Political News

‘రాహుల్ గాంధీ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు’

గ‌త కొద్దికాలంగా బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ అన్న‌ట్లుగా తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ‌లో రాజ‌కీయం రూట్ మారిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యువ‌నేత రాహుల్ గాంధీ త్వ‌ర‌లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ తాజాగా నేరుగా స్పందిస్తున్నారు. చోటామోటా నేత‌లు కాకుండా ఏకంగా ముఖ్య నేత‌లే కాంగ్రెస్ నాయ‌కుడి ప‌ర్య‌ట‌న‌ను టార్గెట్ చేశారు. …

Read More »

ఈట‌ల పై కేసీఆర్ కోపం త‌గ్గ‌లేదా…

దాదాపు ఏడాది కింద‌ట‌, సంచ‌ల‌న రీతిలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య‌నేత‌గా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి నుంచి ఉద్వాస‌న‌కు గురైన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను అన్యాయంగా టార్గెట్ చేశార‌ని ఆవేద‌న చెందిన ఈట‌ల టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అనంత‌రం వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో దిగి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ద్వారా త‌న స‌త్తా చాటారు. ఇదిలాఉంటే, ఇప్ప‌టికీ గులాబీ ద‌ళ‌ప‌తి …

Read More »

ఓయూలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌ద్దు: హైకోర్టు ఆదేశం

Rahul Gandhi

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ప‌ర్య‌టించేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ.. రాహుల్ గాంధీకి.. రాష్ట్ర హైకోర్టు ప‌చ్చ‌జెండా ఊపింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌ద్ద‌ని.. యూనివ‌ర్సిటీ అధికారుల‌ను ఆదేశించింది. అదేస‌మయంలో వైస్ చాన్సెల‌ర్‌.. రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు త‌క్ష‌ణం అనుమ‌తి మంజూరు చేయాల‌ని.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రాజ‌కీయ , వివాదాస్ప‌ద అంశాల జోలికి పోవ‌ద్ద‌ని.. కోర్టు కాంగ్రెస్‌ను ఆదేశించింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై నెల‌కొన్న సందేహాలు, వివాదాల‌కు తెర‌ప‌డిన‌ట్టు …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు మరో సెంటిమెంట్ దొరికేసిందట

నిర్దేశిత షెడ్యూల్ ప్ర‌కారమా లేదంటే ముంద‌స్తు ఎన్నిక‌ల ప్లాన్ ఉందా అనే అంచనాలు ప‌క్క‌న‌పెడితే… తెలంగాణ‌లో ఇప్పుడు ఎన్నిక‌ల రాజ‌కీయం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మొద‌లుకొని ప్ర‌తిప‌క్షాల వ‌ర‌కు ఈ ఎత్తుగ‌డ‌ల్లోనే బిజీగా ఉన్నాయి. అయితే, రాబోయే ఎన్నిక‌ల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాల‌న్న ల‌క్ష్యం అయితే టీఆర్ఎస్ పార్టీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు …

Read More »

చంద్రబాబు- టాటా కల నెరవేరింది!!

ఎస్‌! విజ‌న్ ఉన్న నాయ‌కుడు.. సేవ చేయాల‌నే సంక‌ల్పం ఉన్న టాటా సంస్థ‌. సంయుక్తంగా.. క‌న్న క‌ల‌.. కేన్స‌ర్ ఆసుప‌త్రి. క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా వేసిన అడుగులు ఇప్పుడు ఫ‌లించాయి. తిరుపతిలోని జూపార్కు రోడ్డులో టీటీడీ సహకారంతో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వ ర ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌ (ఎస్వీఐసీఏఆర్‌) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. క్యాన్సర్‌ బాధితులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి …

Read More »

మోడీ మ‌న‌సు గెలుకునేందుకు క‌ష్ట‌ప‌డుతున్న విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్య నేత విజ‌య‌సాయిరెడ్డి పార్టీ రాజ‌కీయాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో సోష‌ల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంటారు. వైఎస్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి జాతీయ రాజ‌కీయాల్లోని వివిధ ప‌రిణామాల‌పై కూడా అదే రీతిలో స్పందిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ క‌ళ్ల‌ల్లో ప‌డేందుకు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ యువ‌నేత …

Read More »

2024కు ముందే ఉమ్మ‌డి పౌర‌స్మృతి.. మైనారిటీలే టార్గెట్‌?

యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఎక్కువయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముందే కచ్చితంగా దీన్ని అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా భోపాల్ పర్యటనలో దీనిపై హింట్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ …

Read More »

కేటీఆర్‌ను ఓడిస్తా.. త్వ‌ర‌లో పాద‌యాత్ర:  కేఏ పాల్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్ర‌పంచ శాంతి దూత‌ కేఏ పాల్‌ విరుచుకుపడ్డారు. తనపై దాడి చేయించింది డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్ అని ఆరోపించారు. తాను వస్తున్నానని… ఇకపై తెలంగాణలో కేసీఆర్‌ ఆటలు సాగవని పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఇక మీ ఆటలు సాగవు’ అని ప్రభుత్వంపై పాల్‌ మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్‌ …

Read More »

119 రోజులు చాలు తెలంగాణ చుట్టొస్తా

Revanth Reddy

తెలంగాణ‌లో ఇంటి పార్టీ ని ఢీ కొన‌డం రేవంత్ రెడ్డి వ‌ల్ల కావ‌డం లేదు. గులాబీ దండు బాగానే ఉంది. ప‌నిచేస్తుంది. విమ‌ర్శ‌లు ఉన్నా, ఆర్థిక సంబంధ ఆరోప‌ణ‌లు నేరాలు ఉన్నాక కూడా బాగానే పేరు తెచ్చుకుంటుంది. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర స‌మితికి సంబంధించి  ఎక్కువ‌గా వ‌చ్చిన విమ‌ర్శ‌లు క్ర‌మంగా ఇప్పుడు త‌గ్గిపోతున్నాయి. అంటే ఆ పార్టీ ద బెస్టు అని కాదు కానీ, వాటిపై ఎన్ని సార్లు మాట్లాడినా …

Read More »

పీకే వెనుక ఉన్న‌ది ఎవ‌రో తెలిసిపోయింది

ప్ర‌శాంత్ కిషోర్‌… ప్రాంతీయ రాజ‌కీయాలే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లో  కూడా ఓ సంచ‌ల‌నం. వ్యూహ‌క‌ర్తగా విజ‌యం సాధించిన పీకే అక్క‌డి నుంచి రాజ‌కీయ నేత‌గా అడుగులు వేద్దాం అనుకున్న స‌మ‌యంలో కాంగ్రెస్‌తో జ‌ర్నీకి సిద్ధ‌మ‌య్యారు. అయితే, చర్చలు ఎంతకు తెగకపోవటంతో.. తాజాగా కొత్త పార్టీ ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ పంచుకున్నాడు. త్వరలో జాతీయ పార్టీని స్థాపించబోతున్నట్టు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చేశాడు. దీంతో దేశ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ …

Read More »

నేపాల్ పబ్ లో రాహుల్.. పక్కనున్న ఆమె ఎవరు?

మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తాజాగా సంచలన ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. యాభై ఏళ్ల వయసులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా వ్యవహరిస్తున్న ఆయనతో సన్నిహితంగా ఉండే మహిళలకు సంబంధించిన ఫోటోలు కొన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం.. రచ్చ చోటు చేసుకోవటం లాంటివి తెలిసిందే. తాజాగా నేపాల్ లో ఆయనో పబ్ లో ఉండటం కలకలం రేపితే.. ఆయన వెంట ఉన్న …

Read More »

పార్టీలో గొడవలు.. లక్ష్యం మాత్రం ఒక్కటే: రేవంత్

కాంగ్రెస్ పార్టీని పరేడ్ గ్రౌండ్ తో పోల్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారులో సదరు యాంకర్ పార్టీలోని విబేధాల గురించి ప్రస్తావించారు. దానికి రేవంత్ సమాధానమిస్తూ  పరేడ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేటోళ్ళు ఆడుతుంటారు. ఫుట్ బాల్ ఆడేవాళ్ళు ఆడుతుంటారు. బాడ్మింటన్ ఒకపక్క ఆడుతుంటారు, బాస్కెట్ బాల్ ఆడుతుంటారన్నారు. గ్రౌండ్ లో ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటారు అయితే ప్రత్యర్ధులతో మ్యాచ్ …

Read More »