Political News

నిన్న ఈటీవీ.. నేడు ఈనాడు

తెలుగు మీడియాలో ఉన్నంతలో కొంచెం విలువలతో, వివాదాలకు దూరంగా, పద్ధతిగా సాగేది ఈనాడు-ఈటీవీ గ్రూపే. ఈ మీడియా మీద కూడా విమర్శలు లేకపోలేదు కానీ.. వాళ్ల రాజకీయ ఉద్దేశాలు, విధానాల సంగతి పక్కన పెడితే వార్తల ప్రెజెంటేషన్ విషయంలో మిగతా మీడియాల్లాగా సెన్సేషనలిజం కోసం ప్రయత్నించరు. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా.. వార్తల్ని ఉన్నదున్నట్లుగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈటీవీ ఎంత సంప్రదాయబద్ధంగా.. నో నాన్సెన్స్ అన్నట్లుగా సాగిపోతుంటుంది.అలాంటి …

Read More »

ఏపీలో స్పీడు తగ్గింది, తెలంగాణలో పెరిగింది

గత 24 గంటల్లో కరోనా వేగం కొంతవరకు తగ్గినా కేసుల పెరుగుదల మాత్రం నమోదైంది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 11 కేసులు నమోదు అయ్యాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 314 కి పెరిగింది. గుంటూరులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదైంది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత ఒక్క కేసు నమోదైంది. …

Read More »

ట్రంప్ వార్నింగ్.. నిషేధం ఎత్తేసిన భార‌త్

క‌రోనా వైర‌స్‌కు ఉన్నంతలో మెరుగ్గా ప‌ని చేస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (మ‌లేరియాకు వాడే మందు) ఔష‌ధాన్ని స‌ర‌ఫ‌రా చేయాల‌న్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విన్న‌పాన్ని భార‌త్ మ‌న్నించింది. అమెరికాతో పాటు అవసరమైన ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే దిశ‌గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమ‌తిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఎత్తివేసింది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల …

Read More »

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌.. మ‌ళ్లీ లైన్లోకొచ్చారు

గ‌త నెలలో జ‌ర‌గాల్సిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక ఎన్నిక‌ల్ని కరోనా కార‌ణంగా వాయిదా వేస్తూ సంచ‌లన నిర్ణ‌యం తీసుకుని చ‌ర్చ‌నీయాంశం అయ్యారు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌. ఆ నిర్ణ‌యంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హా వైకాపా పెద్ద‌లు ఎలా మండిప‌డ్డారో.. ఈసీపై ఎంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారో తెలిసిందే. వాళ్ల విమ‌ర్శ‌లు, బెదిరింపుల త‌ర్వాత త‌న‌కు భ‌ద్ర‌త అవ‌స‌ర‌మంటూ కేంద్రానికి లేఖ రాయ‌డంతో ర‌మేష్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తి …

Read More »

లాక్ డౌన్ పొడిగింపే.. సంకేతాలిచ్చేసిన కేసీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 21 రోజుల దేశ‌వ్యాప్త లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియ‌నుంది. ఐతే క‌రోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఏమో కానీ.. తెలంగాణ‌లో మాత్రం లాక్ డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా ప్రెస్ మీట్‌ను బ‌ట్టి ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది. …

Read More »

షాకింగ్: 3 డాక్టర్లు, 26 మంది నర్సులకు కరోనా

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్న చిగురుటాకులా వణికిపోతున్నాయి. పేద దేశం, ధనిక దేశం, అగ్ర రాజ్యం, అనామక దేశం….అంటూ తేడా లేకుండా కరోనా తన కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.75 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 69,500 మంది మృత్యువాత పడ్డారు. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే.ఇప్పటివరకు భారత్ లో 4067 వేల …

Read More »

మోడీని ఫిక్స్ చేయబోయిన ట్రంప్.. రివర్స్ లో బుక్ చేసిన మోడీ

తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. ఎత్తుకు పైఎత్తు. దెబ్బకు దెబ్బ మామూలే. ఇద్దరి వ్యక్తుల మధ్య డీల్ కు ఉండే సాధారణ లక్షణాలే.. రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాల్లోనూ కనిపిస్తాయి. అయితే.. ఒప్పందం ఏదైనా.. తన ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఎదుటోడికి మేలు చేసేలా నిర్ణయాన్ని తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే.. జరిగే నష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కరోనాకు మందు లేని వేళ.. అంతో ఇంతో ప్రభావం …

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చే డబ్బులతో ఏం కొనాలో చెప్పేసిన కేసీఆర్

కరోనా వేళ.. ఎవరికి వారు వారికి తోచినంత మొత్తాన్ని విరాళాల రూపంలో అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలా వచ్చిన మొత్తాల్ని దేని కోసం వినియోగిస్తున్నారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న క్వశ్చన్లు రావటం ఖాయం. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున వస్తున్న నిధుల్ని దేని కోసం వినియోగించాలి? ఏమేం కొనాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలోనూ …

Read More »

ఐటీ ఉద్యోగాలకు ఎసరు తప్పదు!

కరోనా విపత్తు వల్ల ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య కంటే ఈ లాక్ డౌన్స్ వల్ల మునుముందు రాబోయే తలనొప్పులే తీవ్రంగా ఉంటాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతూ ఉండగా ఐటీ రంగం దీనికి బాగా ఎఫెక్ట్ కానుంది. చాలా కంపెనీలు మూత పడే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.పలు ఐటీ సంస్థలు యూకే, యూఎస్ లో ఉండడం వల్ల, అవి కరోనా వైరస్ కి తీవ్రంగా నష్టపోవడం …

Read More »

గుడ్ న్యూస్.. కరోనాకు ఆ మందు పని చేస్తుందట

కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల చూసినా దీని గురించే చర్చ. ఈ మహమ్మారి ధాటికి రోజూ వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాదాపు 11 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు. కొన్ని నెలల కిందటే బయటపడ్డ ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియను వివిధ దేశాలు చేపడుతున్నాయి.ఐతే ఆ పరిశోధనలు పూర్తయి.. వ్యాక్సిన్ బయటికి రావడానికి చాలా సమయం పట్టేట్లుంది. ఈలోపు అందుబాటులో ఉన్న మందులతోనే వివిధ …

Read More »

దేశమంతా కరోనా భయంలో ఉండగా..

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి దృష్టి కరోనా వైరస్ మీదే ఉంది. ఇండియాలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు తలెత్తుతాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవస్థలన్నీ ఆ మహమ్మారిని నిలువరించే పనిలోనే నిమగ్నమయ్యాయి. ప్రధాన మంత్రి సహా మంత్రి వర్గం అంతా దీని మీదే దృష్టిసారించింది. సైన్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొంతమంది సిబ్బందిని విధుల నుంచి దూరం పెట్టారు. ఇలాంటి సమయంలో ఇండియా మీద …

Read More »

నిమ్మగడ్డ కాపాడింది బాబుని కాదు రాష్ట్రాన్ని !!

కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకున్న దేశాలన్నీ ఏమవుతున్నాయో ప్రపంచం కళ్లారా చూస్తోంది. ఒక ఇటలీ.. ఒక అమెరికా.. ఒక స్పెయిన్ ఎంత మూల్యం చెల్లించాయో.. ఇప్పుడు చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు కూడా లేక ఎలా హాహాకారాలు చేస్తున్నాయో చూస్తున్నాం. త్రుటిలో తప్పింది కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి పరిస్థితినే ఈ సరికి ఎదుర్కొంటుండేది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాస్త ముందే స్పందించి ఏపీలో స్థానిక …

Read More »