ఊహించినట్టుగానే వైసీపీలో రాజ్యసభ సభ్యుల జంపింగులకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. అయి తే.. వీరిలో జగన్ అత్యంత ఇష్టంగా భావించి.. మరీ రాజ్యసభ సీట్లు ఇచ్చిన వారు ఉండడమే ఆశ్చర్యంగా ఉంది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మోపిదేవి వెంకట రమణ, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావులు ప్రస్తుతం ఢిల్లీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరూ కూడా.. జగన్‌కు అత్యంత ఆప్తులన్న విషయం తెలిసిందే.
2019 ఎన్నికలకు ముందు.. బీద మస్తాన్‌రావు.. టీడీపీలో ఉన్నారు. తర్వాత.. ఆయన ఎంపీ సీటు కోసం వైసీపీలో చేరారు. అనంతరం.. జగన్ ఆయనను రాజ్యసభకు పంపించారు. ఇక, మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. అనంతరం.. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. తర్వాత.. రాజ్యసభలో ఖాళీ అయిన సీట్లకు.. బీసీ కోటాలో మోపిదేవి వెంకట రమణను పంపించారు. అప్పట్లో వీరిద్దరూ కూడా జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు వారిద్దరూ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇద్దరూ కూడా నేరుగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారనేది సమాచారం. ఢిల్లీ వెళ్లి.. అక్కడ రాజ్యసభ చైర్మన్‌కు రాజీనామాలు సమర్పించి.. తిరిగి ఏపీకి రానున్నారు. అనంతరం వైసీపీకి రాజీనామా చేయనున్నారు. బీద మస్తాన్ రావు ప్రముఖ వ్యాపార వేత్త అన్న విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం వైసీపీలో ఇలాంటి జంపింగులు చాలా మందే ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates