తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడాది కిందట్నుంచి తీవ్ర విమర్శలు చేస్తూ మీడియాలో బాగా హైలైట్ అవుతూ వచ్చారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. రెబల్‌గా మారినప్పటికీ.. ఆయన ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయనపై క్రమశిక్షణ చర్యల్లాంటివేమీ చేపట్టలేదు. అనర్హత వేటూ పడలేదు. ఇప్పటికీ ఆయన వైకాపా నాయకుడే. సాంకేతికంగా వైకాపా ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు కోసం ఇప్పుడు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు …
Read More »పవన్ కళ్యాణ్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెక్ట్స్ స్టెప్ ఏంటి? పొలిటికల్‌గా ఆయన ఎలాంటి టర్న్ తీసుకుంటారు ? బీజేపీతోనే కొనసాగుతారా ? లేక .. కమలంతో కటీఫ్ చెబుతారా ? అనేది ఆసక్తిగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్న పవన్‌కు ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలతో పవన్‌కు విభేదాలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాను సహకరించినా.. తనను తన పార్టీ నేతలను బీజేపీ …
Read More »మోడీతో జగన్ పోటీ పడుతున్నారా.. నెటిజన్ల కామెంట్లు…!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో.. ఏపీ సీఎం జగన్.. పోటీ పడుతున్నారా ? కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడీ.. పెద్దగా నిధులు కేటాయించడం లేదు. నిజానికి బడ్జెట్ కేటాయింపుల్లో.. రు. 35 వేల కోట్లు కరోనా వ్యాక్సిన్‌కు మోడీ సర్కారు కేటాయించింది. కానీ, ఇప్పటి వరకు దీనిలో నుంచి రు. 4500 కోట్లు మాత్రమే ఆయన కేటాయించారు. అది కూడా రెండు …
Read More »మమత గెలుపుకు కారణం ఏమిటో తెలుసా ?
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ, కేరళలో పినరయి విజయన్ గెలుపుకు ముఖ్య కారణం ఏమిటో తెలుసా ? ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎస్బీఐలోని ఆర్ధికవేత్తలు పెద్ద సర్వే నిర్వహించారు. వీళ్ళ సర్వే ప్రకారం ఎన్నికల ఏడాదిలో పబ్లిసిటిపై భారీ ఎత్తున ఖర్చులు పెట్టడమే వీళ్ళ గెలుపుకు ప్రధాన కారణమని తేలిందట. మమత మూడోసారి, విజయన్ రెండోసారి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. పోలింగ్ లో …
Read More »విభజన చట్టానికే కేసీయార్ తూట్లు
ఏ విభజన చట్టం ద్వారా అయితే సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణా ఏర్పడిందో అదే చట్టాన్ని కేసీయార్ తుంగలో తొక్కేశారు. రాష్ట్ర విభజన చట్టప్రకారం ఏపి-తెలంగాణాకు హైదరాబాద్ 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని. ఇప్పటికి ఏడేళ్ళు గడిస్తే ఇంకా మూడేళ్ళు బ్యాలెన్స్ ఉంది. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా హైదరాబాద్ కు రావద్దని చెప్పే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రంలోను …
Read More »భారీ టార్గెట్ పెట్టకున్న స్పుత్నిక్
అధికారికంగా శుక్రవారం మార్కెట్లోకి వచ్చిన రష్యా తయారీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారీ టార్గెట్ నే పెట్టుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెడ్డీ ల్యాబరేటరీతో ఒప్పందం చేసుకున్న రష్యన్ ఫార్మాకంపెనీ స్పుత్నిక్ వి రెడ్డి ల్యాబరేటరీ ఉన్నతాధికారి మొదటిడోసు ఇంజక్షన్ తీసుకున్నారు. రష్యా నుండి టీకాలు మొదటి బ్యాచ్ కింద 1.5 లక్షల డోసులు వచ్చాయి. ప్రస్తుతం యావత్ దేశం టీకాల కొరతతో ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పుత్నిక్ వీ టీకా …
Read More »ఒక వైసీపీ మూడు గ్రూపులు.. ఎన్ని చిక్కులో ?
ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో గ్రూపుల గలాటా రోజు రోజుకు పెరిగిపోతోంది. పలు జిల్లాల్లో మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గ్రూపులు రాజ్యం ఏలుతుండడంతో సదరు ఎమ్మెల్యేలు గ్రూపుల గోలలో చిక్కుకుపోతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ్రూపుల గోలతో సతమతమవుతున్నారు. దీంతో ఆయన పరిస్థితి …
Read More »బద్వేల్ లో.. టీడీపీ పవర్ ఎంత ?
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కీలక నియోజకవర్గం బద్వేల్. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ నియోజకవర్గంలో వరుసగా వైసీపీ విజయం సాధిస్తోంది. 2014లో తిరువీధి జయరాములు, 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్యలు విజయం దక్కించుకున్నారు. 2009లోనూ ఇక్కడ కాంగ్రెస్ నుంచి కమలమ్మ గెలిచారు. అయితే.. ఇటీవల ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో మరో నాలుగు మాసాల్లో ఇక్కడ …
Read More »సోనూ సూద్.. కంటగింపుగా మారాడా?
కొవిడ్ నియంత్రణలో, వైరస్ బాధితులకు అత్యవసర సేవలు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేస్తున్న పరిస్థితుల్లో సోనూ సూద్ అనే నటుడు ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకుని బాధితులకు అత్యవసర మందులతో పాటు ఆసుపత్రుల్లో బెడ్లు అందిస్తుండటం.. కోట్ల రూపాయల సాయాన్ని ఉచితంగా అందజేస్తుండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా విమర్శలు, ఒత్తిడి ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అంతర్జాతీయ …
Read More »ఇదే పని మూడు వారాల క్రితం చేసి ఉంటే అదిరిపోయేది బాబు
సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కష్టం వచ్చిన ప్రతిసారీ.. ప్రజల్ని త్యాగం చేయమని చెప్పే ఆయన.. తన తీరుకు భిన్నంగా తొలిసారి ఆయన వినూత్నంగా రియాక్టు అయ్యారు. కరోనా కష్ట కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వినూత్న పద్దతిలో విరాళాన్ని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలోని వారితో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన.. నియోకవర్గంలో యుద్ద ప్రాతిపదికన వైద్య సదుపాయాల్ని …
Read More »షర్మిల సంచలనం.. 040-48213268 నెంబరుకు ఫోన్ చేస్తే చాలట
తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలన్న ఆశను.. ఆకాంక్షను ఇప్పటికే వ్యక్తం చేసిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల.. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే తండ్రీకొడుకులు అంటూ కేసీఆర్.. కేటీఆర్ లపై ఘాటు విమర్శలు చేస్తున్న ఆమె.. నిన్నటికి నిన్న కేసీఆర్ పాలన తీరుపైనా.. కొవిడ్ వేళ నెలకొన్న కొరతపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు. కొవిడ్ కారణంగా …
Read More »మోడిపై బెంగాల్ దెబ్బ బాగా పడినట్లుందే ?
ప్రధానమంత్రి నరేంద్రమోడిపై ఎన్నికల దెబ్బ బాగా పడినట్లు అనుమానంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తగిలిన దెబ్బ మరీ ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా అధికారంలోకి వచ్చేయటమే మిగిలింది అన్నట్లుగా మోడి, అమిత్ షా బిల్డప్ ఇచ్చారు. ఎలాగైనా మమతాబెనర్జీని ఓడించి బీజేపీ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో బెంగాల్ ఎన్నికల్లో వీళ్ళద్దరి ఏ స్ధాయిలో పోరాడారో దేశమంతా చూసింది. అయితే వీళ్ళెంత పోరాడినా ఉపయోగం లేకపోయింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates