Political News

రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ?

వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ? అవుననే అంటున్నాయి యూపిలోని ప్రతిపక్షాలు. దాదాపు ఏడాది క్రిందట నరేంద్రమోడి సర్కార్ ఆమోదించిన మూడూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని యూనియన్ నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎట్టి …

Read More »

ఒక స్టేట్ కు సీఎం.. భారత్ లో శరణార్దిగా తలదాచుకుంటున్నారు

కాలానికి మించిన కఠినమైన వాస్తవం మరొకటి ఉండదు. రాజును పేదలా.. అంతకుమించిన దారుణపరిస్థితుల్లోకి తీసుకెళ్లి శక్తి సామర్థ్యాలు ఒక్క కాలానికి మాత్రమే చెల్లు. తాజా ఉదంతం గురించి చదవితే ఈ మాట ఎంత నిజమన్నది ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కీలక నేత.. కాలం పుణ్యమా అని బతుకు జీవుడా అని భారత్ కు శరణార్ధిగా వచ్చి.. మారుమూల ప్రాంతంలో తలదాచుకుంటున్న సిత్రమైన పరిస్థితి తాజాగా వెలుగు చూసింది. …

Read More »

నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ప‌వ‌న్‌… ఈ సారి ఒక్క‌చోటే ?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ అధ్య‌క్షుడి హోదాలో గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేశారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన ప‌వ‌న్ రాజ‌కీయంగా అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం బీజేపీతో జ‌ట్టుక‌ట్టిన ప‌వ‌న్ ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అవ్వ‌డంతో పాటు రాజ‌కీయంగా ఏమంత యాక్టివ్‌గా లేరు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో మూడేళ్ల టైం ఉంది. అధికార వైసీపీ అయితే …

Read More »

కేసీఆర్ కి మరో షాక్.. కషాయం గూటికి టీఆర్ఎస్ ఎంపీ?

ఈటల ఎపిసోడ్ తర్వత టీఆర్ఎస్ కి వరస షాక్ లు ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు రెడీగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత అశ్వ‌ద్ధామ‌రెడ్డిలు బీజేపీ గూటికి చేర‌గా, ఇప్పుడు టీఆర్ఎస్ లోక్ స‌భ ఎంపీ కూడా చేరిక‌కు రంగం సిద్ధ‌మ‌యిన‌ట్లు …

Read More »

ప‌వ‌న్‌కు ఇత‌ను ప్ల‌స్సా మైన‌స్సా

కళ్యాణ్ దిలీప్ సుంకర.. సోషల్ మీడియాలో ఉండే తెలుగు నెటిజన్లకు ఈ పేరు బాగానే పరిచయం. ఒకప్పుడు జనసేన అధికార ప్రతినిధిగా ఉండి.. అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఇతను.. ఇప్పుడు ఓవైపు లా ప్రాక్టీస్ చేస్తూనే ఇంకో వైపు యూట్యూబ్‌లో వివిధ అంశాల మీద వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యే ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ‌ను కౌంటర్ చేస్తూ ‘ఓపెన్ ఎటాక్ …

Read More »

ఆ రాజు గారికి జ‌గ‌న్ కేబినెట్ బ‌ర్త్ ఫిక్స్ చేసిన‌ట్టేనా…!

ఏపీలో మ‌రో మూడు నెలల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న కేబినెట్‌ను విస్త‌రించ‌నున్నారు. ఈ మార్పులు, చేర్పుల్లో చాలా మంది సీనియ‌ర్ ఎమ్మెల్యేలు త‌మ‌కు బెర్త్ ద‌క్కుతుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదు సార్లు గెలిచిన వారు కూడా ఉన్నారు. అయితే జ‌గ‌న్ తొలి మంత్రి వ‌ర్గంలో ప్రాంతీయ, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో 90 శాతం మంది జూనియ‌ర్ల‌కే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే ఈ సారి మాత్రం త‌మ‌కు …

Read More »

నోట్ దిస్ పాయింట్‌.. జ‌గ‌న్‌పై ఒకే వారంలో ఇన్ని మెరుపులా..?

ఇంట గెలిచి.. ర‌చ్చ‌గెలవాల‌నేది సామెత‌. అచ్చం ఈ సామెత‌ను నిజం చేస్తున్నా ఏపీ సీఎం జ‌గ‌న్‌. ఆయ‌న రాష్ట్రంలో ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమం అందించేందుకు చేస్తున్న కృషి అంద‌రికీ తెలిసిందే. అన్ని సామాజిక‌ వర్గాల‌కు ఎన్నిక‌ల స‌మయంలో ఇచ్చిన హామీల మేర‌కు జ‌గ‌న్ న్యాయం చేస్తున్నారు. ఆర్థిక ప‌రిస్థితి బాగున్నా.. లేకున్నా.. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుని.. పేద‌ల‌కు అన్ని రూపాల్లోనూ సాయం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

ఈటలకు తృటిలో తప్పిన ప్రమాదం..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి తృటిలో ప్రమాదం తప్పింది. బీజేపీలో చేరేందుకు ఈటల తన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే.. ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పి పోయింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి …

Read More »

బీజేపీకే అంటుకున్న మంటలు

పచ్చని, ప్రశాంత దీవులలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చిచ్చుపెట్టింది. కేరళకు ఆనుకునుండే లక్షద్వీప్ లో నిబంధనల పేరుతో బీజేపీ మంటలు పెట్టాలని చూసింది. కానీ చివరకు ఆ మంటలు పార్టీకే అంటుకున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే లక్షద్వీప్ లో జనాభా సుమారు 85 వేలు. ఇందులో 95 శాతం ముస్లిం మైనారిటీలే ఉంటారు. ఇలాంటి ద్వీపంలో స్ధానికులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలను అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కుమార్ తెచ్చారు. దాంతో ఇపుడు …

Read More »

కేశినేనికి పోటీగా ఆ క‌మ్మ నేత రెడీయేనా ?

ఏపీలో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే ఫోక‌స్ పెట్టేశారు. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ చెంత చేరిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయిన మూడు లోక్‌స‌భ సీట్ల‌పై కూడా జ‌గ‌న్ దృష్టి పెడుతున్నారు. కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం ఎంపీ సీటులో టీడీపీ కీల‌క‌నేత రామ్మోహ‌న్ నాయుడును ఓడించేందుకు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్‌తో పాటు ఉప ముఖ్య‌మంత్రి …

Read More »

మొత్తానికి సాధించిన జ‌గ‌న్.. గ‌వ‌ర్న‌ర్ గ్రీన్ సిగ్న‌ల్

తీవ్ర ఉత్కంఠ‌కు దారితీసిన న‌లుగురు నేత‌ల ఎమ్మెల్సీ పోస్టుల విష‌యంలో ఎట్ట‌కేల‌కు .. గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆ న‌లుగురు నేత‌ల్లో ఇద్ద‌రి విష‌యం డోలాయ‌మానంలో ప‌డేస‌రికి సీఎం జ‌గ‌న్ హుటాహుటిన గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్‌ను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చేందుకు గ‌వ‌ర్న‌ర్ ఓకే చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో భ‌ర్తీ కావాల్సిన నాలుగు ఎమ్మెల్సీ పోస్టుల‌కు వైసీపీ స‌ర్కారు.. …

Read More »

అశోక్ గ‌జ‌ప‌తిరాజుకే ప‌ట్టం.. జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టులో మ‌రో గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది. విజ‌య‌న‌గ‌రం గ‌జ‌ప‌తి వంశీయుల‌కు చెందిన మాన్సాస్ ట్ర‌స్టు, సింహాచ‌లం ఆల‌య ట్ర‌స్టుల చైర్మ‌న్‌గా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజును రాత్రికిరాత్రి మారుస్తూ.. సీఎం జ‌గ‌న్ జీవో 72ను తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు సోద‌రుడు దివంగ‌త ఆనందగ‌జ‌ప‌తి రాజు కుమార్తె సంచ‌యిత ను నియ‌మించారు. అప్ప‌ట్లో తీవ్ర వివాదాల‌కు దారితీసిన …

Read More »