ఒకవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాలు రాష్ట్రాలకు అందటంలేదు. రాష్ట్రాలకు అవసరమైన టీకాల ఉత్పత్తిని పెంచటం సాధ్యం కాదని టీకాలు ఉత్పత్తిచేస్తున్న రెండు ఫార్మాకంపెనీలు చేతులెత్తేశాయి. ముందు 60 ఏళ్ళ వాళ్ళకి టీకాలన్నారు. తర్వాత 45 ఏళ్ళ వాళ్ళకి కూడా టీకాలు వేయాలన్నారు. ఎప్పుడైతే టీకాలు వేసే వయసును 60 నుండి 45కి తగ్గించారో అప్పటి నుండే టీకాల కొరత మొదలైపోయింది. ఈ నేపధ్యంలోనే 18 ఏళ్ళు …
Read More »అందరూ రెడ్లే… జగన్‌కు భలే చిక్కొచ్చిందే ?
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కేబినెట్ ఏర్పాటు చేసిన రోజే రెండున్నరేళ్ల తర్వాత ఇప్పటి కేబినెట్లో 90 శాతం మార్పులు, చేర్పులు ఉంటాయని చెప్పారు. జగన్ సీఎం పీఠం ఎక్కి రెండేళ్లు అయిపోయాయి. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక ముగిసింది. వైసీపీ అప్రతిహత విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 20 మంది వరకు అవుట్ అవుతారనే చర్చలే …
Read More »కొండా విశ్వేశ్వరరెడ్డితో ఈటల… కొత్త సంచలనాలకు దారి?
తెలంగాణ రాజకీయాల ఈక్వేషన్లు మారుతున్నాయా? టీఆర్ఎస్ కీలక నాయకుడు, ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన.. ఈటల రాజేందర్ సెంట్రిక్‌గా రాష్ట్ర రాజకీయ పరిణామాలు యూటర్న్ తీసుకుంటున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. టీఆర్ఎస్ లోనే ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నప్పటికీ.. ఇటీవల కేసీఆర్ తనను మంత్రి వర్గం నుంచి తొలగించడంపై ఈటల తీవ్రంగా మథన పడుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రిజైన్ చేయాలని …
Read More »తప్పు మన దగ్గర పెట్టుకుని ఎదురు దాడెందుకు మంత్రివర్యా.. నెటిజన్ల టాక్!
కరోనా భూతం రాష్ట్రాన్ని భయపెడుతున్న పరిస్థితిని ఎవరూ తోసిపుచ్చలేరు. అధికారపార్టీ వైసీపీలోనూ సీనియర్ నాయకుల నుంచి జూనియర్ల వరకు.. రాష్ట్రంలో పరిస్థితిని కాదనలేక పోతున్నారు. ఇక, ఈ పరిస్థితిని దాచిపెట్టి.. ప్రజలకు అంతా మేలే జరుగుతోందన్న విధంగా ప్రబుత్వం చెబుతోంది. అయితే.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో.. ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో.. ప్రధాన మీడియా ప్రసారం చేస్తోంది. ఇక, ఈ విషయంపై ప్రతిపక్షాలు.. ప్రశ్నించకుండా ఉంటాయా? అలా ఉంటే.. …
Read More »మనసు మార్చుకున్న టీడీపీ కురువృద్ధుడు….!
రాజకీయాల్లో ఆవేశాలు-ఆక్రోశాలు కామన్. తమకు ఆశించిన విధంగా న్యాయం జరగకపోయినా.. తమకు అనుకున్న విధంగా పదవులు లభించకపోయినా.. నాయకులు అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై కొన్నిసార్లు సంచలన ప్రకటనలు చేస్తుంటారు. అయితే.. కొన్నాళ్లకు మళ్లీ వాటిని మరిచిపోయి.. యథా విధిగా తమ రాజకీయాలు కొనసాగిస్తారు. ఇప్పుడు ఇలాంటి బాపతు నాయకులు టీడీపీలో పెరుగుతున్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు నచ్చకో.. లేక పార్టీ పరిస్థితిపై వారికి అనుమానంతోనో.. ఇటీవల కాలంలో …
Read More »ప్రధాని మోడీపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మరోసారి ఫైరైంది. ప్రస్తుతం దేశాన్ని చుట్టుముట్టి.. కరోనా సెకండ్ వేవ్‌ను అడ్డుకోవడంలోను, ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాల్లో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని సుప్రీం కోర్టు మరోసారి సీరియస్‌గా వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ సరఫరా వంటి పలు అంశాలపై.. సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తాజాగా మరోసారి.. దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా …
Read More »తమిళ రాజకీయాల్లో స్టాలిన్ రికార్డు
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సరికొత్త రికార్డు సృష్టించారనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి ఎంకే కరుణానిధి రాజకీయ వారసునిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న మొదటి వ్యక్తి స్టాలిన్ మాత్రమే. ఇప్పటివరకు తమిళనాడును పరిపాలించిన ముఖ్యమంత్రుల వారసులెవరు ముఖ్యమంత్రులు కాకపోవటం గమనార్హం. తమిళనాడు ఏర్పడిన దగ్గర నుండి చాలామందే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే వారసత్వంగా సీఎం అయ్యింది మాత్రమే స్టాలిన్ ఒక్కరే. 1952 నుండి తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా రాజాజీ, …
Read More »ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు
జువారి సిమెంట్స్ ప్లాంట్ మూసివేత వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాకేఇచ్చింది. వాతావరణ కాలుష్యానికి కారణం అవుతోందని కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో ఉన్న జువారి సిమెంట్ ప్లాంటును ప్రభుత్వం వారంరోజుల క్రింద మూయించేసిన విషయం తెలిసిందే. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు వ్యతిరేకంగా ప్లాంట్ యాజమాన్యం హైకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ వివరాలను పరిశీలించిన కోర్టు మూసివేత నిర్ణయం చెల్లదంటూ స్పష్టంచేసింది. వాతావరణ కాలుష్యం నియంత్రణకు తమ ప్లాంటు …
Read More »కేసీయార్ పై పెరుగుతున్న ఒత్తిడి
ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత కేసీయార్ పైన ఒత్తిడి పెరిగిపోతోందట. రాజీనామాతో పోయేదానికి కేసీయార్ బర్తరఫ్ దాకా తీసుకెళ్ళారనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది. భూకబ్జాల ఆరోపణలు రాగానే వెంటనే ఈటల రాజేందర్ నుండి మంత్రిత్వ శాఖలను పీకేశారు. మరుసటి రోజు ఏకంగా బర్తరఫ్ చేసేశారు. నిజానికి ఈటలకు జరిగిన ఘోర అవమానంగానే భావించాలి. ఆశ్చర్యమేమంటే ఇదే విధమైన లేదా ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు, ఎంఎల్ఏలపైన మాత్రం …
Read More »‘బద్వేలు’ కు కరోనా దెబ్బ
కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లే. వైసీపీ ఎంఎల్ఏ డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. నిబందనల ప్రకారం సభ్యుడు మరణంతో ఖాళీ అయిన స్ధానంలో ఆరుమాసాల్లోగా ఉపఎన్నిక జరపాలి. ఈ లెక్కన సెప్టెంబర్ 28వ తేదీలోగా ఎన్నిక జరగాల్సుంది. అయితే హఠాత్తుగా వచ్చి మీదపడిన కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి కారణంగా ఉపఎన్నిక నిర్వహణ సాధ్యంకాదని …
Read More »మీ అస్త్రం మీపైనే… బెంగాల్లో బీజేపీ గురవింద నీతి ?
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తిరుగులేని విజయం సాధించారు. తృణమూల్ గెలిచిన వెంటనే బెంగాల్లో తృణమూల్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొన్ని చోట్ల బీజేపీ వాళ్లపై చిన్నా చితకా దాడులు జరిగాయి. బీజేపీ ఆఫీసులు కూడా తగలబడ్డాయి. వీటిపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి. సరే ఇదిలా ఉంటే తమ పార్టీ కార్యకర్తలను తృణమూల్ కార్యకర్తలు పరిగెత్తించి మరీ కొడుతున్నారు …
Read More »కమల్ హాసన్ ను ఓడించిన ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
రీల్ లో తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకొని.. రియల్ లైఫ్ లో పొలిటీషియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేయటం కొత్తేం కాదు. చాలా పాతది. అయితే.. ఇటీవల కొత్త ట్విస్టు ఒకటి షురూ అయ్యింది. గతంలో రీల్ దేవతలు ఎన్నికల బరిలోకి దిగితే.. వెనుకాముందు ఆడకుండా గెలుపు వారి సొంతమయ్యేది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓటమిపాలవుతున్నారు. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడుకు కాబోయే సీఎం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates