Political News

కేసీఆర్ కి షాక్.. ఈటల వెంట మరో నేత..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పై భూ కబ్జా ఆరోపణలు చేయడంతో.. టీఆర్ఎస్ నుంచి తప్పుకొని.. బీజేపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉన్నారు. ఒకవైపు ఆ ప్రయత్నాల్లో ఉంటూనే… మరోవైపు టీఆర్ఎస్ లోని కీలక నేతలను కూడా పార్టీకి దూరం చేసేపనిలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా …

Read More »

ఏపీలో లిక్కర్ బ్రాండ్ల పేర్లు…జగన్ పాలనపై సెటైర్లు?

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు….ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చేవరకు నిద్రపోమంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటామని, కేంద్రం మెడలు వంచైనా హోదా తీసుకువస్తామని ఏపీ సీఎం జగన్ కూడా ఎన్నికలకు ముందు గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ…ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైతేనేం…మాట తప్పని మడమ …

Read More »

ఆనందయ్య మందుపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎవరికీ పెద్దగా పరిచయం లేని నెల్లూరులోని ఒక కుగ్రామం కృష్ణపట్నం ఇపుడు దేశమంతటా తెలిసిపోయింది. ఆ గ్రామానికి చెందిన ఆనందయ్య ప్రకృతి మూలికలతో చేసిన మందు వాడితే కరోనా ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతుందని ప్రచారం జరగడంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన విపరీతంగా పాపులర్ అయ్యారు. అది పల్లెటూరిలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితికి దారితీసింది. ఆయనేమీ అనుమతి పొందిన ఆయుర్వేద వైద్యుడు కాకపోవడంతో తర్వాత …

Read More »

ఈటలకు గ్యారెంటీ కావాలట

రెండు+రెండు= 4 అని లెక్కల్లో కరెక్టే. కానీ రాజకీయాల్లో ప్రతిసారి 2+2=4 అవుతుందని చెప్పేందుకు లేదు. కొన్నిసార్లు జీరో కూడా కావచ్చు. రాజకీయాలే అంత ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో, ఎవరిని ఎందుకు అదఃపాతాళంలోకి తొక్కేస్తుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడింతా దేనికంటే తెలంగాణా రాజకీయాల్లో ఈ రోజుకి హాట్ టాపిక్ ఎవరయ్యా అంటే మాజీమంత్రి ఈటల రాజేందర్ అనే చెప్పాలి. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో …

Read More »

ఈటల బీజేపీలో చేరిక ఆలస్యానికి కారణం ఇదేనా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమని ఇప్పటికే అందరికీ అర్థమయ్యింది. వరసగా ఈటల ఢిల్లీలోని బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. ఈపాటికి ఆయన ఢిల్లీలోనే కషాయ కండువా కప్పుకున్నట్లు వార్తలు రావాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో ఈటల కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరడం ఖాయం. అయితే.. ఎప్పుడు చేరాలనే విషయమై మరి కొద్ది రోజులు ఆలోచించి …

Read More »

అమ్మిరెడ్డిని ఎందుకు బదిలీచేశారబ్బా ?

గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చేసిన ఫిర్యాదులో ఎస్పీ పేరు కూడా ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించాలనే కుట్రలో రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఎంపి ముగ్గురిపై …

Read More »

జగన్.. మోడీ ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్తాడా?

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పట్టుదలగా ఉన్నాడో తెలిసిందే. మెజారిటీ తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహించి తీరాలనే ఆలోచనతో జగన్ ఉన్నాడు. నిజానికి ఇప్పటికే పరీక్షలు మొదలు కావాల్సింది. కానీ కరోనా ఉద్ధృతి దృష్ట్యా పరీక్షలను నెల రోజులు వాయిదా వేశారు. ఐతే నెల రోజుల తర్వాత కూడా కరోనా ముప్పు తొలగిపోతుందన్న గ్యారెంటీ లేదు. పైగా అప్పుడు …

Read More »

బీజేపీకి బెంగాల్లో షాక్ తప్పదా ?

వరస వివాదాలతో నరేంద్రమోడి-మమతాబెనర్జీ మధ్య గొడవలు పెరిగిపోతున్న సమయంలోనే బీజేపీకి పెద్ద షాక్ తప్పదని అనిపిస్తోంది. అదేమిటంటే కమలంపార్టీ తరపున గెలిచిన 8 ఎంఎల్ఏలతో పాటు నలుగురు ఎంపిలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ మీడియాకు చెప్పారు. అయితే వీరి చేరికపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఘోష్ చెప్పారు. ఒక విధంగా …

Read More »

నాయకులారా.. ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోరు?

కోవిడ్ తీవ్రత ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కేసులు, మరణాల విషయంలో సరైన గణాంకాలు కూడా బయటికి రావట్లేదు. వాస్తవ కేసులు, మరణాల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వాలు బయటికి 30 శాతం తక్కువ చెబుతున్నట్లుగా వార్తలొస్తుండటం గమనార్హం. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోగా.. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పెద్ద మనసున్న దాతల కోసం బాధితులు …

Read More »

సామాజిక వ‌ర్గ‌మే అడ్డంకి: వీరి ప‌రిస్థితి ఇంతేనా ?

రాజ‌కీయాల్లో కులాల‌కు, రిజ‌ర్వేష‌న్ల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! సామాజిక వ‌ర్గాల ఆధారంగా ఓటు బ్యాంకును నిర్మించుకున్న నాయ‌కులు, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న‌.. రాజ‌కీయాల్లో రాణించిన నేత‌లు అనేక మంది ఉన్నారు. అయితే.. ఒక‌ప్పుడు.. ఈ సామాజిక వ‌ర్గాలు.. రిజ‌ర్వేష‌న్లు.. చ‌క్రాలు తిప్పితే.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి కొంద‌రి విష‌యంలో యూట‌ర్న్ తీసుకుంది. అధికార పార్టీ నేత‌ల‌కు ఈ ప‌రిణామం ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. …

Read More »

కాంగ్రెస్ కోసం వెయిటింగ్‌.. మాజీ మంత్రి ఏం చేస్తున్నారంటే..!

ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టుకునే నాయ‌కులు నేటి రాజ‌కీయాల్లో పెరిగిపోయారు. ఎప్పుడు ఎటు అవ‌కాశం వ‌స్తే.. అటు వెళ్లిపోవ‌డం.. ఎక్క‌డ పద‌వి వ‌రిస్తుంద‌ని తెలిస్తే.. ఆ స‌ర్కారుకు జై కొట్ట‌డం.. పార్టీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వంటివాటిని సైతం ప‌క్క‌న పెట్ట‌డం వంటివి నేటి రాజ‌కీయాల్లో కామ‌న్‌గా మారిపోయాయి. అయితే.. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. డాక్ట‌ర్ డీఎల్ ర‌వీంద్రారెడ్డి మాత్రం ఆత్మాభిమానం …

Read More »

డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిన మోడీ

క‌రోనా క‌ల్లోలం గ‌త కొద్దికాలంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌ల జ‌ల్లు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారిని డీల్ చేయ‌డం, ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోయింద‌నే విశ్లేష‌ణ‌లు కూడా తెగ వ‌చ్చేస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో ఎల్‌పీజీ సిలిండర్ ధ‌ర రూ.122 తగ్గింది. …

Read More »