనుబంధం ఉందన్న విషయం అనూహ్యంగా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కటమే కాదు.. బాబు – పవన్ మధ్య ఉన్న బలమైన బంధం ఆవిష్క్రతమైంది. అసలేం జరిగిందంటే.. ఏపీ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును …
Read More »కేంద్ర క్యాబినెట్ పై అసంతృప్తి సెగలు
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ కంటే తక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొన్న ఇతర ఎన్డీయే పక్ష పార్టీలకు క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవులు కేటాయించి.. మహారాష్ట్రలో ఏడు లోక్‌సభ స్థానాలు గెలుచుకొన్న తమకు మాత్రం సహాయ మంత్రి పదవి ఇవ్వడంపై పెదవి విరిచింది. పదవుల కేటాయింపులో బీజేపీ పక్షపాతం …
Read More »12వ తేదీ సంబరాల్లో మోడీ.. రెండు కీలక రీజన్లు!
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12న సంబరాల్లో మునగిపోనున్నారు. ఆయనకు అత్యంత కీలకమైన రోజుగా ప్రధాన మంత్రి కార్యాలయం తాజాగా పేర్కొంది. ఈ నెల 12న ప్రధాని మోడీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. దీనిలో ఆయన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఏపీకి, ఒడిశాకు కేటాయించారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి తన బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి కారణమైన కీలక నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా …
Read More »కూడికలు-తీసివేతలు.. చంద్రబాబు కాలిక్యులేషన్ ఏంటి?
ఏం బిజీ అండీ బాబూ! అన్నట్టుగానే ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ పరిస్థితి. నిన్నటి వరకు కేంద్రంలో కుస్తీ.. తర్వాత రామోజీ ఫిలింసిటీలోనే రెండు రోజులు.. ఇప్పుడు ఏపీలో అడుగు పెట్టా రో లేదో వెంటనే మరోసారి బిజీ బిజీ. ఈ సారి అంతా ఇంతా కాదు. ఏకంగా కూడికలు -తీసివేతలతో ఆయన లెక్కల మాస్టారిని తలపిస్తున్నారు. కాలిక్యులేషన్‌లో కొత్త ఒరవడి చూపిస్తున్నాయి. మరి ఈ లెక్కల సంగ …
Read More »చంద్రబాబుకు మోడీ ఇంపార్టెన్స్ వెనుక.. రీజనేంటి?
కేంద్రంలో కొలువు దీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఒంటరిగానే 16 మంది ఎంపీలను దక్కించుకున్న టీడీపీ కేంద్రంలో చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో చంద్రబాబుకు అనూహ్యమైన గౌరవం, మద్దతు కూడా లభిస్తోంది. ఇక, బిహార్ అధికార పార్టీ నితీష్ కుమార్ సర్కారు నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇటు చంద్రబాబు, అటు నితీష్ ఇద్దరూ ఇప్పుడు కేంద్ర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates