హైదరాబాద్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారనే సంచలన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు. నిందితులను ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదని, అది కేవలం కల్పితేమనని అన్నారు.
“పబ్‌లో మందు తాగి వస్తూ పవన్ ఇంటివద్ద యువకులు కారు ఆపారు. కారు తీయాలని అడిగిన పవన్ సెక్యూరిటీతో ఆ ముగ్గురు యువకులు గొడవకు దిగారు. తాగిన మైకంలోనే పవన్ ఇంటివద్ద గొడవ పడినట్లు వారు ఒప్పుకున్నారు. పవన్ ఇంటివద్ద ఆపిన గుజరాత్ రిజిస్ట్రేషన్ కారు సాయికృష్ణది” అని పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసుల వివరణపై జనసేన నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది.
నాదెండ్ల ప్రకటనతో..
ఏపీలో విశాఖ ఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ గురువారం పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తున్నది అభిమానులు కాదని, వారి కదలికలు అనుమానించేలా ఉన్నాయని వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి తమ అధినేత ఇంటి వద్ద ముగ్గురు గొడవ చేశారని.. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో తెలంగాణ జనసేన నేత ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
పవన్ ఇంటి నుంచి వెళ్లినపుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. పవన్‌ను అనుసరిస్తున్నది.. ఆయన అభిమానులు కాదన్న నాదెండ్ల మనోహర్.. వారి కదలికలు అనుమానించేలా ఉన్నాయని చెప్పారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసు సంచలనం సృష్టించింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా స్పందించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా పోలీసులు మాత్రం అసలు ఏమీ జరగలేదని వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates