తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అధికార పార్టీ వైసీపీకి సంబంధించి సంచలన ప్రకటన చేశారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 45 నుంచి 67 స్థానాలు వస్తాయని.. చెప్పారు. తనకు అందిన సర్వే రిపోర్టులు సహా.. మేధావి వర్గాలు వేసిన అంచనాల ప్రకారం.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని తెలుసుకున్న తర్వాతే తాను ఈ ప్రకటన చేసినట్టు పవన్ చెప్పకొచ్చారు. అంతేకాదు.. జనసేన పుంజుకుందన్నారు. వాస్తవానికి ఈ ప్రకటన సంచలనమే . ఎందుకంటే.. పవన్ చెప్పిన దానిని బట్టి.. 2014 సీన్ రిపీట్ కానుందనేది ఆయన మాటల అంతరార్థంగా ఉంది.
అయితే..ఇటీవల వరకు కూడా పవన్.. చెప్పిన దానిని బట్టి చూస్తే.. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరకత వ్యక్తంచేస్తున్నారని.. వైసీపీ నేతలను తరిమితరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. ఒక్కసీటు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. పార్టీ ఆవిర్భావం రోజు.. తర్వాత జరిగిన.. విశాఖలో సభలోనూ.. చెప్పుకొచ్చారు. దీనిని అందరూ..నిజమేనేమో.. అనుకున్నారు. ఎందుకంటే.. కేవలం వైసీపీ సర్కారు.. సంక్షేమంపైనే దృష్టి పెట్టింది.
అభివృద్ధిని, ముఖ్యంగా మూడు రాజధానులను అటకెక్కించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని బట్టి పవన్ బాగానే చెప్పారని అప్పట్లో సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు పవన్ అదే నోటితో.. దాదాపు 67 సీట్ల వరకువైసీపీకి ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. అంటే దీనిని బట్టి.. వైసీపీ హవా పెద్దగా తగ్గలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో దాదాపు టీడీపీ-జనసేన-బీజేపీ కూడా కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరి ఇంత మంది కలిసినా.. వైసీపీ సర్కారుపై ప్రజలు వ్యతిరకత వ్యక్తం చేస్తున్నారని.. చెబుతున్నా.. ఈ రిజల్ట్ రావడం అంటే.. విపక్షాల ఐక్యతపైనే.. పెద్ద ప్రశ్న వస్తోంది. ప్రజల్లో ఈ మూడు పార్టీలు కలుసుకోవడంపై.. ఏదో అభిప్రాయం ఉందనే తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రభుత్వ వ్యతిరేతక.. మూడు పార్టీల కలయిక.. వంటి ఈక్వేషన్లు పనిచేస్తే.. వైసీపీ తుడిచి పెట్టుకుపోవాలి. అంటే.. ఒకటి రెండు లేదా.. 10 లోపు మాత్రమే సీట్లు రావాలి. అలా కాదు.. 2014లో వచ్చిన సీట్లు వస్తాయని అంటే..వైసీపీ వైపు ప్రజలు మొగ్గుతున్నారనే అర్ధం చేసుకోవాలని అంటున్నారు వైసీపీ నాయకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates