Political News

నిజంగానే మోడికి జగన్ భయపడుతున్నాడా ?

దేశంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఎవరైనా ఒకనేత ఓ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పగానే వెంటనే దాన్ని ఖండిస్తునో లేదా ఆ ఖండనలకు వ్యతిరేకంగానో వెంటనే ట్వీట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడింతా ఎందుకంటే నరేంద్రమోడి కేంద్రంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్-జగన్మోహన్ రెడ్డి-ఒడిస్సా ఎంపి సప్తగిరి ఉలాకా మధ్య జరుగుతున్న ట్వీట్లయుద్ధం మొదలైంది కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏపి, తెలంగాణా, జార్ఖండ్, …

Read More »

కమల్ కు దెబ్బ మీద దెబ్బ

తమిళనాడు ఎన్నికల తర్వాత కమలహాసన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మక్కళ్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) పేరుతో కమల్ మూడేళ్ళ క్రితమే ఓ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. మొదటిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పాల్గొంది. తాజా ఎన్నికల్లో 234 సీట్లకు గాను పార్టీ 150 చోట్ల పోటీచేసింది. అయితే ఒక్కరంటే ఒక్కరు కనీసం అధినేత కమల్ హాసన్ కూడా గెలవలేదు. మొదట్లో ధక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గంలో …

Read More »

ష‌ర్మిల ప‌ని అప్పుడే అయిపోయిందా ?

తెలంగాణ‌లో రెండు నెల‌లుగా రాజ‌కీయంగా ష‌ర్మిల కొత్త పార్టీ వార్త‌లు ఒక్కేట కాక‌రేపుతూ వ‌చ్చాయి. తాను ఎప్పుడు అయితే తెలంగాణ‌లో కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారో అప్ప‌టి నుంచి తెలంగాణ‌లో ప్ర‌తి రోజూ ష‌ర్మిల పార్టీ వార్త‌లే ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచాయి. ష‌ర్మిల కొత్త పార్టీలోకి ఎవ‌రెవ‌రు వెళ్లిపోతారు ? ఏం జ‌రుగుతుంది ? ఆ పార్టీ ఎక్క‌డ స్ట్రాంగ్‌గా ఉంది ? ష‌ర్మిల ఎక్క‌డ పోటీ చేస్తారు …

Read More »

జ‌గ‌న్.. ఇంత దెబ్బేస్తాడ‌నుకోలేదా ?

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఏమంత ఆశాజ‌న‌కంగా లేవు. ఒక్క అధికార పార్టీ త‌ప్ప‌.. మిగిలిన అన్ని పార్టీలూ కూడా అచేత‌నంగా ఉన్నాయి. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో అయినా.. ఇత‌ర ఏ పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన ప‌క్షాల‌ ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉండేది. “వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం” అనో.. లేక‌.. అధికార పార్టీ ప‌ని అయిపోయింది.. సో.. ఈ పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌నో.. చ‌ర్చ …

Read More »

తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్

గత నెల వరకు 45 ఏళ్లు పైబడ్డ వారికే వ్యాక్సిన్ వేస్తూ వచ్చారు. కానీ ఈ నెల ఒకటో తారీఖు నుంచి 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకూ వ్యాక్సిన్ అంటూ ఘనంగా ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని రోజుల ముందే రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టింది. కానీ ఈ ప్రకటనలన్నీ పేరుకే అని తేలిపోయింది. 45 ఏళ్లు పైబడ్డ వాళ్లకే సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోగా.. 18 ప్లస్ వాళ్లకు …

Read More »

‘ఎల్జీ’ ఘ‌ట‌న‌కు ఏడాది: వెంటాడుతున్న జ‌గ‌న్ వైఫ‌ల్యాలు!

దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన‌.. విశాఖ ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌కు నేటితో(మే7) ఏడాది పూర్త‌యింది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా కరోనా మొదటి దశ ఉద్ధృతంగా ఉండగా.. సరిగ్గా ఇదేరోజున రాష్ట్ర ప్రజలను మరో దుర్ఘటన ఉలిక్కి పడేలా చేసింది. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన పెను సంచలనమే సృష్టించింది. అనేక మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచిన ఆ ఘోరం ఇంకా …

Read More »

నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఇంత వివక్షా ?

దేశం యావత్తు కరోనా వైరస్ కష్టకాలంలో ఉండగా సాయం అందించటంలో నరేంద్రమోడి సర్కార్ పక్షపాతబుద్ధి బయటపడిందా ? అవుననే సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి మరి. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటికే టీకాలను అందించటంలోను, ఆక్సిజన్ సరఫరా చేయటంలోనే కేంద్రం అనుసరిస్తున్న వివక్ష బయటపడింది. ఎక్కువ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు టీకాలను అందిచని విషయం బయటపడింది. రోజుకు వేలాది కేసులు …

Read More »

ప్రభుత్వాలపై పెరిగిపోతున్న ఒత్తిడి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోతున్నకొద్దీ లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గాలంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం ఒకటే ఏకైక మార్గమని ఒకవైపు న్యాయస్ధానాలు మరోవైపు శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ పెట్టక వేరే దారి కనబడటంలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సుప్రింకోర్టు, రాష్ట్రాల ప్రభుత్వాలపై హైకోర్టులు అనేకసార్లు …

Read More »

సంగం డెయిరీకి పెద్ద ఊర‌ట‌.. జ‌గ‌న్ జీవోను కొట్టేసిన హైకోర్టు

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ చైర్మ‌న్‌గా ఉన్న సంగం డెయిరీకి సంబంధించి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు అన్నింటినీ.. హైకోర్టు కొట్టివేసింది. దీంతో సంగం డెయిరీకి పెద్ద ఊర‌ట ల‌భించ‌గా.. సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మాత్రం పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ట‌యింది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్రపై పలు అవినీతి, అక్రమాలు, నయవంచన తదితర నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల …

Read More »

బయటపడిన మోడి డబల్ గేమ్

ఒకవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాలు రాష్ట్రాలకు అందటంలేదు. రాష్ట్రాలకు అవసరమైన టీకాల ఉత్పత్తిని పెంచటం సాధ్యం కాదని టీకాలు ఉత్పత్తిచేస్తున్న రెండు ఫార్మాకంపెనీలు చేతులెత్తేశాయి. ముందు 60 ఏళ్ళ వాళ్ళకి టీకాలన్నారు. తర్వాత 45 ఏళ్ళ వాళ్ళకి కూడా టీకాలు వేయాలన్నారు. ఎప్పుడైతే టీకాలు వేసే వయసును 60 నుండి 45కి తగ్గించారో అప్పటి నుండే టీకాల కొరత మొదలైపోయింది. ఈ నేపధ్యంలోనే 18 ఏళ్ళు …

Read More »

అంద‌రూ రెడ్లే… జ‌గ‌న్‌కు భ‌లే చిక్కొచ్చిందే ?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కేబినెట్ ఏర్పాటు చేసిన రోజే రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్ప‌టి కేబినెట్లో 90 శాతం మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెప్పారు. జ‌గ‌న్ సీఎం పీఠం ఎక్కి రెండేళ్లు అయిపోయాయి. స్థానిక ఎన్నిక‌లు, తిరుప‌తి ఉప ఎన్నిక ముగిసింది. వైసీపీ అప్ర‌తిహ‌త విజ‌యాలు న‌మోదు చేసింది. ఇప్పుడు మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పుల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 20 మంది వ‌ర‌కు అవుట్ అవుతార‌నే చ‌ర్చ‌లే …

Read More »

కొండా విశ్వేశ్వరరెడ్డితో ఈటల… కొత్త సంచలనాలకు దారి?

తెలంగాణ రాజ‌కీయాల ఈక్వేష‌న్లు మారుతున్నాయా? టీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన‌.. ఈట‌ల రాజేంద‌ర్ సెంట్రిక్‌గా రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాలు యూట‌ర్న్ తీసుకుంటున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. టీఆర్ఎస్ లోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఎమ్మెల్యేగానే కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కేసీఆర్ త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించ‌డంపై ఈట‌ల తీవ్రంగా మ‌థ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా ఆయ‌న రిజైన్ చేయాల‌ని …

Read More »