ఏపీలో వలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ఆరు మాసాలుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ హయాంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను తాము కూడా కొనసాగిస్తామని.. వేతనాలు కూడా రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వ్యవస్థకు సంబంధించి సర్కారు అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇంతలోనే అసలు ఈ వ్యవస్థలేదంటూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
తాజాగా ఇదే అంశం శాసన మండలిలోనూ చర్చకు వచ్చింది. వలంటీర్ వ్యవస్థ ఉందా? లేదా? అంటూ.. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. వలంటీ ర్ వ్యవస్థ ఇప్పుడు మనుగడ లేదన్నారు. దీనికి కారణం జగన్ వారిని మోసం చేయడమేనని తెలిపారు. 2023 ఆగస్టు(ఎన్నికలకు 10 నెలల ముందు)లో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చి ఉండాల్సిందని.. కానీ, ఇవ్వలేదని, కాబట్టి వలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని పేర్కొన్నారు.
లేని వ్యవస్థలో ఉన్నారో లేదో కూడా తెలియని వలంటీర్లకు వేతనాలు ఎలా చెల్లించాలని ఆయన ప్రశ్నిం చారు. ప్రస్తుతం వలంటీర్లు లేరని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన వేతనాలను మే నెల వరకు చెల్లించామని డోలా చెప్పారు. అయితే, ఎన్నికల సమయంలో వారిని కొనసాగిస్తాంటూ చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే వారు అప్పట్లో వ్యవస్థలో ఉన్నారని అందరూ భావించారని, కానీ, జగన్ చేసిన మోసంతో వారువ్య వస్థకు దూరమయ్యారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి లేదన్నారు. వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రతి రూపాయి ఇచ్చే సిందన్నారు. లేని వ్యవస్థపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. కొత్తగా వలంటీర్లను తీసుకునే విషయం తన పరిధిలో లేదని, ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మంత్రి డోలా మండలిలో వివరించా రు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులకు మంత్రి కి మధ్య వాగ్వాదం నడిచింది. 2023లో జీవో ఇవ్వనప్పుడు.. ఈ ఏడాది మే వరకు వేతనాలు ఎందుకు చెల్లించారని.. అంటే వ్యవస్థలో వారు ఉన్నట్టే కదా? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు.