లిక్క‌ర్ కింగ్ వార‌సుడి అరంగేట్రం..

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌భ్యులు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి పోటీ చేస్తార‌ని.. త‌న‌కు బ‌దులుగా.. త‌న కుమారుడిని గెలిపించాల‌ని.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతో అస‌లు.. ఈ రాఘ‌వ‌రెడ్డికి ఉన్న ప్ర‌జాసేవ ఏంటి? ఆయ‌న ఏమేర‌కు పుంజుకునే అవ‌కాశం ఉంది.. అస‌లు వైసీపీలో టికెట్ ల‌భిస్తుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్న అంశం.

ఆది నుంచి లిక్క‌ర్ బిజినెస్‌తో కోట్లు గ‌డించిన ఫ్యామిలీ.. మాగుంట కుటుంబం. తండ్రి స‌హా.. శ్రీనివాసుల అన్న‌ద‌మ్ములు అంద‌రూ కూడా.. ఈ లిక్క‌ర్ వ్యాపారంలోనే పైకివ‌చ్చారు. ఇక‌, తండ్రితోపాటు రాఘ‌వ రెడ్డి కూడా.. ఈ బిజినెస్‌లోనే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. తండ్రికోసం.. కొంత ప్ర‌చారం అయితే.. చేశారు. త‌ర్వాత‌.. ఆయ‌న ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. అంతేకాదు.. తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు పోటీ చేస్తార‌ని.. చెప్పిన మాగుంట కూడా త‌న కుమారుడిని మీడియాకు రాజ‌కీయంగా ప‌రిచ‌యం లేదు.

ఈ క్ర‌మంలో అస‌లు.. రాఘ‌వ‌రెడ్డికి ఉన్న గ్రాఫ్ ఎంత‌? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర‌మైన పోటీ నెల‌కొంటుందనే వాద‌న బ‌లంగా ఉంది. అంతేకాదు.. టికెట్లు కూడా.. అత్యంత ఆచితూచి ఇస్తార‌నే ప్ర‌చారం కూడా ఉంది. ఈ నేప‌థ్యంలోనే.. రాఘ‌వ‌రెడ్డి చుట్టూ అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం లిక్క‌ర్ వ్యాపారంలోనే ఉన్న రాఘ‌వ‌రెడ్డి.. ఢిల్లీ లేదా.. హైద‌రాబాద్‌లో మ‌కాం వేసుకుని.. అక్క‌డ నుంచే వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఆయ‌న ఒంగోలు పార్ల‌మెంటు సీటులో అడుగుపేట్ట‌నున్నారు. అయితే.. ఆ యన పెద్ద‌గా ప‌ప్ర‌జ‌ల‌కు లేరు. కానీ, మాగుంట ఫ్యామిలీ హవా ఎలానూ ఉంది క‌నుక‌.. బ‌ల‌మైన పోటీ అయితే ఇస్తారు. కానీ.. ప్ర‌త్య‌ర్థులు క‌నుక‌.. ఆయ‌న‌కు-మ‌ద్యం వ్యాపారానికి మ‌ధ్య లింకు పెట్టి.. వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తే.. మాత్రం క‌ష్ట‌మ‌ని చెబుతున్నారు ప రిశీల‌కులు. అప్పుడు.. ఇబ్బంది త‌ప్ప‌ద‌ని అంటు న్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మారనున్న నేప‌థ్యంలో అస‌లు వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న‌కు సీటు ద‌క్కుతుందా? మ‌రోసారి శ్రీనివాసుల రెడ్డికే అవ‌కాశం ద‌క్కుతుందా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.