ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారింది. ఇప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు.. ఎలా వ్యవహరించినా.. ఇప్పుడు ఇక, వారికి పగ్గాలు వేస్తూ.. సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. “నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నారనేది నాకనవసరం. ఇక నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే” అని బాబు తేల్చిచెప్పారు. తాజాగా ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియమించారు.
అయితే.. ఇక్కడ మంత్రులు ఇంచార్జ్‌లుగా వస్తే.. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే కాదు.. వారు రాజకీయంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి ఏ ప్రభుత్వం వచ్చినా.. జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమిస్తారు. కానీ, చంద్రబాబు హయాంలో ఇంచార్జ్ మంత్రి అంటే లెక్కలు వేరేగా ఉంటాయి. నాయకుల పై ఆయన ఒక కన్నేసి ఉంచుతారు. వారు ఏం చేస్తున్నా తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
వీరే ఇంచార్జ్ మంత్రులు..
విజయనగరం: హోం మంత్రి వంగలపూడి అనిత, శ్రీకాకుళం: రవాణా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం, కోనసీమ: వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖ: సాంఘిక సంక్షేమ మంత్రి బాలవీరాంజనేయస్వామి, అల్లూరి సీతారామరాజు జిల్లా: గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి, అనకాపల్లి: ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కాకినాడ: పురపాలక మంత్రి నారాయణ, కర్నూలు, తూ.గోదావరి: వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పల్నాడు, ప.గోదావరి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్‌టీఆర్ జిల్లా: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కృష్ణా జిల్లా:వాసంశెట్టి సుభాష్, గుంటూరు: కందుల దుర్గేష్, బాపట్ల: పార్థసారథి, ప్రకాశం: ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు: ఫరూఖ్, నంద్యాల-పయ్యావుల కేశవ్, అనంతపురం-టీజీ భరత్ శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు: అనగాని సత్యప్రసాద్ నియమితులయ్యారు.