సంక్షోభంలో కూరుకుపోతున్న మహారాష్ట్ర రాజకీయాలకు రాష్ట్రపతి పాలన ఒకటే మార్గమా ? క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మామూలుగా అయితే సంక్షోభంలో నుండి బయటపడేందుకు ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే పార్టీపరంగా పావులు కదపాలి. ఒకవైపు ఆ ప్రయత్నాలు జరుగుతుండగానే గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ యాక్టివ్ అయిపోయారు. ఖోషియారీకి ముఖ్యమంత్రికి మధ్య ఏ మాత్రం పడటంలేదు.
థాక్రేని ఇబ్బందులు పెట్టడమే టార్గెట్ గా గతంలో కూడా చాలాసార్లు గవర్నర్ పావులు కదిపారు. ఎంత చిన్న అవకాశం వచ్చినా గవర్నర్ వెంటనే యాక్టివ్ అయిపోతున్నారు. అలాంటిది ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోతే చూస్తూ కూర్చుంటారా ? అందుకనే సీఎంకు ప్యారలెల్ గా గవర్నర్ కూడా రాజకీయం మొదలు పెట్టేశారు. తిరుగుబాటు ఎంఎల్ఏలను దారికి తెచ్చుకునేందుకు ఎంఎల్ఏలతో పాటు వాళ్ళ కుటుంబాలకు కల్పించిన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించింది.
వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని ఎంఎల్ఏలతో పాటు వాళ్ళ కుటుంబాలకు కూడా భద్రతను మళ్ళీ కల్పించారు. సంక్షోభం విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందుకునేందుకు డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. గవర్నర్ అంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే. కాబట్టి థాక్రేకి వ్యతిరేకంగానే గవర్నర్ పావులు కదుపుతారనటంలో సందేహంలేదు.
సంక్షోభం మరో రెండు రోజులు ఇలాగే కంటిన్యూ అయితే కచ్చితంగా గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రపతి పాలన విధించేందుకు వీలుగా తిరుగుబాటు ఎంఎల్ఏలకు మద్దతుగా బీజేపీ తెరవెనుక నుండి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధిస్తే కానీ బీజేపీకి పట్టు రాదు. మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉన్నంతకాలం బీజేపీ చేయగలిగేదేమీలేదు. అందుకనే వెంటనే రాష్ట్రపతి పాలన విదించేస్తే పాలన మొత్తం గవర్నర్ చేతిలోకి వెళిపోతుంది. అప్పుడు బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాట. కాబట్టి సంక్షోభం కంటిన్యు అవ్వాలని బీజేపీ వెంటనే పరిష్కారం అవ్వాలని శివసేన కోరుకుంటున్నాయి. అయితే వెంటనే పరిష్కారమయ్యే అవకాశాలున్నాయా ?
Gulte Telugu Telugu Political and Movie News Updates