వైసీపీ అధికారంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని మించి జనసేనను టార్గెట్ చేసేవాళ్లు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు ఆ పార్టీ నేతలంతా విరుచుకుపడిపోయేవారు. ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడు అని మారు పేర్లు పెట్టి పవన్ను ఎగతాళి చేసేవాళ్లు. రెండు చోట్ల ఓడిపోయాడని.. చంద్రబాబుకు అమ్ముడుబోయాడని.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. ఇలా జగన్ సహా వైసీపీ నేతలంతా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇటీవలి ఎన్నికల్లో జనసేన …
Read More »నిర్మాణ రంగానికి ఊపిరులు.. ఏపీలో సంచలన మార్పు!
ఏపీలో భవన నిర్మాణ రంగానికి ఊపిరి పోస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా ఆసక్తిగా మారింది. కూటమి సర్కారు వస్తూ వస్తూనే రాష్ట్రంలో కీలక పథకాల విషయంలో సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. వస్తువు వస్తూనే పోలవరంలో చంద్రబాబు పర్యటించారు. పోలవరంలో ఏర్పడిన సమస్యలు, వాటిపై అధ్యయనానికి కేంద్రాన్ని ఒప్పించే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత అమరావతిపై దృష్టి సారించారు. అమరావతిలో ప్రాజెక్టులు నిలిచిపోవడం, …
Read More »వైఎస్ వారసురాలు షర్మిల: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని తాను భారత్ జోడో యాత్ర చేసినట్టు వివరించారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ఏపీలో కాంగ్రెస్ …
Read More »ప్రజా సేవలో తనను తాను మరిచి.. మంత్రిగారి మంచితనం..!
“సార్ మీరు మంత్రిగారండి. మర్చిపోతున్నారా”! పాలకొల్లు నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట ఇదే. దీనికి కారణం పాలకొల్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు దక్కించుకున్న ప్రజానాయకుడు నిమ్మల రామానాయుడు తాను మంత్రి అయినప్పటికీ కార్యకర్తగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్థానికంగా అందరిలోనూ కలిసిపోయి, అందరితోనూ కలిసిపోయి వ్యవహరించేవారు. ప్రజలంతా నా వాళ్లే, నేను ప్రజల మనిషిని అనే దృక్పథం ఆయన ముందుకు సాగారు. దీంతో చిన్న చిన్న పనులు కానీ …
Read More »ఇదేదో అప్పుడే చేసి ఉంటే.. బాగుండేది జగన్ సర్!
“పార్టీ ఓడిపోయినప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారు. రూల్స్ గుర్తుకు వచ్చాయి. న్యాయం, చట్టం అంటూ ఉన్నాయన్న విషయం కూడా గుర్తుకు వచ్చింది. అదేదో అధికారంలో ఉన్నప్పుడే గుర్తు పెట్టుకుని ఉంటే.. బాగుండేది”- ఇదీ.. ఇతమిత్థంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి జనాల నుంచి వినిపిస్తున్న మాట. ఐదేళ్ల అధికారం అయిపోయిన తర్వాత.. అనూహ్య ఓటమిని చవి చూసిన తర్వాత.. ఆయనకు పై వన్నీ గుర్తుకు వస్తున్నాయని కొందరు …
Read More »గచ్చిబౌలి సభపై బాబు ఉద్వేగం
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా.. ఏపీలో ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ సర్కారు అరెస్టు చేసిన సందర్భంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయన కోసం వేలాది మంది మద్దతుదారులతో నిర్వహించిన సభ ఎంత ఉద్వేగంగా సాగిందో తెలిసిందే. బాబుకు జనాల్లో ఎంత మంచి పేరుందో ఆ సభతో రుజువైంది. బాబు అరెస్టును నిరసిస్తూ ఆ సభకు హాజరైన వాళ్లంతా …
Read More »ధర్మశ్రీ చెప్పిన నిజాలు జగన్ కు వినిపిస్తాయా..?
వైసీపీలో లోపాలు బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నిజానికి తప్పులు జరిగాయని అందరికీ తెలిసినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడలేదు. పైగా అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరూ హర్షించారు. గొప్పగా చెప్పుకొచ్చారు. తమ నాయకుడు అంతటివాడు లేడని గొప్పలు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అవన్నీ తప్పులు అన్న విషయం ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. రాజధాని …
Read More »కాళోజీ పుస్తకం-రేవంత్ రెడ్డి అంతరంగం ఇదే..!
ఇవాళ్టి రోజున పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి దాదాపు కనుమరుగైంది. అందరూ గిఫ్టుల పేరుతో ఖరీదైన వస్తువులు మాత్రమే ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక, ముఖ్యమంత్రులు ఎదురు పడినప్పుడు కూడా.. ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే.. అసలు గిఫ్టు ఎందుకు ఇస్తారంటే.. “నీపై నాకు ఉన్న ప్రేమ, అభిమానం, అభిప్రాయాలకు ఇదీ ప్రతీక” అని చెప్పేందుకే.. గిఫ్టులు ఇస్తారు. అందే.. సందర్భాన్ని బట్టి గిఫ్టు ప్రాధాన్యం మారుతుంది. తాజాగా ముఖ్యమంత్రుల భేటీ …
Read More »సమస్యలు శాశ్వతంకాదు.. రాష్ట్రాలే శాశ్వతం.. : చంద్రబాబు
సమస్యలు శాశ్వతం కాదని రాష్ట్రాలే శాశ్వతమని టిడిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించిన కీలక విషయాలనుప్రస్తావించారు. శనివారం రాత్రి మంచి వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరిగిందని పేర్కొన్నారు. అయితే గడిచిన 10 సంవత్సరాలలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించుకునేందుకు …
Read More »బాబు మార్కు.. నేతలే కాదు.. అధికారులు కూడా.. !
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తనదైన మార్కుతో పాలన ప్రారంభించిన విషయం తెలిసిందే. కూటమి అధినేత చంద్రబాబు నాయుడు యువతరానికి పెద్దపీట వేశారు. మంత్రులుగా ఎక్కువమంది యువతనే ఆయన తీసుకున్నారు. ముఖ్యంగా కొత్త తరం నేతలకు ఎక్కువ అవకాశం కల్పించారు. అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, టిజి భరత్, సత్యకుమార్ వంటి యువ నాయకులకు అవకాశం కల్పించారు. తద్వారా పాలనలో మెరుగైనటువంటి పనితనాన్ని ఆయన ఆశిస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా …
Read More »పార్లమెంటుకు జగన్.. ఉత్తుత్తి ప్రచారమా? నిజమా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా? వచ్చే కొన్ని రోజుల్లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయనున్నారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అయితే అధికారికంగా ఎక్కడ వినిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం భారీ ఎత్తున ఈ రెండు విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూట …
Read More »వారు లేరు.. వీరు బయటకు రారు..
ప్రతిపక్షం వైసీపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చేసి నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో పార్టీ కార్యాలయాలపై అధికారులు బుల్ డోజర్లు ప్రయోగిస్తున్నారు. మరోవైపు పార్టీ నాయకు లను కూడా.. ఇతర పార్టీలు ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సమయంలో క్షేత్రస్థాయిలో నాయకులు అలెర్ట్ కావాలి. పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మేమున్నాంటూ.. ముందుకు రావాలి. కానీ, అలా ఎక్కడా కనిపించడం లేదు. ఎవరి మానాన వారు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates