ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న టీడీపీకి వచ్చే ఎన్నికలు చావోరేవో లాంటివి. 2024 ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉంటుందనేది నిపుణుల మాట. కానీ జగన్ ధాటిని తట్టుకుని విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆ ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసి తిరిగి ప్రజల ఆదరణ పొందే దిశగా తండ్రీకొడుకులు అడుగులు వేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ …
Read More »సోమిరెడ్డిని సైడ్ చేసినట్లేనా ?
సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సైడ్ చేసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్చార్జిగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును చంద్రబాబునాయుడు నియమించారు. జిల్లాలో ఎంతోమంది సీనియర్లుండగా, సోమిరెడ్డి యాక్టివ్ గానే ఉన్నప్పటికీ ప్రత్యేకించి అచ్చెన్నను ఇన్చార్జిగా నియమించాల్సిన అవసరం ఏమిటి ? నిజానికి అచ్చెన్న నెల్లూరు జిల్లాలో చేయగలిగింది కూడా …
Read More »మద్యం అమ్మే కంపెనీకి సంక్షేమ బాధ్యతలా ?
కొన్ని సార్లు జగన్ ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. మద్యం అమ్మటం, సంక్షేమం రెండు పరస్పర విరుద్ధమైన చర్యలని అందరికీ తెలిసిందే. ఎందుకంటే మద్యం తాగటం అన్నది సంక్షేమం క్రిందకు ఏ రకంగా చూసినా రాదు. మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద కారణంగా కుటుంబాలు రోడ్డున పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల అమలు బాధ్యతలను మద్యం అమ్మకాలు, నియంత్రణ నిర్వహించే కంపెనీకి రాష్ట్ర …
Read More »వెంకయ్య రాజీనామా చేస్తానంటే వద్దన్నారా ?
ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసి రాజకీయాలనుండి తప్పుకుని పూర్తిగా ప్రజా సేవ చేయాలని వెంకయ్య నాయుడు అనుకుంటే ఎవరైనా వద్దన్నారా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. నెల్లూరు పర్యటనలో ఉన్న వెంకయ్య ఓ సమావేశంలో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేసి ప్రజాసేవలో పాల్గొనాలని ఉన్నట్లు చెప్పారు. జనాల్లో తిరుగుతూ జనాలకు మంచి చేయటంలో ఉన్న ఆనందం తనకు ఉపరాష్ట్రపతి పదవిలో రావటం లేదని బాధపడిపోయారు. జనాలకు మంచిపనులు …
Read More »బాబు మాటే నెగ్గుతోందా… వైసీపీ ఇదే మాట అంటోందా…!
ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారు ఇదే మాట చెబుతున్నారు. ఇక, అధికార పార్టీలోనూ ఇదే గుసగుస వినిపిస్తోంది. “చంద్రబాబు చెప్పిందే ఫైనలా?” అంటూ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో తలెత్తిన వివాదం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం జీవో 42, జీవో 50లను తీసుకువచ్చింది. తద్వారా ఆయా విద్యాసంస్థలు.. ప్రైవేటు పరం …
Read More »శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ, కర్నాటక సరిహద్దు వివాదం తేలేంతవరకూ తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తును నిలిపివేయాలని శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగదీస్తుందంటూ ఆమె తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని కోర్టు దృష్టికి న్యాయవాది తెచ్చారు. వాదనలు విన్న కోర్టు శ్రీలక్ష్మి …
Read More »పాదయాత్ర ఎఫెక్ట్.. తలపట్టుకుంటున్న జగన్..!
వైసీపీ అధినేతకు పాదయాత్ర సంకటం పట్టుకుందా? ఆయనకు పాదయాత్ర తలనొప్పిగా మారిందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు ఔననే అంటున్నారు. అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఆయన అడిగిన వారికి అడిగినట్టు హామీలు కుమ్మరించారు. ఒక్క కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ తప్ప.. మిగిలిన అనేక వర్గాలకు ఆయన హామీలు ఇచ్చారు. దీనిలో ప్రధానంగా కీలకమైన ఉద్యోగ …
Read More »జగన్‌కు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి: తెలంగాణ మంత్రి
మాటకు మాట! నువ్వు రెండంటే.. నే నాలుగంటా!! నువ్వు తమలపాకుతో అంటే.. నేను తలుపుచెక్కతో అంటా!!- ఇదీ… ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాజాగా చోటు చేసుకున్న ఘటన. ఇటీవల కాలంలో ఎడ మొహం.. పెడమొహంగా ఉంటున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్యం చేకూరుతుందని.. అందరూ అనుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య భగ్గున అగ్గి రాజుకుంది. తాజాగా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత.. …
Read More »జగన్ కోపం.. భయంగా మారుతోందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అమరావతి అంటే ఎంత కోపమో అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏరికోరి రాజధానిగా ఎంచుకున్న ఈ ప్రాంతాన్ని కక్షగట్టి దెబ్బ కొట్టారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ముందు నుంచి రాజధానిగా అమరావతిని వ్యతిరేకించినా సరేలే అనుకోవచ్చు. కానీ రాజధానిగా ఆ ప్రాంతానికి మద్దతునిచ్చి, తాను అధికారంలోకి వచ్చాక కూడా అమరావతే రాజధానిగా ఉంటుందని నమ్మబలికి.. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగానే స్వరం మార్చేశారు వైకాపా …
Read More »ఈ ఓవర్ యాక్షన్ అవసరమా ?
కుప్పంలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై హైకోర్టు మండిపడింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధులు ముందస్తుగా తమ నుండి అనుమతి తీసుకోవాలని పలమనేరు డీఎస్పీ నోటీసులివ్వటం బాగా వివాదాస్పదమైంది. దారినపోయే చెత్తను నెత్తినేసుకున్నట్లుంది పోలీసుల వ్యవహారం. అవసరం లేనిచోట బాగా ఓవర్ యాక్షన్ చేసి చివరకు హైకోర్టు దగ్గర అంక్షితలు వేయించుకుంటే కానీ పోలీసులకు తృప్తి తీరలేదేమో. నిజానికి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పోలీసులకు అసలు …
Read More »పీఆర్సీపై ఎందుకింత వివాదం ?
లక్షలాది ఉద్యోగులు ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిటి (పీఆర్సీ) నివేదిక సిఫారసులు అమలు చేయటం బాగా వివాదాస్పదమవుతోంది. పీఆర్సీ నివేదికను అమలు చేయటం అన్నది ప్రభుత్వం విధి. దానికన్నా ముందు ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో లేదా ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటితో మాట్లాడి బేరసారాలు చేయడం కూడా మామూలే. ఎందుకంటే నివేదికలో సిఫారసు చేసినట్లు ఫిట్ మెంట్ ను ఉద్యోగ సంఘాలు అంగీకరించవు. అలాగే ఉద్యోగసంఘాల డిమాండ్ …
Read More »కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్న కేంద్రం!
కేంద్రంపై సీఎం కేసీఆర్ యుధ్దాన్నే ప్రకటించారు. శుక్రవారం నుంచి కదన రంగాన్ని సిద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదేనని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఇక కేంద్రం కూడా కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవాడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రం సీరియస్ గా తీసుకుందని, ఆయనను కట్టడి చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ధాన్యం కొలుగోలు, కృష్ణా జలాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates