వైసీపీకి కష్టాలు మరింత పెరిగాయి. ఎన్నికల్లో ఎదురైన ఘరో పరాజయం దరిమిలా.. ఆ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ దూకుడు చూపించకపోవడంతోపాటు.. అసలు పార్టీలో ఇప్పటికీ ఒక విధమైన గ్యాప్‌ను మెయింటెన్ చేయడం వంటివి నాయకులకు రుచించడం లేదు. ఈ క్రమంలోనే కీలక నాయకులు సైలెంట్‌గా వెళ్లిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కేవలం రెండు మాసాల్లోనే వైసీపీలో భారీ వికెట్లు పడుతున్నాయి. సౌమ్యులు అన్న నాయకులు కూడా వెళ్లిపోతున్నారు.
ప్రస్తుతం జగన్ హవా పెరగకపోగా.. ఆయన తాడేపల్లి నుంచి బయటకు రావడమే మానేశారు. పోనీ.. అక్కడకు వెళ్లి కలవాలన్నా.. కూడా నాయకులకు దర్శనం లభించడం లేదు. అప్పాయింట్‌మెంటు ఇవ్వడం లేదు. పైగా.. మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారినే కలవాలంటూ.. సూచనలు రావడంతో నాయకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక, ఎన్నాళ్లయినా.. పార్టీలోఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్న నాయకులు జంప్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
మేమైనా మారాలి.. ఆయనైనా మారాలి.. ఏదో ఒకటి జరిగితేనే బాగుంటుంది.. అని ఇటీవల ఏలూరులో కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన మనసులో ఆవేదన అందరికీ తెలిసిందే. కానీ, ఆయన సౌమ్యుడు కావడంతో కొంత సంయమనం పాటించారు. ఇక, పార్టీలో ఇక, పుంజుకునే అవకాశం లేదని.. భావిస్తున్న వారు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. నిజానికి ఓడిపోయిన పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోవడం సమంజసమే. కానీ, వైసీపీ లెక్క వేరు.
నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ.. అంటూ నాయకులతోనూ జగన్ బాండింగ్ పెంచుకున్నారు. అలాంటి జాబితా లో ఉన్న నాయకులు కూడా.. జంప్ చేస్తున్నారు. ఇదీ.. అసలు అలజడి. నిజానికి ఇలాంటి ఈక్వేషన్‌తో జగన్.. రెడ్డి సామాజిక వర్గానికి కూడా టికెట్లు ఇవ్వలేదు. సో.. అటు రెడ్లు ఎన్నికల సమయంలో హ్యాండిచ్చారు. ఇప్పుడు బీసీ నాయకులు ఎన్నికల తర్వాత.. హ్యాండిస్తున్నారన్న మాట. మొత్తానికి వైసీపీ నిలబడడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates