తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు పెద్ద సంకటమే వచ్చి పడిందని అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ ఉపపోరు.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధాన్ని తలపిస్తుండగా.. అదేసమయంలో సానుభూతి-సంక్షేమ పథకాలతో.. ప్రజలు ఎటు మొగ్గు చూపాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. వరుస విజయాలతో దూసుకుపోతూ.. ఇక్కడి ప్రజలకు తలలోనాలుకగా వ్యవహరిస్తున్న …
Read More »వైసీపీలోకి వచ్చి.. నష్టపోయాం.. తల్లీ కూతుళ్ల ఆవేదన!
వైసీపీ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీలోకి చేరిన వారిలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన పి. శమంతక మణి, ఆమె కుమార్తె యామినీ బాల తొలివరుసలో నిలిచారు. ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున గట్టి వాయిస్ వినిపించిన ఈ కుటుంబం.. అనేక పదులు కూడా పొందారు. టీడీపీ అంటే.. శమంతకమణి.. అన్న తరహాలో రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే 2014లో యామినీ బాల …
Read More »బద్వేల్ను టీడీపీ ఏం చేస్తుంది…?
తిరుపతి పార్లమెంటు స్థానానికి.. అదిగో ఉప ఎన్నిక అనగానే.. ఇదిగో అభ్యర్థి.. అంటూ.. నానా హడావుడి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. కీలకమైన స్థానంపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. పైగా ఇది పార్టీకి.. వ్యక్తిగతంగా తనకు కూడా ప్రతిష్టాత్మకమే అయినప్పటికీ.. ఆయన పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అదే.. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ నాయకుడు …
Read More »మంత్రి విస్తరణలో జగన్ వ్యూహం ఇదేనా?
ఏపీ సీఎం జగన్ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆదిలోనే అంటే.. కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్న సమయంలోనే 90 శాతం మంది మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత.. మారుస్తానని.. అందరికీ అవకాశం ఇవ్వలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. సో.. దీనిని బట్టి రెండున్నరేళ్ల తర్వాత..కేబినెట్ విస్తరణకు జగన్ మొగ్గు చూపకతప్పదు. దీంతో చాలా మంది నాయకులు.. మలివిడత మంత్రి వర్గ విస్తరణపై చాలానే …
Read More »కన్ఫామ్.. బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!
ఐపీఎస్ మాజీ అధికారి, స్వేరో చీఫఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన బీఎస్పీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన బీఎస్పీలో చేరనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించినట్లు.. జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం. ఆగస్టు 8న ప్రవీన్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారట. ఆ సయమంలోనే ప్రవీణ్ తో పాటు దాదాపు …
Read More »మోడి ఎందుకు నోరు తెరవటం లేదు ?
ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతిపక్ష నేతలు, వివిధ సెక్టార్లలోని ప్రముఖులపై పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ తో మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంటులో నానా రచ్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంరోజున అంటే 19వ తేదీనే పెగాసస్ వ్యవహారం మీడియాలో వచ్చింది. అప్పటికే మోడి సర్కార్ పై అనేకరకాలుగా మండిపోతున్న ప్రతిపక్షాలకు పెగాససన్ వ్యవహారం చక్కటి ఆయుధంగా దొరికింది. …
Read More »బండి సంజయ్కు ఈటల ఎపిసోడ్ భారంగా మారిపోయిందా?
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో పీక్స్కు చేరాయి. తాజాగా మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతో ఇంకా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అయితే, ఈటల రాజీనామా, తదనంతర పరిణామాలు ఇందులో హైలెట్. ఈ పరిణామాల్లో బీజేపీలో సమీకరణాలు మారుతున్నాయంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఎపిసోడ్లో తాజాగా …
Read More »సీఎం పదవి పోయే.. గవర్నర్ పదవి వచ్చే..?
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయన సీఎం పదవి చేపట్టిన రెండేళ్లకే.. ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే.. రాజీనామా చేసే సమయంలో ఆయన బాగా ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే.. సీఎం పదవి నుంచి తప్పించినా.. ఆయనకు మరో కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి సేవ చేసిన …
Read More »వైసీపీ ఆయువు పట్టు .. సంక్షేమమా..? సానుభూతా..?
రాష్ట్రంలో మూడు మాసాల కిందట మార్చి లో జరిగిన స్థానిక ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు ఫలితం వెలువడిన ఏలూరు కార్పొరేషన్లో కానీ.. అధికార పార్టీ వైసీపీ ఘన విజయం దక్కించుకుంది. నిజానికి అన్ని కార్పొరేషన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ పరిస్థితిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ జరగలేదు. అప్పట్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా.. తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న టీడీపీ బలీయంగా ఉన్నప్పటికీ.. …
Read More »మోడికి దీదీ షాక్
ప్రధానమంత్రి నరేంద్రమోడి చేయాల్సిన పనిని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేసి పెద్ద షాకే ఇచ్చారు. పార్లమెంటును గడచిన వారంరోజులుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ ఆరోపణలు ఊపేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల నేతలు, జడ్జీలు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి సుమారు లక్షమంది ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందని ది వైర్ అనే మీడియా బయటపెట్టింది. దీనిపై మోడి సమాధానం చెప్పాలని …
Read More »కర్నాటకలో బీజేపీకి ఏమన్నా శాపముందా ?
ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. మామూలుగా ఏ రాష్ట్రంలో సీనియర్ నేత ముఖ్యమంత్రయితే ఐదేళ్ళ పూర్తికాలం సీఎంగా ఉంటారు. మధ్యలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చి కోర్టుల్లో నిరూపణైతే మాత్రం మధ్యలోన పక్కకు తప్పుకుంటారు. అయితే కర్నాటకలో మాత్రం బీజేపీకి ఏదో శాపం ఉన్నట్లే అనిపిస్తోంది. అందుకనే అధికారంలోకి వస్తున్నా ఎవరు కూడా పూర్తి కాలం అధికారంలో ఉండలేకపోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ దశాబ్దాలుగా శతవిధాల ప్రయత్నాలు …
Read More »జగన్ మేల్కొనకపోతే కష్టమేనా ?
కొన్ని సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాల్సుంటుంది. అలా కాకుండా వీలున్నంత కాలం సాగదీద్దామని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇపుడిదంతా ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు, మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు రెడీ అవుతున్నారు. పెన్షన్ విధానంలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమల్లోకి తేవాలనే డిమాండ్ తో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె యోచన చేస్తున్నారు. ఇదే సమయంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates