భారీ వర్షాలు, వరదల వల్ల విజయవాడ నగరం కొద్ది రోజుల క్రితం చిగురుటాకులా వణికి పోయిన సంగతి తెలిసిందే. వరదలకు తోడు బుడమేరు వాగు పొంగడంతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. అయితే, అంత కష్టంలో ఉన్న తన ప్రజలను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడం, ఏడు పదుల వయసులోనూ వరద నీటిలో దిగి బాధితులకు నేనున్నాను అని భరోసానివ్వడంతో వారంతా ధైర్యంతో ఆ విపత్తును ఎదుర్కొన్నారు. …
Read More »పవన్ బూట్లు తుడుస్తానన్న అంబటి
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతల స్పందన ఆమోదయోగ్యంగా లేదని పవన్ విమర్శించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, అలా కాకుండా తమపై విమర్శలు చేయడం ఏమిటని పవన్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ పైర్ బ్రాండ్ …
Read More »నామినేటెడ్ పోస్టుల జాతర..చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, కూటమిలో సీట్ల సర్దుబాటు క్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల నుంచి ఎంతో మంది ఆశావహులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్కంఠకు తెర …
Read More »సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలపడంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముడా కేసులో దాఖలైన పిటిషన్లో విషయాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరముందని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 12న ఈ కేసు విచారణ పూర్తి చేసిన హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ కేసులో …
Read More »తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వరా?: చంద్రబాబు
తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, దోషులను పట్టుకునే విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అసలు జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన …
Read More »అనంతపురంలో రామాలయం రథం దగ్ధం..రంగంలోకి చంద్రబాబు
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన వ్యవహారంపై దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని, రథాలు తగులబెట్టారని అయినా దోషులను పట్టుకోవలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా ఏపీలో మరో వివాదం రాజుకుంది. అనంతపురం జిల్లాలోని రామాలయంలో రథం తగలబడిన …
Read More »అమరావతికి మహర్దశ..చంద్రబాబు కీలక ప్రకటన
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపబోతున్నామని చంద్రబాబు అన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ భేటీలో ఇదుకు సంబంధించిన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు పలు కీలక …
Read More »లడ్డూపై చంద్రబాబువి నిరాధార ఆరోపణలు: ఎంపీ స్వామి
తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు, నెయ్యిని ఉపయోగించిన వ్యవహారంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కోట్లాదిమంది హిందువులు, భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై …
Read More »కమల వైపే మోడీ మొగ్గు.. కానీ, ఏం జరుగుతోందంటే
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి-అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. నాలుగేళ్ల కిందట జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున మోడీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఇక, ఇప్పుడు కూడా ప్రధాని మోడీ.. అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. అయితే.. మోడీ రాకపై అధికార డెమొక్రాట్ల కంటే …
Read More »బీజేపీలోకి వైసీపీ రాజ్యసభ సభ్యుడు… నేడో రేపో ప్రకటన
వైసీపీ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా కాదు.. గుండుగుత్తగానే పార్టీ నుంచి జంప్ చేస్తున్నారా? వారి ప్లాన్ వేరేగా ఉందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. వైసీపీ నుంచి ఇద్దరు నేరుగా బయటకు వచ్చారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు.. పార్టీకి, వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సీట్లకు కూడా రాజీనామాలు సమర్పించారు. వీరిలో రమణ.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని …
Read More »బీజేపీ+జనసేన-వైసీపీ!!
తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చిన దరిమిలా ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు కూర్చున్నారు. మరోవైపు.. బీజేపీ నాయకులు కూడా దీనిని సీరియస్గా తీసుకున్నా రు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటిపై దాడికి కూడా యత్నం చేశారు. అంటే.. మొత్తంగా చూస్తే.. హిందూ అజెండా ఈ …
Read More »ముప్పేట దాడితో విరుగుతోన్న ఫ్యాన్ రెక్కలు ..!
రాజకీయంగా వైసీపీకి అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయి. సహజంగా ఏ పార్టీ అయినా.. ఓటమి తర్వాత తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ, వైసీపీలో అలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలుఎక్కడా జరగడం లేదు.పైగా.. పార్టీ అధినేత జగన్ తీరు మారడం లేదంటూ.. సొంత నేతలే విమర్శలు చేస్తూ..బయటకు వచ్చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న నాయకులు లేక.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates