దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఆ అధికారం నేరుగా ప్రజలు ఇవ్వటం వల్ల వచ్చిందికాదు. కొన్ని రాష్ట్రాల్లో మెజారిటి లేకపోయినా అధికారంలోకి వచ్చేసింది. ఫలితాల సమయంలోనే ముందుగా మేల్కొనటం ద్వారా ప్రత్యర్ధిపార్టీలకు చెందిన ఎంఎల్ఏలను లోబరుచుకోవటం తదితర మార్గాల్లో అధికారంలోకి వచ్చేసింది. అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియాకు గాలమేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది. దాంతో ప్రభుత్వం పడిపోగానే తాను అధికారంలోకి …
Read More »మోడి మెడలు వంచుతున్న చిన్న పార్టీలు
ఇప్పటి రాజకీయాలంతా అవసరాలు, అవకాశాలుగా మారిపోయింది. అవసరమున్నపుడు దగ్గరకు తీసుకోవటం, అవసరం తీరిపోగానే దూరంగా నెట్టేయటం అందరు చూస్తున్నదే. అదే సందర్భంగా ఎదుటివాళ్ళ అవసరాలనే తమకు అవకాశంగా మలచుకుని తమ డిమాండ్లను సాధించుకుంటున్న విషయాలు కూడా చూస్తున్నదే. ఇప్పుడిదంతా ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పరిస్ధితికి సరిగ్గా సరిపోతుందని చెప్పేందుకే. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత యోగి ప్రభుత్వంపై జనాల్లో మంట పెరిగిపోతోంది. ఈమధ్యనే జరిగిన లోకల్ …
Read More »టీడీపీ ఎంతో ఇచ్చింది.. కానీ.. వదిలేస్తున్నా..
తెలంగాణ టీడీపీకి భారీషాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. సీనియర్ నాయకుడు ఎల్.రమణ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే తాను పార్టీని వీడనున్నట్టు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన అధికార పార్టీ టీఆర్ ఎస్ కండువా కప్పుకోనున్నట్టు కూడా వెల్లడించారు. వాస్తవానికి గడిచిన నెల రోజులకు పైగా ఎల్ .రమణ రాజకీయ మార్పుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన పార్టీ మార డం ఖాయమని.. …
Read More »పదవులపై జగన్ కీలక నిర్ణయం
అధికారంలోకి వచ్చి రెండేళ్ళయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పదవుల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని సుమారు 80 కార్పొరేషన్లలో ఛైర్మన్లుగా నియమించాలని డిసైడ్ అయ్యారు. ఛైర్మన్లకు తోడు పై కార్పొరేషన్లలో సగటున 12 మంది డైరెక్టర్లు అంటే మరో 960 మందిని నియమించబోతున్నారు. ఛైర్మన్లు, డైరెక్టర్లుగా తమను నియమిస్తారని చాలామంది సీనియర్ నేతలు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అప్పుడొకటి …
Read More »ఎంఎల్సీ జాబితాపై వివాదం ?
జగన్మోహన్ రెడ్డి పంపించిన నాలుగుపేర్ల ఎంఎల్సీ జాబితాపై గవర్నర్ అభ్యంతరాలు చెప్పారా ? అవుననే అంటోంది ఓ సెక్షన్ మీడియా. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన నాలుగు పోస్టులకు ప్రభుత్వం ఈమధ్యనే నాలుగు పేర్లను సిఫారసు చేసింది. రమేష్ యాదవ్, లేళ్ళ అప్పరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు పేర్లున్న ఫైల్ ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరుంది. అయితే సదరు మీడియా ప్రచారం ప్రకారం లేళ్ళ అప్పిరెడ్డి, తోట …
Read More »పేరు తెచ్చే పథకాలు.. పీడిస్తున్నాయా ?
ఏపీ సీఎం జగన్.. లక్ష్యం అందరికి తెలిసిందే. వచ్చే 30 ఏళ్లపాటు తానే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఏ ప్రభుత్వమూ.. చేయని విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అదేసమయంలో పింఛన్లను పెంచడంతోపాటు.. పేదలకు ఇళ్లు కూడా ఇస్తున్నారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న మాట వాస్తవం. …
Read More »వైసీపీ నేతలూ.. జాగ్రత్త.. జగన్ అన్నీ గమనిస్తున్నారు..!
రాజకీయాల్లో నేతలందరూ ఒకే విధంగా ఉండరు. ఎవరి దూకుడు వారిది. ఎవరి వ్యూహాలు వారివి. నియోజక వర్గాల్లో పైచేయిసాధించాలని ప్రతి ఒక్క నేతా ప్రయత్నిస్తారు. అదేవిధంగా ప్రజల్లో ఇమేజ్ కోసం ఏదో ఒక సంచలనాలకు ప్రయత్నిస్తుంటారు. ఇది అధికారంలో ఉన్న ఏ పార్టీలో అయినా సర్వసాధారణమే. అయితే.. వైసీపీ విషయానికి వస్తే.. ఈ దూకుడు, సంచలనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ప్రజలకు చేరువ అయ్యేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను …
Read More »గవర్నర్‌కు టీడీపీ రహస్య లేఖ.. రంగంలోకి జగన్.. ?
ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పార్టీ వైసీపీ తరఫున శాసన మండలిలో అడుగు పెడతారని అనుకున్న నలుగురు నేతల్లో ఇద్దరికి గవర్నర్ విశ్వభూషణ్ నుంచి తిరస్కారం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అసలు ఏం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. నామినేటెడ్ కోటాలో గవర్నర్ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 4పేర్లు.. లేళ్ల …
Read More »ఎటాక్ సోనూ సూద్
కరోనా మహమ్మారి దేశాన్ని పీడించడం మొదలయ్యాక ఏడాది కిందట్నుంచి అసాధారణ రీతిలో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ జనాల్లో తిరుగులేని ప్రేమాభిమానాలు సంపాదించుకున్నాడు సోనూ సూద్. అతడి నుంచి సాయం పొందిన వాళ్లలో తెలుగువాళ్లు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఏపీ, తెలంగాణలను తన సెకండ్ హోమ్ అంటూ ఇక్కడి వారిపై ప్రత్యేక ప్రేమనే చూపిస్తున్నాడు సోనూ. ఎంతోమంది సోనూ నుంచి తాము పొందిన సాయం గురించి సోషల్ మీడియాలో పోస్టులు …
Read More »షారుఖ్‌తో పీకే భేటీ..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్(పీకే) భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. ఆ వెంటనే నెటిజన్లు కూడా స్పందించారు. షారుఖ్ ఖాన్.. రాజకీయాల్లోకి వస్తున్నారని.. అందుకే పీకేతో భేటీ అయ్యారని కొందరు వ్యాఖ్యానించారు. అయితే..ఈ విషయంపై ఇటు పీకే కానీ, అటు షారుఖ్ కానీ స్పందించలేదు. ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న అనంతరం ప్రశాంత్ …
Read More »కమలం పార్టీకి హుషారు వచ్చినట్లే
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈటెల విషయం ఇలాగుంచితే ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ విషయంలోనే బీజేపీ లాటరీ కొట్టినట్లే అనే ప్రచారం జరుగుతోంది. అందుబాటులో ఉన్న సమచారం …
Read More »జగన్‌కు ఆర్ ఆర్ ఆర్ 48 గంటల గడువు..
ఏపీ సీఎం జగన్‌కు వరుస లేఖలు రాస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ సంధించారు. ఈ లేఖలో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జగన్‌కు, పార్టీ నేతలకు ఆయన 48 గంటల గడువు విధించారు. ఈ లోగా చర్యలు తీసుకోకపోతే.. తానే సంచలన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో ఇప్పడు ఆర్ ఆర్ ఆర్ రాసిన లేఖ సీఎం జగన్‌కు మరింత షాకిస్తోంది. కొన్నాళ్లుగా జరుగుతున్న …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates