రాజకీయాలు.. రాజకీయ నేతలు అన్నంతనే ఒకలాంటి భావన మనసులో ఉంటుంది. అయితే.. కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం గౌరవాన్ని ఇవ్వటం.. తొందరపడి మాట అనే సాహసం చేసే అపురూప వ్యక్తిత్వం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు సొంతం. తెలుగు రాజకీయాల్లో అసమాన్య వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారన్న సంగతి తెలిసిందే. సాధారణంగా తాను రాజకీయంగా బలంగా ఉండే ప్రాంతంలో ఇంకెవరైనా ఎదుగుతున్నా
రంటే ఒకలాంటి ఉడుకుమోతుతనాన్ని ప్రదర్శించటం.. వారితో వైరం సాగుతుంది.
అందుకు భిన్నంగా ఉంటుంది అశోక్ గజపతిరాజు వ్యవహారం. తాను ఉండే విజయనగరం లోక్ సభా స్థానానికి ఎంపీగా వ్యవహరిస్తున్న టీడీపీనేత అప్పలనాయుడి విషయంలో ఆయన ప్రదర్శించిన ఉదారత.. పెద్ద మనసు గురించి తెలిస్తే ఆయన మీద గౌరవం రెట్టింపు కాక మానదు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడికి అశోక్ గజపతిరాజు తాజాగా ఒక అపురూపమైన బహుమతిని ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పలువురు కార్యకర్తలు తనకు ఇచ్చిన ఒక సైకిల్ ను ఆయనకు ఇచ్చారు.
పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లే ఎంపీగా గుర్తింపు పొందిన కలిశెట్టి.. తాను ప్రాతినిధ్యం వహించే టీడీపీ మీద ఉన్న అభిమానం కారణంగా.. పసుపురంగు సైకిల్ మీద రాకపోకలు సాగిస్తూ ఉంటారు. తాజాగా ఆయనకు అశోక్ గజపతి రాజు సైకిల్ ను బహుకరించారు. స్థానికంగా తిరిగేందుకు ఈ సైకిల్ వినియోగించేందుకు వీలుగా ఉండనుంది. నిజానికి ఈ సైకిల్ మీదనే అప్పట్లో అశోక్ గజపతి రాజు తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని భాగమైన మన్యంతో పాటు చీపురుపల్లి ప్రాంతాల్లో పర్యటించేవారు. ఇప్పుడు ఆ సైకిల్ ను అప్పలనాయుడికి బహుమతిగా ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates