మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అత్యంత కీలకమైన రెండు అంశాల్లో జగన్ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండం అధికార పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో సహకారం అందిస్తున్నప్పటికీ అటు నుంచి మాత్రం ఏమాత్రం సహకారం లేకపోగా.. జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా సమాచారాన్ని బయటపెడుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన …
Read More »తమిళనాట ఆ కూటమికి బంపర్ మెజారిటీ?
దేశంలో త్వరలోనే నాలుగు రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న వాటిలో తమిళనాడు ఒకటి. సంప్రదాయానికి మారుస్తూ వరుసగా రెండోసారి ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఐదేళ్ల కిందట ఆశ్చర్యపరిచారు తమిళనాడు ప్రజలు. జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే పార్టీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. కానీ ఈ విజయాన్ని ఎంతోకాలం జయలలిత ఆస్వాదించలేకపోయారు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే అనారోగ్యంతో …
Read More »అందుకే అందరినీ దూరం పెట్టేశారా ?
విజయవాడ నగరం తెలుగుదేశంపార్టీ నేతలు-చంద్రబాబునాయుడు వ్యవహారంపై పార్టీలో చర్చ పెరిగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వచ్చే ముందురోజు పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు రోడ్డుపై పడిన విషయం తెలిసిందే. ఎంపి కేశినేని నాని-ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ+అధికార ప్రతినిధి నాగూల్ మీరా మధ్య ఉన్న విభేదాలతో రచ్చ రచ్చ అయిపోయింది. పై ముగ్గురు ఎంపిని మీడియా సమావేశంలోనే నోటికొచ్చినట్లు తిట్టారు. తిట్టడమే కాకుండా …
Read More »విభజన హామీపై మరో దెబ్బ
రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మరోదానిపై ప్రస్తుత నరేంద్రమోడి సర్కార్ దెబ్బ కొట్టింది. కేంద్రం దెబ్బ కొట్టిందనేకంటే రాష్ట్ర ప్రయోజనాలను మరోసారి మోసం చేయటమంటేనే కరెక్టు. మైనర్ పోర్టయిన రామాయపట్నం పోర్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిది కాదంటు తేల్చి చెప్పేసింది. రాజ్యసభలో బీజేపీ సభ్యులు టీజీ వెంకటేష్, జీవిఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు పోర్టులు, నౌకాయానమంత్రి మన్ సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. రామాయపట్నాన్ని …
Read More »రిపబ్లిక్ ఆర్నాబ్ కు సజ్జల భారీ వార్నింగ్
సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది రిపబ్లిక్ టీవీ. ఏదైనా అంశంపై అదే పనిగా నెగిటివ్ స్టోరీలు టెలికాస్ట్ చేస్తుందని దాని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటే.. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. దాని సంగతి చూసే వరకు వదిలిపెట్టరన్న మాటను రిపబ్లిక్ టీవీని అభిమానించే వారు చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా రిపబ్లిక్ టీవీని.. దాని అధినేత ఆర్నాబ్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు …
Read More »మోడీ హయాంలో ప్రైవేటు పరం చేయాలనుకున్న 35 సంస్థలు ఇవే
వ్యాపారం అన్న తర్వాత నష్టం వస్తుందా? వస్తే.. అసలు వ్యాపారం ఎందుకు చేస్తారు? కొంతకాలం లాభం వచ్చి.. ఆ తర్వాత నష్టం వస్తున్నదంటే ఏదో తేడా ఉన్నట్లేగా? అయినా.. ఏదైనా సంస్థను ఏర్పాటు చేయటం గొప్ప. దాన్ని అమ్మేయటం ఎంతసేపు? ఆస్తులు కూడబెట్టటంలో ఉన్న కష్టం.. అమ్మటం ఏమంత విషయం కాదు. కానీ.. మోడీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగంలో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయటం …
Read More »జగన్ కి అంతా తెలుసు అని మరోసారి కన్ ఫం చేసిన కేంద్రం
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు తెలిసే జరుగుతోందని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ విషయంపై వైసీపీ నాయకులు చెప్పిన మాటలు, చేస్తున్న పనులు ఈ పరిణామంతో అంతా మాయేనని స్పష్టమైంది. ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేసేందుకు కాదంటూ.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ …
Read More »గెలిచే ఛాన్స్ టీడీపీదే.. కానీ.. ఓటమి దిశగా.. ఎందుకిలా?
రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించాలని.. పార్టీని పుంజుకునేలా చేయాలని… చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ప్రయాస పడుతున్నారు. రోడ్ షోలు నిర్వ హిస్తున్నారు. గెలిచి తీరాలనే లక్ష్యంతో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. గెలిచే అవకాశం ఉన్న నగర మునిసిపాలిటీల్లో ఇప్పుడు తప్పటడుగులు పడు తున్నాయి. ఇలాంటి చాలానే ఉన్నాయని.. అంచనాలు వస్తున్నా… ఇటు చంద్రబాబు …
Read More »డిప్యుటీ మేయర్ గా అరంగేట్రం
తొందరలో జరగబోతున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యుటి మేయర్ గా అభినయ్ రెడ్డి ఎన్నికవ్వటం ఖాయమేనా ? తిరుపతిలో జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే అభినయ్ రెడ్డి ఎన్నిక లాంఛనమనే చెప్పాలి. ఎందుకంటే అభినయ్ తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కాబట్టి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారుసునిగా కొడుకును పోటీ చేయించే ప్లాన్ లో ఎంఎల్ఏ ఉన్నారు. షెడ్యూల్ ఎన్నికలకు ముందు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న …
Read More »స్టాలిన్ ప్రచారం మాత్రమే చేస్తారట
తమిళనాడు ఎన్నికల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. డీఎంకే యువజన విభాగం ప్రదాన కార్యదర్శి, డీఎంకే చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితవుతున్నారు. ఒకవైపు సినిహీరోగా మరోవైపు రాజకీయ నేతగా ఉదయనిధి మంచి జోరు మీదున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ లేదా చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ స్దానాల్లో ఏదో ఒకచోట నుండి పోటీ చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పార్టీ అధిష్టానికి …
Read More »వైసీపీలో బెజవాడ మేయర్ పీఠం సస్పెన్స్..!
వైసీపీలో బెజవాడ మేయర్ పీఠం ఎవరికి ఇస్తారు? ఎవరికి ఈ పీఠం దక్కుతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్నా.. మేయర్ పీఠంపై వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారు. ప్రధానంగా గెలుస్తామా? లేదా? అనే సందేహంతో ఉన్నారా? లేక.. ఎవరికి వారు పోటీలో ఉన్నందున.. ఎవరికి అవకాశం ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే.. ఏం కొంపలు మునుగుతాయోనని భయపడుతున్నారా? అనేది ప్రశ్నగా మారింది. ఈ …
Read More »రాసలీలల సీడీ కేసులో ఊహించని ట్విస్టు
కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది కర్ణాటక రాసలీలల కేసు. తన దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చిన మహిళనను మోసం చేసి.. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేశ్ జార్కిహోళిపై కంప్లైంట్ చేయటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు బీజేపీ అధినాయకత్వం ఒత్తిడితో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సీడీలోని మహిళ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates