అమరావతిలోని ఆర్ 5 జోన్ లో ఏపీ సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత అమరావతి రాజధానిపై చర్చ తీవ్రతరం అయిన సంగతి తెలిసిందే. గతంలో అమరావతి పేరు కూడా ఎత్తని జగన్..ఇకపై మనందరిదీ అమరావతి అంటూ ప్రకటించడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడానికి జగన్ ప్రయోగించిన చిట్టచివరి అస్త్రం ఈ పట్టాల పంపిణీ కార్యక్రమమని విమర్శిస్తున్నారు. త్వరలోని విశాఖకు రాజధానిని …
Read More »జగన్ పై గళమెత్తిన సర్పంచ్ లు
జగన్ హయాంలో సర్పంచ్ ల దుస్థితి వర్ణనాతీతం అని టీడీపీ నేతలు చాలా కాలంగా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సర్పంచ్ లను జగన్ తోలుబొమ్మలుగా మార్చారని, రాజ్యాంగం వారికి ప్రసాదించిన కొన్ని హక్కులను కాలరాస్తున్నారని విపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను జగన్ పక్కదారి పట్టించారని, తక్షణమే పక్కదారి పట్టించిన 8,660 కోట్ల రూపాయలను గ్రామపంచాయతీల ఖాతాలలో జమ చేయాలని టీడీపీ అధినేత …
Read More »సీబీఐకి ఇంగిత జ్ఞానం లేదు: సజ్జల
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ సునీత ఇచ్చిన వాంగ్మూలంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ దుమారం రేపింది. టీడీపీ నేతలే వివేకా హత్యకు పాల్పడ్డారని మీడియాకు చెప్పాలంటూ సజ్జల తనకు సూచించారని సునీత చెప్పిన వైనం …
Read More »మోడీ ఇంత భయపడుతున్నారా ?
మణిపూర్‌లో అల్లర్లపై పార్లమెంటులో చర్చించేందుకు నరేంద్రమోడీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోంది. రెండున్నర నెలలుగా మణిపూర్‌లో ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయో అందరు చూస్తున్నదే. ఒకవైపు రాష్ట్రం అట్టుడికిపోతున్నా, ఘోరాలు జరుగుతున్నా మోడీ ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా విదేశాల్లో తిరిగొచ్చారు. అంతర్జాతీయస్ధాయిలో దేశంపరువు పోయినా మోడీ లెక్కచేయలేదు. ఆ దశలన్నీ దాటిపోయి ఇపుడు మొదలైన వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని చర్చించాలంటే కేంద్రప్రభుత్వం ఇష్టపడటంలేదు. పార్లమెంటులో చర్చజరిగితే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటేనే …
Read More »కోడికత్తి కేసులో జగన్ విన్నపాలు కొట్టివేత
ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్షంలో ఉండగా.. ఆయనపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికి నాలుగేళ్లకుపైగానే ఈ కేసు నానుతోంది. ఈ దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. సరే.. ఈ కేసు దాదాపు పూర్తికావొచ్చింది. అయితే.. కేసులో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరోసారి పూర్తిగా విచారించాలంటూ సీఎం జగన్ …
Read More »విభజన హామీలపై ఏపీ, తెలంగాణలే తేల్చుకోవాలట
ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షగా మిగిలిన సంగతి తెలిసిందే. ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచినా విభజనానంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీ కోలుకోలేకపోయింది. ఈ నేపద్యంలోనే హోదాతో పాటు విభజన హామీల అమలు ప్రస్తావన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిసారీ టీడీపీ ఎంపీలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే …
Read More »ఆంధ్ర అప్పుల పై ఇదే కేంద్రం లెక్క
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే ఏపీ అప్పుల కుప్పగా మారిపోయిందని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడం చేతకాక, అప్పులతో రాష్ట్రాన్ని జగన్ నడిపిస్తున్నారని టీడీపీ వాళ్లు గొంతెత్తున్నారు. మీ హయాంలో అప్పులు లెక్కలు ఇవి అంటూ పరస్పరం విమర్శించుకుంటున్నారు. అసలు ఎవరి ప్రభుత్వంలో ఎంత …
Read More »దేశంలో ఏపీ నెంబర్ 1 : చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉందని అన్నారు. ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమే. అయితే.. ఏ విషయంలో అంటే.. గంజాయి పంట, రవాణాల విషయంలో ఏపీ ముందుందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదే వైసీపీ పాలనలో గొప్ప విషయమని ఆయన ఎద్దేవా చేశారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ …
Read More »మోడీ సర్కారుపై ఇండియా అవిశ్వాసం!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు రెడీ అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ అయిన.. విపక్షాలు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అవిశ్వాస తీర్మానం కనుక లోక్‌సభలో ప్రవేశ పెడితే.. విపక్షాలకు పైచేయి లభించినట్టు అవుతుందని భావిస్తున్నారు. లోక్‌సభ నిబంధనలలోని రూల్ 198 ప్రకారం.. అవిశ్వాస తీర్మానంపై ఎన్నిరోజులైనా చర్చించవచ్చు. …
Read More »ఓ.. లోకేష్ రెడ్‌బుక్ సంగతి అదా!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేస్తున్నారు. వర్షంలోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రదర్శించిన ఓ ఎర్ర రంగు అట్టతో ఉన్న పుస్తకం చర్చనీయాంశంగా మారింది. ఆ రెడ్‌బుక్ ఏమిటీ? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఎట్టకేలకు లోకేష్ సమాధానమిచ్చారు. ఆ రెడ్‌బుక్ గుట్టు ఏమిటో బయటపెట్టారు. ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న జగన్ మెప్పు పొందేందుకు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని …
Read More »బీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
మరికొద్ది నెల్లల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు గట్టి ఎదురు దెబ్బతగి లింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సంచలన తీర్పును తాజాగా వెలువరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా హైకోర్టు నిర్ధారించింది. అదేసమయంలో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన జలగం వెంకట్రావును …
Read More »మైనారిటీలకు కేసీయార్ ‘లక్ష’ తాయిలం ?
ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపధ్యంలో కేసీయార్ కు ఎక్కడెక్కడి మైనారిటీలు, సామాజికవర్గాలు గుర్తుకొచ్చేస్తున్నాయి. ఒకసారి ఉద్యోగులంటారు. మరోసారి నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ అంటారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులకు ఆర్ధిక సాయమంటారు. ఏదిచేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కోసమే అన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా మైనారిటిలకు నూరుశాతం సబ్సిడితో లక్షరూపాయల రుణాలను ఇవ్వటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మైనారిటీలంటే ముస్లింలు, క్రిస్తియన్లు మాత్రమే …
Read More »