టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్నాళ్లుగా చేస్తున్న నియోజకవర్గాల సమీక్షలో ఇప్పటి వరకు 111 నియోజకవర్గాలపై ఆయన దృష్టి సారించారు. తా జాగా పార్టీ కార్యాలయం.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే.. ఏకంగా.. 111 నియోజకవర్గాల పై చంద్రబాబు సమీక్ష పూర్తి చేయడం.. నిజంగా రికార్డే. అయితే.. ఈ సందర్భంగా ఆయన తేల్చింది ఏంటి? పార్టీని గాడిలో పెట్టింది ఏంటి? నేతలకు చేసిన సూచనలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే.. ఇన్ని నియోజకవర్గాలపై సమీక్ష చేశారంటే..చంద్రబాబు ఊరికేనే టైం వేస్ట్ చేసుకోరుకదా! సో.. ఆయనేదోకీలక విషయాలే చెప్పి ఉంటార నే చర్చ జరుగుతోంది. బయటకు వెలుగు చూసిన కొన్ని విషయాలను పరిశీలిస్తే.. అందరూ కలిసి మెలిసిముందుకు సాగాలని మాత్రం చంద్రబాబు అందరికీ గట్టిగా చెప్పారు. ఈ విషయంలో ఆయన పక్కా సూచనలు చేశారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతినడానికి..గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా.. ఈ సమైక్యత లేకపోవడమే. సో… ఈ నేపథ్యంలో అసలు నియోజకవర్గాల సమీక్షను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మరి చంద్రబాబు అనుకున్నది సాధించారా? అంటే.. ప్రశ్నగానే కనిపిస్తోంది. ఆయన 111 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి చేసినా.. వీటిలో సగం నియోజకవర్గాల్లో కూడా.. నాయకులు ఇప్పటి వరకు బయటకు రాలేక పోతున్నారు. ఎవరూ కూడా.. కలివిడిగా.. ముందుకు సాగాలనే తీర్మానం చేసుకున్న నియోజకవర్గం ఒక్కటి కూడా కనిపించడం లేదు. వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు.. వైసీపీలో కలివిడి బాగా కనిపించింది. జగన్‌ను సీఎం ను చేసుకునేందుకు రెడ్డి సామాజిక వర్గం అందరినీ కలుపుకొనిపోయింది.
ఎక్కడో ఉన్న నాయకులను కూడా.. ఏకతాటిపైకి తెచ్చి.. పార్టీని ముందుండి నడిపించారు చాలా మంది నాయకులు. ఈ తరహా సూత్రమే చంద్రబాబు ఎంచుకున్నారనేది వాస్తవం. అందుకే.. ఆయన ఎన్నికలకు ఏడాదిన్నర ముందే నియోజకవర్గాల్లో నాయకులను అలెర్ట్ చేశారు. వారికి కోన్ని దిశానిర్దేశాలు కూడా.. చేశారు. అయితే.. అనుకున్న విదంగా మాత్రం ఫలితం రావడం లేదు. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదో అనే బెంగో.. లేక.. వైసీపీ బలంగా ఉంది.. దీనికి ఢీ కొట్టగలమో లేదో.. అనే చింతో అర్ధం కావడం లేదు. కానీ, పని మాత్రం అయిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates