మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సోలాపూర్‌లో నిర్వహించిన పవన్ ర్యాలీలు, రోడ్ షోలు అక్కడి ప్రజలను ఆకట్టుకోవడమే కాక, స్థానిక అభ్యర్థులకు బలమైన మద్దతు అందించాయి. తాజాగా సోలాపూర్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోతే మీడియాతో మాట్లాడుతూ …
Read More »ఆ పదిమంది ఎమయ్యారు… వాయిస్ లేకుండా పోయిందా?
వైసీపీ ఎమ్మెల్యేలకు వాయిస్ లేకుండా పోయిందా? ఎక్కడా వారు కనిపించకపోవడానికి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయమే కారణమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పు డు.. ఎమ్మెల్యేలు.. సభకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఆ తర్వాత.. వారే.. బయటకు వచ్చి.. మీడియా ముందు నిప్పులు చెరిగేవారు. దీంతో టీడీపీ సభ్యుల వ్యవహారం ప్రజల మధ్య చర్చకు వచ్చేది. వారు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలిసేది. మీడియాలో కూడా వచ్చేది. …
Read More »సీఎం సీటుకు కుస్తీలు.. మహారాష్ట్రలో హీటెక్కిన పాలిటిక్స్!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్న బీజేపీ కూటమి మహాయుతి సంబరాల్లో మునిగిపోయింది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు. 288 స్థానాలకు గాను ఏకపక్షంగా ఈ కూటమి 210 స్థానాల్లో విజయం దక్కించుకుంది. మరోవైపు ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. దీంతో అధికారం ఎవరిదనేది స్పష్టమైంది. అయితే.. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సంబరాల్లో మునిగిపోతే.. కీలక నాయకులు మాత్రం కుస్తీలు పడుతున్నారు. ముఖ్యమంత్రి …
Read More »ఇందిరమ్మ కుటుంబంలో ఫస్ట్: ప్రియాంకకు ఓట్ల వరద!
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం ఓటర్లు వరదలా విరుచుకుపడ్డారు. ఎవరూ ఊహించని విధంగా ప్రియాంకకు ఓట్లు పోటెత్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. గతంలో ఇందిరమ్మ కుటుంబంలో ఎవరికీ రాని ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. “ఇందిరా గాంధీ మనవరాలిగా చెబుతున్నా.. ” అంటూ ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించేశాయి. తాజాగా కేరళలోని వయనాడ్ …
Read More »వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు హఠాత్తుగా వేడెక్కాయి. నెల రోజుల కిందటి వరకు వైసీపీ నుంచి పలువురు నాయకులు బయటకు వచ్చారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రాజీనామా చేసి ఫ్యాన్ కింద ఉండలేమంటూ.. సైకిల్ ఎక్కారు. దీంతో అప్పట్లో వైసీపీలో కొంత మేరకు అలజడి నెలకొంది. అయితే. .కొన్నాళ్లుగా ఈ వ్యవహారానికి బ్రేకులు పడ్డాయి. …
Read More »జైలు ఎఫెక్ట్: జార్ఖండ్‌లో కొత్త చరిత్ర!
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా+కాంగ్రెస్ విజయం దక్కించుకున్నాయి. వాస్తవానికి జార్ఖండ్ ప్రజల నాడిని గమనిస్తే.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఏ పార్టీకి కూడా.. వరుసగా ప్రజలు విజయాన్ని కట్టబెట్టడం లేదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెడుతున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం గత …
Read More »బీజేపీకి ‘మహా’ విజయం!
మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహా విజయం దక్కించుకుంది. ఊహలకు సైతం అందని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కనీవినీ ఎరుగని విధంగా.. దూసుకుపోయింది. 210 స్థానాల వద్ద విజయతీరానికి సగర్వంగా చేరుకుంది. ఇదేమీ మామూలు విషయం కాదు. 1990 తర్వాత.. ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమిని ప్రజలు గెలిపించారు. ముఖ్యంగా బీజేపీకే ఈ …
Read More »పవన్ సింగిల్ గా పోటీ చేసి గెలవగలరా?: రోజా
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో మిస్సింగ్ మహిళల పెండింగ్ కేసులు 846 అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడంతో పవన్ చెప్పినవి అబద్ధాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై మాజీ …
Read More »జమిలి వచ్చినా.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జమిలి ఎన్నికల్ని తెర మీదకు తీసుకొస్తారన్న ప్రచారాన్ని సింఫుల్ గా తేల్చేశారు ఏపీ సీఎం. జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ.. రెగ్యులర్ గా షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికలు మాత్రం యథావిధిగా సాగుతాయని చెప్పారు. దేశంలో జమిలి వచ్చినా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు యథావిధిగా …
Read More »ఆంధ్రోడి సగటు అప్పు లెక్క కట్టిన కాగ్
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం ఎంతన్న విషయాన్ని లెక్క కట్టింది కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). తాజా లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తలసరి అప్పు ఒక్కో తల మీద రూ.1,03,758గా లెక్క కట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే 2018-19 నాటికి ఏపీలోని ఒక్కో ఆంధ్రోడి తల మీద …
Read More »జగన్ లంచం తీసుకొని ఉంటే శిక్షించాలి: కేటీఆర్
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చారని, సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీతో జగన్ కు లింకులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ- జగన్ ఇష్యూపై మాజీ …
Read More »షర్మిల కామెంట్లపై బాలయ్య ఫస్ట్ రియాక్షన్
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి జరిగిందని గతంలో షర్మిల ఆరోపించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తొలిసారి స్పందించారు. వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని బాలయ్య అన్నారు. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates