Political News

బాబు ప్ర‌యాస‌.. త‌మ్ముళ్ల కులాసా..

ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. వ‌య‌సు మీద‌ప‌డుతున్నా.. న‌వ‌ యువ‌కుడిగా.. క‌ష్ట‌ప‌డుతున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. క‌రోనా స‌మ‌యంలోనూ ఆయ‌న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక ప్ర‌చారానికి వ‌చ్చారు. వారం పాటు అక్క‌డే మ‌కాం వేసి ప్ర‌చారం చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత.. మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ‌, విశాఖ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో ప్ర‌చారం చేశారు. ఇక‌, ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డు తున్నారు. …

Read More »

మోడి అడ్వాంటేజ్ తీసుకుంటారా ?

ఇపుడిదే అంశంపై బీజేపీలోను నాన్ ఎన్డీయే పార్టీలో చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ గెలవటానికి బీజేపీకి ఓ అవకాశం వచ్చిందనే అనుకుంటున్నారు. అదేమిటంటే బీజేపీకి బలమైన పోటీదారులైన ఎస్పీ, బీస్పీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి కాబట్టే. నరేంద్రమోడి పాలనపై యావత్ దేశంలోను తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇందులో భాగంగానే యూపిలో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈమధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. …

Read More »

సీనియ‌ర్లు లేని కాంగ్రెస్ సామ్రాజ్యం..!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏడేళ్ల కింద‌ట ప‌ట్టిన గ్ర‌హణం ఇప్ప‌టి వ‌ర‌కు విడ‌వ‌లేదు. ఈ పార్టీలో ఒక‌ప్పుడు సీనియ‌ర్లుగా చ‌క్రం తిప్పిన వారు.. చాలా మంది పార్టీ మారిపోయారు. ఇక‌, కొంద‌రు ఏకంగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. మిగిలిన వారిలోనూ సీనియ‌ర్లు.. చాలా మంది త‌ట‌స్థంగా ఉంటున్నారే త‌ప్ప పార్టీ వాయిస్ వినిపించ‌డం లేదు. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఏ పార్టీకైనా ఒడిదుడుకులు త‌ప్ప‌వు. …

Read More »

ప్రియాంక ఇంత యాక్టివ్ అయ్యారా ?

అవును ఇది కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపే విషయమే. అవును ఇంతకాలం పార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే ప్రియాంక గాంధీ పార్టిసిపేట్ చేస్తుంటారు. పేరుకు జాతీయ ప్రధాన కార్యదర్శే కానీ అంత చొరవ చూపించటం లేదని చాలామంది తెగ బాధపడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి అస్సాం ఎన్నికల్లో పూర్తిస్ధాయిలో ప్రచారానికి దిగటంతో ఇకనుండి పార్టీ కార్యక్రమాల్లో కూడా ప్రియాంక ఫుల్లుగా ఇన్వాల్వయి పోతారని అందరు ఆశించారు. అయితే …

Read More »

కత్తి మహేష్ కి జగన్ సర్కార్ భారీ సాయం..!

ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… చెన్నై అపోలో అసుపత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. కాగా కత్తి మహేష్ వైద్య ఖర్చులకు ఏపి ప్రభుత్వం రూ.17లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ నుండి ఆసుపత్రి యాజమాన్యంకు సీఎంఆర్ఎఫ్ నుండి ఎల్ఓసీ జారీ చేసింది. ఆరు …

Read More »

అంతరిక్షంలోకి తెలుగు మహిళ..!

తొలిసారిగా అంతరిక్షంలోకి ఓ తెలుగు మహిళ అడుగుపెడుతోంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ మహిళకు అంతరిక్షంలోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహన నౌకను ప్రయోగించనుంది. నలుగురు ప్రయాణికులు వెళ్తున్న ఈ వాహన నౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉండటం విశేషం. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యాక్షురాలి హోదాలో ఉన్న ఆమె …

Read More »

తెలంగాణలో ఏ ఒక్క సీమాంధ్రుడికైనా ఇబ్బంది కలిగిందా?

అనూహ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీటి పంచాయితీ అంతకంతకూ ముదురుతోంది. ఇదిలా ఉంటే.. దీనికి మించిన మాటల యుద్ధానికి తెర తీశారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. టీఆర్ఎస్ నేతలు. అందుకు భిన్నంగా ఏపీ అధికారపక్ష నేతలు మాత్రం ఆచితూచి అన్నట్లు వ్యాఖ్యలు చేశారే కానీ ఎక్కడా ఒక్క మాట అదనంగా అనేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. దూకుడుగా వ్యవహరించే తమ సహజ తీరుకు భిన్నంగా వైసీపీ నేతలు వ్యవహరించారు. …

Read More »

రుణపరిమితిలో భారీ కోత.. ఏపీ సర్కారుకు కేంద్రం భారీ షాక్

దేశంలో మరెక్కడా లేని రీతిలో ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో లబ్థిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు వేసే వినూత్న విధానాన్ని ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే బోలెడంత చర్చ నడుస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు ఏకంగా క్యాలెండర్ ఏర్పాటు చేసి.. నెల వారీగా పథకాల్ని అమలు చేస్తున్నారు. అయితే.. ఈ పథకాల అమలుకు ఆదాయం కంటే కూడా అప్పుల మీదనే …

Read More »

మంటలెక్కిస్తున్న మోడి

Modi

జనాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి మంటలెక్కిస్తున్నారు. ఒకవైపు పెట్రోలు, డీజల్ ధరలు పెంచేస్తున్న మోడి సర్కార్ తాజాగా గ్యాస్ బండ ధరను కూడా పెంచేసింది. గోడ దెబ్బ చెంపదెబ్బ లాగ ఒకవైపు ఫ్యూయల్ ధరల పెంపు, మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదల. మొత్తానికి కేంద్రం జనాలను రెండు వైపులా వాయించేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్ కు 100 రూపాయలు దాటిపోయింది. అలాగే డీజల్ లీటర్ ధర వంద …

Read More »

మోడీజీ.. మన చేతికి అధికారం వచ్చి ఏడేళ్లైంది

భారత్ కు తిరుగులేని అధినేతగా.. సమీప భవిష్యత్తులో మోడీ తప్పించి మరో అధినేత పేరును ప్రస్తావించే పరిస్థితి లేదన్న వేళ.. వచ్చిన కరోనా మహమ్మారి మొదట్లో ఆయన ఇమేజ్ ను మరింత పెరిగేలా చేసింది. ఇదే.. ఆయన దీపాలు పెట్టమని అడిగితే యావత్ దేశం దీపాలు పెట్టింది. గంట కొట్టమంటే గంట కొట్టింది. పూలు జల్లమని చెబితే పూలు చల్లింది. ఇలా ఆయన నోటి నుంచి టాస్కు రావటం ఆలస్యం.. …

Read More »

మన టీకాలకు ఓకే చెప్పని ఈయూకి భారత్ వార్నింగ్

దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్.. కోవీషీల్డ్ లకు సంబంధించి కొన్ని దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇంతకాలం ఎంతలా చెప్పినా మాట వినని దేశాలకు.. తనదైన శైలిలో సమాధానం చెప్పటం షురూ చేసింది. కొవిడ్ 19కు చెక్ పెట్టే వ్యాక్సిన్లలో భారత్ లో రూపొందించిన సీరం వారి కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాల్ని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ టీకా …

Read More »

జగన్ ఆస్తి పన్ను కట్టలేదా?

ప్రజలు నిబంధనలు పాటించాలని, సక్రమంగా పన్నులు కట్టాలని చెప్పే ప్రభుత్వ అధినేతలు.. ముందు తాము అవన్నీ సక్రమంగా చేస్తుండాలి. తమ వైపు ఎవరూ వేలెత్తి చూపించేలా చేయకూడదు. ఐతే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పాటించట్లేదని వెల్లడైంది. పన్నులు కట్టడంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ ప్రధాన పత్రికలో …

Read More »